తెలంగాణ సీఈవో వికాస్ రాజ్‌కు బీజేపీ, బీఆర్ఎస్, వీహెచ్‌పీ ఫిర్యాదులు

Lok Sabha elections 2024: కేసీఆర్ వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని ఈసీని కోరామని వీహెచ్‌పీ చెప్పింది.

తెలంగాణ సీఈవో వికాస్ రాజును విశ్వహిందూ పరిషత్ నేతలు కలిసి సీఎం కేసీఆర్ పై ఫిర్యాదు చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా కేసీఆర్ కామెంట్స్ చేస్తున్నారని చెప్పారు. దేవుడి పేరుతో అక్షంతలు ఆశచూపుతూ ఓట్లు వేయించుకుంటున్నారు అన్న కామెంట్లపై వీహెచ్‌పీ అభ్యంతరాలు తెలిపింది. కేసీఆర్ వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని ఈసీని కోరామని చెప్పింది. ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ పాల్గొనకుండా చర్యలు తీసుకోవాలని కోరింది.

మరోవైపు, సీఈఓ వికాస్ రాజ్‌ను బీజేపీ నేతలు కూడా కలిశారు. సోషల్ మీడియాలో బీజేపీపై అసత్య ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీపై ఫిర్యాదు చేశారు ప్రేమేందర్ రెడ్డి. కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఎడిట్ చేసి ప్రచారం చేస్తున్నారని చెప్పారు. అసత్య ప్రచారాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని సీఈవోను కోరారు.

సీఈఓ వికాస్ రాజ్‌ను బీఆర్ఎస్ నేతలు కలిసి బీజేపీ అదిలాబాద్ ఎంపీ అభ్యర్థి నగేశ్ పై ఫిర్యాదు చేశారు. ఎన్నికల అఫిడవిట్ ను పూర్తిగా ఫిలప్ చేయలేదని ఆర్వోకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని సీఈవోకు ఫిర్యాదు చేశారు. దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ.. నామినేషన్ తిరస్కరించడానికి అన్ని ఆధారాలు చూపించినప్పటికీ రిటర్నింగ్ అధికారి తిరస్కరించలేదని అన్నారు.

Also Read: అందుకే సీఎం జగన్ రాజధాని అంశాన్ని మ్యానిఫెస్టోలో పెట్టారు: బొత్స సత్యనారాయణ

ట్రెండింగ్ వార్తలు