Amazfit Bip 5 Smartwatch : కొత్త స్మార్ట్‌వాచ్ కావాలా? దిమ్మతిరిగే ఫీచర్లతో Amazfit Bip 5 స్మార్ట్‌వాచ్.. ధర ఎంతో తెలిస్తే కొనకుండా ఆగలేరు..!

Amazfit Bip 5 Smartwatch : కొత్త స్మార్ట్‌వాచ్ కొనేందుకు చూస్తున్నారా? భారత మార్కెట్లో (Amazfit) నుంచి సరికొత్త మోడల్ స్మార్ట్‌వాచ్ బయో ట్రాకర్ 3 సెన్సార్ ఫీచర్లతో వచ్చింది. ధర ఎంతంటే?

Amazfit Bip 5 Smartwatch With 1.91-Inch LCD Display, BioTracker 3 Sensor Launched in India

Amazfit Bip 5 Smartwatch : ప్రముఖ స్మార్ట్‌వాచ్ మేకర్ (Amazfit) నుంచి సరికొత్త మోడల్ Bip 5 లేటెస్ట్ స్మార్ట్‌వాచ్‌గా భారత మార్కెట్లో లాంచ్ అయింది. ఈ కొత్త స్మార్ట్ వాచ్ 1.91-అంగుళాల LCD డిస్‌ప్లే, యాంటీ ఫింగర్‌ప్రింట్ కోటింగ్‌తో పాటు 2.5డి టెంపర్డ్ గ్లాస్‌తో ప్రొటెక్ట్ అయి ఉంటుంది. ఈ స్మార్ట్‌వాచ్ 300mAh బ్యాటరీతో వస్తుంది. సాధారణ వినియోగంతో గరిష్టంగా 10 రోజుల బ్యాటరీ లైఫ్ అందిస్తుందని కంపెనీ పేర్కొంది. Amazfit Bip 5 స్మార్ట్ వాచ్ ఈ నెల ప్రారంభంలో యూఎస్, యూకే సహా కొన్ని ఇతర మార్కెట్లలో లాంచ్ అయింది.

Amazfit Bip 5 ధర, లభ్యత :
భారత మార్కెట్లో Amazfit Bip 5 స్మార్ట్ వాచ్ ధర రూ. 7,499కు అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్ వాచ్ అమెజాన్ ద్వారా విక్రయానికి అందుబాటులో ఉంది. క్రీమ్ వైట్, పాస్టెల్ పింక్, సాఫ్ట్ బ్లాక్ కలర్ షేడ్స్‌లో వస్తుంది.

Read Also : JioBharat 4G Phone : జియోభారత్ 4G ఫోన్.. ధర రూ.999 మాత్రమే.. ఫీచర్లు కోసమైన ఇప్పుడే కొనేసుకోండి..!

Amazfit Bip 5 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
అమేజ్‌ఫిట్ బిప్ 5 స్మార్ట్ వాచ్ 1.91-అంగుళాల (320×380 పిక్సెల్స్) LCD టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేతో 2.5D టెంపర్డ్ గ్లాస్, యాంటీ ఫింగర్‌ప్రింట్ కోటింగ్‌ను కలిగి ఉంది. బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్‌తో వస్తుంది. రియల్ టైమ్ GPS ట్రాకింగ్, రూట్ నావిగేషన్ ఫీచర్‌లను అందిస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ సైక్లింగ్, రన్నింగ్, వాకింగ్, స్విమ్మింగ్‌తో సహా 120కి పైగా స్పోర్ట్స్ మోడ్‌లను ట్రాక్ చేయగలదు.

Amazfit Bip 5 Smartwatch With 1.91-Inch LCD Display, BioTracker 3 Sensor Launched in India

బయోట్రాకర్ 3 సెన్సార్‌ని ఉపయోగించి బ్లడ్ ఆక్సిజన్ సెన్సార్, హార్ట్ రేట్ ట్రాకర్, స్ట్రెస్ మానిటరింగ్ వంటి అనేక స్మార్ట్ హెల్త్ మానిటర్‌లను కూడా కలిగి ఉంది. 70కి పైగా కస్టమైజడ్ వాచ్ ఫేస్‌లను కూడా అందిస్తుంది. వాచ్ వైడ్ రేంజ్ చిన్న-యాప్‌లతో వస్తుంది. 30 కన్నా ఎక్కువ చిన్న-గేమ్‌లను అందిస్తోంది.

అదనంగా, స్మార్ట్‌వాచ్‌లో బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసిన స్మార్ట్‌ఫోన్ నుంచి ఫోన్ కాల్‌లను పొందవచ్చు. ఇంటర్నల్ మైక్రోఫోన్, స్పీకర్ కూడా ఉన్నాయి. ఇందులో మ్యూజిక్ కంట్రోల్, ఈవెంట్ రిమైండర్‌లు, పనుల జాబితా, స్మార్ట్ నోటిఫికేషన్‌లు, ఫైండ్ మై ఫోన్ (Find My Phone) వంటి ఫీచర్‌లను కూడా అందిస్తుంది.

Amazfit Bip 5 స్మార్ట్ వాచ్ 300mAh బ్యాటరీతో వస్తుంది. సాధారణ ఉపయోగంతో 10 రోజుల బ్యాటరీ లైఫ్ అందిస్తుంది. బ్యాటరీ సేవర్ మోడ్ ఆన్‌తో 30 రోజుల వరకు ఛార్జింగ్ అందిస్తుంది. 40గ్రా బరువు ఉన్న ఈ స్మార్ట్ వాచ్ Zepp OS 2.0పై రన్ అవుతుంది. (Google Fit), (Apple Health)కి సపోర్టు ఇస్తుంది.

Read Also : Oppo A38 Launch : అద్భుతమైన ఫీచర్లతో ఒప్పో A38 ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్ డేట్ ఎప్పుడు? ధర ఎంతో తెలిసిందోచ్..!

ట్రెండింగ్ వార్తలు