Madhu Yashki : కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టే ప్రయత్నం చేస్తున్నారు..!- మధుయాష్కీ సంచలన వ్యాఖ్యలు

మీ ప్రభుత్వాన్ని పడగొడతామని పదే పదే హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే బీజేపీ ఈ పని చేసింది.

Madhu Yashki : కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆ పార్టీ సీనియర్ నేత, కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ ఆరోపించారు. అందుకోసమే ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలను తీసుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. లేదంటే తమకు ఆ ఉద్దేశం లేదని చెప్పారు. ప్రధాని మోదీ కొ్న్నేళ్లుగా ప్రభుత్వాలను పడగొట్టడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు మధుయాష్కీ.

”మా ప్రభుత్వాన్ని కూలగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. బలపడటం కోసమే ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నాం. దేశంలో బీజేపీయేతర ప్రభుత్వాలను కూల్చడమే పనిగా పెట్టుకున్నారు. ఇతర పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకోవడానికి సీఎం రేవంత్ ప్రోత్సహించలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మూడో రోజు నుంచే.. కేటీఆర్.. పదే పదే ఈ ప్రభుత్వం పడిపోతుందని చెప్పడం, దానికి తగ్గట్టుగా బీజేపీ నాయకులు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉండదు.. ఎన్నికల తర్వాత పడిపోతుంది, ఎన్నికలకు ముందే పడిపోతుంది, పడగొట్టేస్తాం అని లక్ష్మణ్, కిషన్ రెడ్డి, కేటీఆర్, హరీశ్ రావు పదే పదే అంటున్నారు.

మీ ప్రభుత్వాన్ని పడగొడతామని వాళ్లే హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే బీజేపీ ఈ పని చేసింది. బీహార్, మధ్యప్రదేశ్, కర్నాటకలో ఏం జరిగిందో అందరికీ తెలుసు. రాజస్తాన్ లో అలాంటి ప్రయత్నమే చేసినా సక్సెస్ కాలేదు. జార్ఖండ్ లో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. ఈ పరిస్థితుల్లో ప్రజలంతా ఎన్నుకున్న ప్రభుత్వాన్ని రక్షించుకోవడానికి, సెల్ఫ్ డిఫెన్స్ కింద కొన్ని చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. అదే విధంగా ప్రభుత్వం ప్రమాద స్థితిలో ఉంది కనుక రక్షించుకోవడానికి కొన్ని చర్యలు తీసుకున్నాం. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లోకి తీసుకోవడం అందులో భాగమే” అని మధుయాష్కి వెల్లడించారు.

Also Read : ఏపీలో జగన్‌నే గెలిపించండి.. ఎందుకంటే- అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు

ట్రెండింగ్ వార్తలు