అందుకే సీఎం జగన్ రాజధాని అంశాన్ని మ్యానిఫెస్టోలో పెట్టారు: బొత్స సత్యనారాయణ

మరో ఐదేళ్లు కూడా వాటిపైనే దృష్టి పెడుతున్నట్లు చెప్పారు. చంద్రబాబేమో..

అందుకే సీఎం జగన్ రాజధాని అంశాన్ని మ్యానిఫెస్టోలో పెట్టారు: బొత్స సత్యనారాయణ

Botcha Satyanarayana

మ్యానిఫెస్టోనే భగవద్గీత, బైబిల్, ఖురాన్ అని సీఎం జగన్ తమకు చెప్పారని ఆంధ్రప్రదేశ్ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం సీఎం జగన్ రాజధాని అంశాన్ని మ్యానిఫెస్టోలో పెట్టారని తెలిపారు.

విశాఖను ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దాలనేది జగన్ కల అని బొత్స సత్యనారాయణ చెప్పారు. ఎన్నికల మ్యానిఫెస్టోనే రిఫరెండంగా తీసుకుంటున్నట్లు తెలిపారు. రూ.25 వేల లోపు జీతం ఉన్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు నవరత్నాలు అందించడం శుభపరిణామమని తెలిపారు.

తాము ఐదేళ్లలో గత మ్యానిఫెస్టోలోని 99 శాతం హామీలను అమలు చేశామని బొత్స సత్యనారాయణ చెప్పారు. పేదవాడి జీవన ప్రమాణాలను పెంపొందించడానికే తాము మ్యానిఫెస్టో రూపొందించి అమలు చేస్తున్నామని తెలిపారు. తాము చంద్రబాబు నాయుడిలా మ్యానిఫెస్టో పేరుతో మోసాలకు పాల్పడబోమని అన్నారు.

వైసీపీ పాలనలో విద్య, వైద్యం, వ్యవసాయంపై ఈ ఐదేళ్లు ఫోకస్ పెట్టినట్లు బొత్స సత్యనారాయణ తెలిపారు. మరో ఐదేళ్లు కూడా వాటిపైనే దృష్టి పెడుతున్నట్లు చెప్పారు. చంద్రబాబు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి ఆ పని చేయకుండా మోసం చేశారని అన్నారు.

బొత్స ఝాన్సీ మాట్లాడుతూ.. పేద ప్రజల అవసరాలు తీర్చేలా వైసీపీ మ్యానిఫెస్టో ఉందని చెప్పారు. విశాఖ అభివృద్ధికి మా పార్టీ కట్టుబడి ఉందని తెలిపారు. చంద్రబాబు హయాంలో కేవలం 35 వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారని, తమ ప్రభుత్వంలో అన్ని శాఖల్లో ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పారు.

Also Read: బోండా ఉమపై మూడు ఫిర్యాదులు చేశాం: వెలంపల్లి శ్రీనివాసరావు