MLC Kavitha : లిక్కర్ స్కామ్ తో నాకు సంబంధం లేదు-తేల్చి చెప్పిన కవిత

ఢిల్లీ లిక్కర్ స్కామ్ పై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కి క్లారిటీ ఇచ్చారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత. లిక్కర్ స్కామ్ గురించి తనకేమీ తెలియదన్నారు. అసలు లిక్కర్ స్కామ్ తో తనకు సంబంధమే లేదన్నారు.(MLC Kavitha)

MLC Kavitha : ఢిల్లీ లిక్కర్ స్కామ్ పై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కి క్లారిటీ ఇచ్చారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత. లిక్కర్ స్కామ్ గురించి తనకేమీ తెలియదన్నారు. అసలు లిక్కర్ స్కామ్ తో తనకు సంబంధమే లేదన్నారు. తాను కుట్రదారు కాదన్నారు. అంతేకాదు తాను ఎలాంటి ఆధారాలు ధ్వంసం చేయలేదని ఈడీకి స్పష్టం చేశారు కవిత. అటు ఈడీక.. మౌఖికంగా, లిఖితపూర్వకంగా కవిత స్టేట్ మెంట్ ను రికార్డ్ చేసింది.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తొలిసారిగా కవిత ఈడీ విచారణ జరిగింది. ఈ విచారణ ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. ఈడీ అధికారులు సుదీర్ఘంగా 9 గంటల పాటు ఢిల్లీలోని ఈడీ కేంద్ర కార్యాలయంలో కవితను విచారించారు. కీలక అంశాలపై కవితను ప్రశ్నించారు. సెల్ ఫోన్లు మార్చడం, ఆధారాలు ధ్వంసం చేశారనే ఆరోపణలపై ఈడీ అధికారులు కవితను ప్రశ్నించారు.(MLC Kavitha)

Also Read.. MLC Kavitha: ముగిసిన ఈడీ విచారణ.. 8 గంటలపాటు కవితను ప్రశ్నించిన అధికారులు

ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో ఉన్న సంబంధాలు, సౌత్ గ్రూప్ లో ఆమె కీలక భాగస్వామిగా ఉన్నారా? మనీలాండరింగ్ కేసులో ఇప్పటివరకు అరెస్ట్ అయిన నిందితులు ఇచ్చిన స్టేట్ మెంట్స్ పైనే ప్రధానంగా కవితను ప్రశ్నించడం జరిగింది. ఇందులో భాగంగా కవితకు అత్యంత సన్నిహితుడు, మద్యం వ్యాపారి అరుణ్ రామచంద్ర పిళ్లై కవిత ప్రతినిధిగా 32.5శాతం షేర్ హోల్డ్ కలిగున్నారు. మీ ప్రతినిధిగానే అరుణ్ పిళ్లై ఈ వ్యాపారంలో ఉన్నారా? మీ బినామీగానే ఆయన పని చేశారా? ఇలా అనేక ప్రశ్నలు సంధించారు కవితను. కవిత, అరుణ్ పిళ్లై ఇద్దరినీ కలిపి విచారించారు ఈడీ అధికారులు.(MLC Kavitha)

Also Read..Delhi Liquor Scam : కవితను జైల్లో వేయాలంటే ఈడీకి ఇంత టైమా?పేరంటానికి పిలిచారా?ఇదంతా బీఆర్ఎస్,బీజేపీ డ్రామాలు : రేవంత్ రెడ్డి

సెల్ ఫోన్ డేటా ఆధారంగా ఈడీ అధికారులు కవితపై ప్రశ్నల వర్షం కురిపించారు. సెల్ ఫోన్స్ మార్చడం, ఆధారాల ధ్వంసంపై కవితను ప్రశ్నించారు. ఈడీ అధికారులు అడిగిన ప్రశ్నలకు కవిత సమాధానాలు చెప్పారు. కాగా, లిక్కర్ స్కామ్ గురించి తనకేమీ తెలియదని కవిత ఈడీ అధికారులతో చెప్పినట్లు తెలుస్తోంది. లిక్కర్ స్కామ్ కేసులో నిందితులు ఇచ్చిన స్టేట్ మెంట్స్ ఆధారంగా కవితను ఈడీ అధికారులు ప్రశ్నించారు.(MLC Kavitha)

Also Read..MLC Kavitha : మళ్లీ రండి.. 16న మరోసారి కవితను విచారించనున్న ఈడీ

విచారణ తర్వాత ఈడీ కార్యాలయం నుంచి ఢిల్లీలోని కేసీఆర్ నివాసానికి కవిత వెళ్లిపోయారు. జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలోని ఐదుగురు అధికారుల ప్రత్యేక బృందం శనివారం ఉదయం 11గంటలకు విచారణ ప్రారంభించగా.. 9 గంటల పాటు ప్రశ్నించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన అరుణ్ రామచంద్ర పిళ్లైతో కలిపి కవితను ఈడీ అధికారులు విచారించారు.

ట్రెండింగ్ వార్తలు