Mlc Kavitha : రౌస్ అవెన్యూ కోర్టుకు ఎమ్మెల్సీ కవిత కీలక విన్నపం.. ఏమని కోరారంటే..

గతంలో సీబీఐ కస్టడీ ముగిశాక.. బెయిల్ అప్లికేషన్ దాఖలు సమయంలో కవిత వ్యవహార శైలిపై ఆమె న్యాయవాదుల వద్ద అసహనం వ్యక్తం చేశారు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి.

Mlc Kavitha : రౌస్ అవెన్యూ కోర్టుకు ఎమ్మెల్సీ కవిత కీలక విన్నపం.. ఏమని కోరారంటే..

Mlc Kavitha (Photo Credit : Google)

Mlc Kavitha : ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత.. రౌస్ అవెన్యూ కోర్టుకు కీలక విజ్ఞప్తి చేశారు. ఆమె మరో పిటిషన్ వేశారు. తన కేసు విచారణకు వచ్చినప్పుడు నేరుగా కోర్టులో హాజరుపరచాలని రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు కవిత. ఢిల్లీ మద్యం విధానంపై ఈడీ, సీబీఐ నమోదు చేసిన కేసుల్లో అరెస్ట్ అయిన కవిత.. ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నెల 7తో కవిత జ్యుడీషియల్ కస్టడీ ముగియనుంది. ఈ నేపథ్యంలో కోర్టులో అప్లికేషన్ దాఖలు చేశారు కవిత.

కస్టడీ ముగిసిన తర్వాత గత విచారణ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు హాజరుపరిచారు దర్యాప్తు అధికారులు. ఈసారి మాత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కాకుండా విచారణకు నేరుగా హాజరుపర్చాలని కోరుతూ అప్లికేషన్ దాఖలు చేశారామె. కవిత అప్లికేషన్ పై సమాధానం చెప్పాలని దర్యాప్తు సంస్థలకు నోటీసులు ఇచ్చింది రౌస్ అవెన్యూ సీబీఐ కోర్టు.

గతంలో సీబీఐ కస్టడీ ముగిశాక.. బెయిల్ అప్లికేషన్ దాఖలు సమయంలో కవిత వ్యవహార శైలిపై ఆమె న్యాయవాదుల వద్ద అసహనం వ్యక్తం చేశారు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి. కోర్టులో మీడియాతో మాట్లాడటం, దర్యాప్తుపై కామెంట్స్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు సీబీఐ కోర్టు న్యాయమూర్తి. ఆ తర్వాత జరిగిన విచారణకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరు పరిచారు దర్యాప్తు అధికారులు. ఈ నేపథ్యంలో… తనని కోర్టు విచారణకు భౌతికంగా హాజరయ్యేందుకు అవకాశం ఇవ్వాలని కవిత విజ్ఞప్తి చేశారు.

Also Read : ఏపీలో జగన్‌నే గెలిపించండి.. ఎందుకంటే- అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు