JioBharat 4G Phone : జియోభారత్ 4G ఫోన్.. ధర రూ.999 మాత్రమే.. ఫీచర్లు కోసమైన ఇప్పుడే కొనేసుకోండి..!

JioBharat 4G Phone : భారత్‌లో సరసమైన ధరకే (JioBharat 4G) ఫోన్‌ను రిలయన్స్ జియో ప్రవేశపెట్టింది. జియో కార్బన్‌ సహకారంతో పాత 2G ఫోన్‌ల నుంచి మిలియన్ల మందిని వేగవంతమైన ఫోన్‌గా మార్చాలనే లక్ష్యంగా పెట్టుకుంది.

JioBharat 4G Phone available for purchase on Amazon

JioBharat 4G Phone : ప్రముఖ టెలికాం కంపెనీ రిలయన్స్ జియో (Reliance Jio) నుంచి సరికొత్త జియోభారత్ 4G (JioBharat 4G) ఫోన్‌ను ప్రవేశపెట్టింది. ఇప్పుడు ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) ద్వారా భారత మార్కెట్లో కొనుగోలుకు అందుబాటులో ఉంది. జియో ఈ కొత్త డివైజ్‌ను ప్రతి ఒక్కరికీ, పాత 2G ఫోన్‌లను ఉపయోగిస్తున్న వారికి ఇంటర్నెట్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇంకా ఏమిటంటే.. జియోభారత్ 4G ఫోన్ ఇప్పుడు అమెజాన్‌లో కొనుగోలుకు రెడీగా ఉంది. ఈ డివైజ్ స్పెసిఫికేషన్‌లు, ధర వివరాలను ఓసారి పరిశీలిద్దాం..

Read Also : Jio AirFiber Launch Date : జియో ఎయిర్‌‌ఫైబర్ అంటే ఏంటి? లాంచ్ డేట్ ఎప్పుడు? ధర ఎంత? ఏయే బెనిఫిట్స్ పొందవచ్చు? పూర్తి వివరాలివే..!

జియోభారత్ 4G ఫోన్ 1.77-అంగుళాల TFT డిస్ప్లేను కలిగి ఉంది. 3.5mm హెడ్‌ఫోన్ జాక్‌ను కలిగి ఉంది. దీని కెమెరా, 0.3MP వద్ద ఉన్నప్పటికీ, తక్కువ కాంతిలో మెరుగైన క్వాలిటీ LED ఫ్లాష్‌తో వస్తుంది. ఈ ఫోన్‌ను శక్తివంతం చేయడం 1000mAh బ్యాటరీ, రోజంతా అవసరాలకు అనుగుణంగా ఉండేలా చూస్తుంది. ఈ ఫోన్ డిజైన్ సొగసైన యాష్ బ్లాక్ వేరియంట్‌లో వస్తుంది. మొత్తం 23 భాషలకు సపోర్టు ఇవ్వడం ద్వారా భారత్‌లో యూజర్ల విభిన్న భాషా ప్రాధాన్యతలను అందిస్తుంది.

JioBharat 4G Phone available for purchase on Amazon

జియోభారత్ ఫీచర్లు ఇవే :
ఈ ఫోన్ స్పెషల్ ఫీచర్లలో ఒకటి.. బాహ్య మైక్రో SD కార్డ్ సపోర్ట్ కలిగి ఉంది. ఈ ఫోన్ 128GB వరకు స్టోరేజీని విస్తరించుకోవచ్చు. కార్బన్‌తో కలిసి అభివృద్ధి చేసిన ఈ డివైజ్ డ్యూయల్ బ్రాండింగ్‌ను ప్రదర్శిస్తుంది. ఫ్రంట్ సైడ్ ‘భారత్’, బ్యాక్ కార్బన్ లోగోను ప్రదర్శిస్తుంది. స్విఫ్ట్ 4G ఇంటర్నెట్‌కు కనెక్ట్ చేయగల సామర్థ్యంతో ఈ ఫోన్ అద్భుతమైన స్పెసిఫికేషన్‌లను కేవలం రూ. 999కు ఆఫర్ చేస్తుంది.

ఈ కొత్త ఫోన్‌ కొనుగోలుపై జియో కేవలం రూ.123తో ఇంటర్నెట్ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. 28 రోజుల వ్యవధితో ఈ ప్యాకేజీపై అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, 14GB డేటా, సినిమా, వీడియో స్ట్రీమింగ్‌ కోసం జియో యాప్‌లకు యాక్సెస్‌ని అందిస్తుంది. జియో యూజర్లు వార్షిక ఇంటర్నెట్ ప్లాన్ ధర రూ. 1234 ద్వారా అన్‌లిమిటెడ్ కాల్స్, 168GB డేటాతో వస్తుంది.

జియోభారత్ 4G ఫోన్‌ కొనుగోలు చేసేవారికి ఆగస్టు 28 నుంచి ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ అమెజాన్ ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంది. ఆసక్తి గల కస్టమర్‌లు రిలయన్స్ డిజిటల్ స్టోర్‌ల నుంచి కొనుగోలు చేసే ఆప్షన్ కూడా ఉంది. అయితే, భవిష్యత్తులో ఇతర రిటైల్ అవుట్‌లెట్లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుందా లేదా అనే విషయాన్ని కంపెనీ ఇంకా వెల్లడించలేదు.

Read Also : Toyota Innova HyCross : ఇథనాల్‌‌తో నడిచే కారు వచ్చేసిందోచ్.. ప్రపంచంలోనే ఫస్ట్ టయోటా ఇన్నోవా హైక్రాస్ ఫ్లెక్స్-ఫ్యూయల్ MPV కారు..!

ట్రెండింగ్ వార్తలు