Amit Shah Doctored Video Case : అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో కీలక పరిణామం.. హైకోర్టు స్టే

రిజర్వేషన్లు ఎత్తివేస్తాం అంటూ అమిత్ షా మాట్లాడినట్లుగా ఓ మార్ఫింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం కలకలం రేపింది.

Amit Shah Doctored Video Case : దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. ఈ కేసులో ముందస్తు విచారణ చేయొద్దని పోలీసులకు తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. రిజర్వేషన్లు ఎత్తివేస్తాం అంటూ అమిత్ షా మాట్లాడినట్లుగా ఓ మార్ఫింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం కలకలం రేపింది. దీనికి బాధ్యులుగా.. ఐదుగురిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

అమిత్ షా ఫేక్ వీడియో వ్యవహారం దేశవ్యాప్తంగా దుమారం రేపింది. దీనిపై కాంగ్రెస్ నాయకులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోకుండా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. ముందస్తు విచారణ చేయొద్దని ఆదేశించింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. దీనిపై ఇప్పటికే ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పరిస్థితుల్లో ముందస్తు ఇన్వెస్టిగేషన్ చేయడానికి వీల్లేదని, తదుపరి ఎలాంటి చర్యలు తీసుకోవడానికి వీల్లేదు అంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది కోర్టు.

కాంగ్రెస్ సోషల్ మీడియా కన్వీనర్ గా ఉన్న మన్నె సతీశ్ తో పాటు ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కోర్టు వారందరికీ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. విచారణ అధికారి ముందు హాజరుకావాలని నాంపల్లి కోర్టు వారిని ఆదేశించింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులు హైకోర్టు ఆశ్రయించారు. తదుపరి ఎలాంటి విచారణ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఎలాంటి విచారణ చేయకుండా పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది. 4 వారాల తర్వాత దీనిపై హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది.

Also Read : రౌస్ అవెన్యూ కోర్టుకు ఎమ్మెల్సీ కవిత కీలక విన్నపం.. ఏమని కోరారంటే..

 

ట్రెండింగ్ వార్తలు