BRS MLC Kavita : తెలంగాణకు చేసిందేమీ లేదు గానీ ఎన్నికల వేళ ఢిల్లీ నేతలు క్యూ కడుతున్నారు : ఎమ్మెల్సీ కవిత

ఎన్నికలు వచ్చాయని తెలంగాణకు జాతీయ నేతలంతా క్యూకట్టి మరీ వస్తున్నారు పదేళ్లలో తెలంగాణకు చేసిందేమీ లేదు గానీ ఓట్ల కోసం వస్తున్నారు అంటూ విమర్శించారు.

BRS MLC Kavita

BRS MLC Kavita Rahul Gandhi priyanka Gandhi : ఎన్నికల సందర్భంగా ప్రచారం కోసం తెలంగాణకు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ వస్తున్న సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విమర్శలు సంధించారు. తెలంగాణలో చాలా మంచి వాతావరణం ఉంది. జాతీయ నేతలు వచ్చి ఆ వాతావరణాన్ని చెడగొట్టొద్దు అంటూ సెటైర్లు వేశారు. ఎన్నికలు వచ్చాయని తెలంగాణకు జాతీయ నేతలంతా క్యూకట్టి మరీ వస్తున్నారు పదేళ్లలో తెలంగాణకు చేసిందేమీ లేదు గానీ ఓట్ల కోసం వస్తున్నారు అంటూ విమర్శించారు.

తెలంగాణ గురించి రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది ఏమీ లేదు కానీ ఇప్పుడు తెలంగాణకు వచ్చి ఏం చెబుతారు..? అంటూ ప్రశ్నించారు. ప్రధాని మోదీ, రాహులు గాంధీలు రాష్ట్రంలో పర్యటిస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి చూడాలి అంటూ సూచించారు. తెలంగాణకు కేంద్రం ఇచ్చిన హామీలు ఏమయ్యాయి..? అని బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎన్నికల కోసం ఓట్ల కోసం మాత్రమే జాతీయ నేతలు తెలంగాణకు క్యూ కట్టి వస్తున్నారు..కానీ రాష్ట్రానికి చేసిందేమీ లేదు అంటూ విమర్శించారు. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేస్తున్న పథకాలను అన్ని రాష్ట్రాలు అనుసరిస్తున్నాయని అన్నారు.

Rahul Gandhi : తెలంగాణకు రాహుల్, ప్రియాంక గాంధీ.. మూడు రోజుల కాంగ్రెస్ బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారు

కాగా..తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ పొలిటికల్ హీట్ పెరుగుతోంది. జాతీయ నేతల పర్యటనలతో తెలంగాణ సందడి సందడిగా మారుతోంది. ఓ పక్క బీజేపీ నేతలు..మరో పక్క కాంగ్రెస్ నేతలు రాష్ట్రంలో పర్యటనలు సభలు, సమావేశాలతో బిజి బిజీగా గడుపుతు..ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశాయి.

ఇప్పటికే సీఎం కేసీఆర్ రంగంలోకి దిగి సభల్లో తనదైన శైలిలో ప్రసంగాలతో ఆకట్టుకుంటున్నారు. వరుసగా పర్యటనలు చేస్తూ భారీ బహిరంగ సభలు, సమావేశాల్లో పాల్గొంటున్నారు. ప్రచార పర్వంలో దూసుకుపోతున్నారు. అలాగే బీజేపీ అగ్రనేతలు కూడా రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. తాజాగా తెలంగాణకు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ కూడా తరలి వస్తున్నారు. లంగాణలో మూడు రోజుల పాటు కాంగ్రెస్ బస్సు యాత్రతో ఎనిమిది నియోజకవర్గాల్లో బస్సు యాత్ర జరుగనుంది. బస్సు యాత్రలో భాగంగా మహిళలు, నిరుద్యోగులు, సింగరేణి కార్మికులు, పసుపు చెరుకు రైతులతో రాహుల్ గాంధీ సమావేశం కానున్నారు. ఇలా ఆయా పార్టీలో ఎన్నికల కదనరంగంలో బిజీ బిజీగా ఓటర్లను ఆకట్టుకునే యత్నాలు చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు