D Srinivas: తనయుడితో కలిసి కాంగ్రెస్‌లో చేరిన డీఎస్.. ఠాక్రే, రేవంత్ సమక్షంలో చేరిక

సీనియర్ పొలిటీషియన్ డి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనతోపాటు డీఎస్ తనయుడు ధర్మపురి సంజయ్, మేడ్చల్ సత్యనారాయణ కూడా పార్టీలో చేరారు. వీరికి ఏఐసీసీ తెలంగాణ ఇన్‌ఛార్జి మణిక్ రావు ఠాక్రే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, మాజీ పీసీసీ అధ్యక్షుడు వి.హనుమంత రావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

D Srinivas: కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నసీనియర్ పొలిటీషియన్ డి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనతోపాటు డీఎస్ తనయుడు ధర్మపురి సంజయ్, మేడ్చల్ సత్యనారాయణ కూడా పార్టీలో చేరారు. వీరికి ఏఐసీసీ తెలంగాణ ఇన్‌ఛార్జి మణిక్ రావు ఠాక్రే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, మాజీ పీసీసీ అధ్యక్షుడు వి.హనుమంత రావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జానారెడ్డి, షబ్బీర్ అలీ, అంజన్ కుమార్ యాదవ్, పొన్నాల లక్ష్మయ్య, రేణుకా చౌదరి, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు.

PM Modi: మోదీ పర్యటనలో భద్రతాలోపం.. కాన్వాయ్‌వైపు దూసుకొచ్చిన వ్యక్తి.. వైరల్ వీడియో

హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో ఆదివారం ఉదయం ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం అనంతరం డీఎస్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టనున్న సత్యాగ్రహ దీక్షలో కూడా పాల్గొంటారు. కాగా, అంతకుముందే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరికపై స్పందించారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరడం లేదన్నాడు. తన పెద్ద కుమారుడు డి.సంజయ్ మాత్రమే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు చెప్పారు. కానీ, ఆ తర్వాత తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నారు. తన పెద్ద కుమారుడు సంజయ్ కాంగ్రెస్ పార్టీలో చేరుతాడని అతడికి తన ఆశీస్సులు ఉంటాయన్నారు. చిన్న కుమారుడు ధర్మపురి అరవింద్ నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడని చెప్పారు.

ISRO: ఎల్‌వీఎమ్3 రాకెట్ ప్రయోగం విజయవంతం.. 36 ఉపగ్రహాలతో దూసుకెళ్లిన రాకెట్

పార్టీలు వేరైనా వాళ్లిద్దరూ తెలంగాణ ప్రజల అభ్యున్నతి కోసం చిత్తశుద్ధితో పని చేస్తున్నారని అన్నారు. ఇద్దరూ రాజకీయాల్లో మంచి పేరు తెచ్చుకుంటారన్న విశ్వాసం ఉందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం కొనసాగిన డి శ్రీనివాస్ తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. అయితే, ఆ తర్వాత పార్టీలో ప్రాధాన్యం కరువవ్వడంతో ఆయన కూడా బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. అనారోగ్య కారణాల రీత్యా ప్రస్తుతం ఆయన రాజకీయ కార్యక్రమాలకు, పార్టీలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవలే ఆయన అస్వస్థతకు గురై తిరిగి కోలుకున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు