OnePlus Nord CE : వన్‌ప్లస్ Nord CE స్మార్ట్‌ఫోన్‌లో కొత్త ఆండ్రాయిడ్ 12OS అప్‌డేట్ వచ్చేసింది!

OnePlus Nord CE : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ నుంచి భారత మార్కెట్లో OnePlus Nord CE స్మార్ట్ ఫోన్ అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్ ఫోన్లో Android 12 OS అప్‌డేట్ వచ్చేసింది.

OnePlus Nord CE : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ నుంచి భారత మార్కెట్లో OnePlus Nord CE స్మార్ట్ ఫోన్ అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్ ఫోన్లో Android 12 OS అప్‌డేట్ వచ్చేసింది. ఈ డివైజ్ 2021లో ఆండ్రాయిడ్ 11తో లాంచ్ అయింది. ఆండ్రాయిడ్ 13 OS రిలీజ్‌కు దగ్గరగా నెక్స్ట్ ఆండ్రాయిడ్ OS వెర్షన్‌ రానుంది. ఈ కొత్త అప్‌డేట్ 4GB సైజుతో వచ్చింది. యూజర్లు మొబైల్ డేటాను వద్దనుకుంటే.. Wi-Fiని ఉపయోగించి అప్‌డేట్‌ను డౌన్‌లోడ్ చేయాలని సూచిస్తోంది. కొత్త డేటా ప్రకారం.. లేటెస్ట్ OnePlus Nord CE అప్‌డేట్ కొత్త స్టైల్ ఆప్షన్లతో వస్తుంది.

OnePlus స్కౌట్‌కి యాక్సెస్, కొత్త OnePlus వాచ్ కార్డ్‌ని పొందవచ్చు. ఈ కొత్త అప్‌డేట్‌తో Canvas AoD విభాగంలో కొత్త మోడల్ లైన్‌లు, కలర్లను యాడ్ చేస్తుంది. కొత్త బ్రష్‌లు, స్ట్రోక్‌లు అలాగే కలర్ అడ్జస్ట్‌మెంట్ కోసం సపోర్ట్ కూడా ఉంటాయి. కంపెనీ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఫీచర్‌కి కూడా అందుబాటులోకి రానుంది. గ్యాలరీ యాప్ రెండు వేళ్ల చిటికెడు సైన్‌తో విభిన్న లేఅవుట్‌ల మధ్య మారడానికి సపోర్టును అందిస్తుంది.

OnePlus Nord CE finally get Android OxygenOS 12 update in India

OnePlus Nord CE యూజర్లు డార్క్ మోడ్‌లో మూడు అడ్జెస్ట్ లెవల్స్ కూడా చూడవచ్చు. ఈ అప్‌డేట్ మెరుగైన డెస్క్‌టాప్ ఐకాన్లతో కూడా ఆప్టిమైజ్ చేస్తుంది. కంపెనీ ప్రకారం.. లోడ్ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా సిస్టమ్ స్పీడ్‌గా రన్ అయ్యేందుకు AI సిస్టమ్ బూస్టర్‌ను 2.1కి ఆప్టిమైజ్ చేస్తుంది.

లేటెస్ట్ EB2101_11.C.04 ఫర్మ్‌వేర్ వెర్షన్ రిలీజ్ అవుతుంది. ఈ క్రమంగా అన్ని డివైజ్‌లకు చేరింది. ఒకవేళ కొత్త అప్‌డేట్ కోసం నోటిఫికేషన్‌ అందించనుంది. మీరు సెట్టింగ్‌ల సెక్షన్లలో మాన్యువల్‌గా చెక్ చేయవచ్చు. Settings> క్రిందికి స్క్రోల్ చేయండి సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌పై Press చేయండి. మీ డివైజ్ Update పొందితే.. మీరు ఇన్‌స్టాల్ చేయవచ్చు. అప్‌డేట్‌ని డౌన్‌లోడ్ చేసే ముందు మీ OnePlus Nord CEకి 30 శాతం ఛార్జ్ ఉండేలా చూసుకోవాలి.

Read Also : OxygenOS 13 Unveiled : ఈ OnePlus ఫోన్లకు కొత్త OxygenOS 13 అప్‌డేట్.. ఇందులో మీ ఫోన్ ఉందేమో చెక్ చేసుకోండి!

ట్రెండింగ్ వార్తలు