WhatsApp Hide IP : వాట్సాప్‌లో కాల్స్ సమయంలో మీ ఐపీ అడ్రస్ హైడ్ చేసుకోవచ్చు.. ఇక స్కామర్లు మీ లొకేషన్ ట్రాక్ చేయలేరు!

WhatsApp Hide IP : వాట్సాప్ సరికొత్త ఫీచర్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు నివేదించింది. యూజర్ల కాల్స్ సమయంలో వారి IP అడ్రస్ హైడ్ చేసేందుకు అనుమతిస్తుంది.

WhatsApp may soon allow users to hide IP address during calls

WhatsApp Hide IP : ప్రముఖ మెటా యాజమాన్యంలోని వాట్సాప్ (Whatsapp) తమ యూజర్ల కోసం ఇంట్రెస్టింగ్ ఫీచర్ తీసుకొస్తోంది. భారత్‌లో సైబర్ ఫ్రాడ్ కేసులు పెరిగిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా ఈ స్కామ్‌లకు అత్యంత హాని కలిగించే ప్లాట్‌ఫారమ్‌లలో వాట్సాప్ ఒకటి. మిలియన్ల మంది యాక్టివ్ యూజర్లతో ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ లక్ష్యంగా స్కామర్లు మోసాలకు పాల్పడుతున్నారు. వినియోగదారులను ప్రొటెక్ట్ చేసేందుకు మెటా కొత్త భద్రతా ఫీచర్‌పై పని చేస్తోంది. ఈ ఫీచర్ కాల్ సమయంలో యూజర్ల IP అడ్రస్ ఉపయోగించి వారి లొకేషన్ ట్రాక్ చేయకుండా నివారించేందుకు అనుమతిస్తుంది.

WABetaInfo ప్రకారం.. వాట్సాప్ కాల్ ప్రైవసీలో సెట్టింగ్‌లలో ‘Protect IP address in calls’ అనే కొత్త ఆప్షన్‌పై టెస్టింగ్ చేస్తోంది. వాట్సాప్ సర్వర్‌ల ద్వారా కాల్‌ను రూట్ చేయడం ద్వారా వాట్సాప్ కాల్ సమయంలో మీ లొకేషన్‌ను ట్రాక్ చేయలేరు. కొత్త ఆప్షన్ ద్వారా కాల్స్ సమయంలో యూజర్ల ప్రైవసీ రిలే ఫీచర్ లాగా పనిచేస్తుంది. (WhatsApp) సర్వర్‌ల ద్వారా సురక్షితంగా కాల్స్ చేసుకోవచ్చు.

Read Also : Amazfit Bip 5 Smartwatch : కొత్త స్మార్ట్‌వాచ్ కావాలా? దిమ్మతిరిగే ఫీచర్లతో Amazfit Bip 5 స్మార్ట్‌వాచ్.. ధర ఎంతో తెలిస్తే కొనకుండా ఆగలేరు..!

ఈ సమయంలో యూజర్ల లొకేషన్ గుర్తించడం కష్టతరం చేస్తుందని నివేదిక పేర్కొంది. అయితే, ఈ ఫీచర్ యూజర్ల అదనపు భద్రతను అందించినప్పటికీ, కాల్ క్వాలిటీ విషయంలో కొంత ఇబ్బంది ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే.. కాల్ వాట్సాప్ సర్వర్‌ల ద్వారా రూట్ అవుతుంది. ఇది డేటాను ఎన్‌క్రిప్ట్ చేసి రూట్ చేస్తుంది. ఎన్‌క్రిప్షన్, రూటింగ్ ప్రాసెస్‌ కారణంగా కాల్ క్వాలిటీపై ప్రభావం పడుతుంది. కొత్త IP అడ్రస్ ప్రొటెక్షన్ ఫీచర్ కాల్స్ సమయంలో మీ లొకేషన్ డేటా ప్రైవసీని మెరుగుపరచడానికి రూపొందించింది.

WhatsApp may soon allow users to hide IP address during calls

మీరు కమ్యూనికేట్ చేస్తున్న వ్యక్తులకు మీ కచ్చితమైన లొకేషన్ గుర్తించడం మరింత సవాలుగా మారుతుంది. వాట్సాప్ ఇంకా ఈ ఫీచర్ గురించి అధికారిక ప్రకటన చేయలేదు. Wabetainfo మొదటిసారిగా ఆండ్రాయిడ్ 2.23.18.15 అప్‌డేట్‌తో వాట్సాప్ బీటాలో కనిపించే ఈ ఫీచర్‌ని టెస్టింగ్ చేస్తున్నట్టు వెల్లడించింది. రాబోయే యాప్ అప్‌డేట్‌లో ఈ కొత్త ఫీచర్ ఉండే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే.. వాట్సాప్ ఇటీవల సెట్టింగ్‌లలో కొత్త ‘Silence Unknown Callers’ ఫీచర్‌ను రిలీజ్ చేసింది.

మెటా అధికారిక బ్లాగ్ పోస్ట్‌లో ఫీచర్లను ప్రకటిస్తూ.. కొత్త ‘Silence Unknown Callers’ ఫీచర్ వాట్సాప్ యూజర్లకు మరింత ప్రైవసీతో పాటు ఇన్‌కమింగ్ కాల్‌లపై కంట్రోల్ ఇస్తుందని వెల్లడించింది. ఈ ప్లాట్‌ఫారమ్‌లో ఫీచర్ స్పామ్, స్కామ్‌లు, గుర్తు తెలియని వ్యక్తుల నుంచి కాల్‌లను ఆటోమాటిక్‌గా క్యాప్చర్ చేస్తుంది.

ఇప్పుడు, వాట్సాప్‌లో గుర్తు తెలియని కాంటాక్టుల నుంచి వచ్చే ఇన్‌కమింగ్ కాల్‌లను ఆటోమాటిక్‌గా సైలెన్స్ చేయవచ్చు. ఒకసారి ఆన్ చేసిన తర్వాత.. కొత్త ఫీచర్ తెలియని నంబర్ల నుంచి వచ్చే కాల్‌లను మ్యూట్ చేస్తుంది. అయితే, యూజర్లు ముఖ్యమైన కాల్‌లను కోల్పోకుండా ఉండేందుకు వాట్సాప్ ఇప్పటికీ కాల్ లిస్ట్ ట్యాబ్‌లో నోటిఫికేషన్‌లలో కాల్ హిస్టరీని అందిస్తుంది.

Read Also : Hero Karizma XMR 210 : బైక్ అంటే ఇలా ఉండాలి భయ్యా.. లెజెండ్ కొత్త అవతార్‌లో 2023 హీరో కరిజ్మా XMR 210 బైక్ రీఎంట్రీ.. ధర ఎంతో తెలుసా?

ట్రెండింగ్ వార్తలు