Oppo A60 Launch : భారీ డిస్‌ప్లేతో ఒప్పో A60 ఫోన్ వచ్చేసిందోచ్.. ధర తక్కువ.. ఫీచర్లు ఎక్కువ!

ఈ హ్యాండ్‌సెట్ భారత్ సహా ఇతర ప్రాంతాల్లో అందుబాటులో ఉంటుందా? లేదా అనేదానిపై కంపెనీ నుంచి ప్రస్తుతం ఎలాంటి సమాచారం లేదు.

Oppo A60 Launch : కొత్త ఫోన్ కొంటున్నారా? ఒప్పో A60 ఫోన్ వచ్చేసింది. ఒప్పో లేటెస్ట్ సరసమైన ఫోన్ అయిన ఒప్పో A60 మోడల్ 90హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల ఎల్‌సీడీ స్క్రీన్‌ను కలిగి ఉంది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 680 చిప్‌తో పాటు 8జీబీ ర్యామ్, 256జీబీ వరకు స్టోరేజ్‌తో వస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ 45డబ్ల్యూ సూపర్‌వూక్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 5,000ఎంఎహెచ్ బ్యాటరీని అందిస్తుంది. ఒప్పో A60 ఫోన్ 50ఎంపీ ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. అయితే, ఫ్రంట్ సైడ్ 8ఎంపీ కెమెరాతో సెల్ఫీలను తీసుకోవచ్చు.

Read Also : WhatsApp Exit India : యూజర్ల మెసేజ్ ఎన్‌క్రిప్షన్‌ బ్రేక్ చేస్తే.. భారత్ నుంచి నిష్ర్కమిస్తాం : వాట్సాప్ వెల్లడి!

ఒప్పో ఎ60 ధర ఎంతంటే? :
ఒప్పో ఎ60 8జీబీ+128జీబీ ర్యామ్, స్టోరేజ్ మోడల్ ధర ధర 5,490,000 వీఎన్‌డీ (సుమారు రూ. 18,060)గా నిర్ణయించింది. అయితే, 8జీబీ+256జీబీ వేరియంట్ ధర వీఎన్‌డీ 6,490,000 (సుమారు రూ. 21,360)కు అందిస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ మిడ్‌నైట్ పర్పుల్, రిప్పల్ బ్లూ కలర్‌వేస్‌లో అందుబాటులో ఉంది.

ఆన్‌లైన్ రిటైలర్లలో ది జియోయ్ డి డాంగ్, డియెన్ మే క్సాన్ ద్వారా వియత్నాంలో కొనుగోలుకు ఇప్పటికే అందుబాటులో ఉంది. ఈ హ్యాండ్‌సెట్ భారత్ సహా ఇతర ప్రాంతాల్లో అందుబాటులో ఉంటుందా? లేదా అనేదానిపై కంపెనీ నుంచి ప్రస్తుతం ఎలాంటి సమాచారం లేదు.

ఒప్పో ఎ60 స్పెసిఫికేషన్లు :
డ్యూయల్-సిమ్ (నానో) ఒప్పో ఎ660 ఆండ్రాయిడ్ 14-ఆధారిత కలర్ఓఎస్ 14.0.1పై రన్ అవుతుంది. 90హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల హెచ్‌డీ+ (720×1,604 పిక్సెల్‌లు) ఎల్‌సీడీ స్క్రీన్‌ను కలిగి ఉంది. 8జీబీ ఎల్‌పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్‌తో ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 680 చిప్‌తో రన్ అవుతుంది.

ఈ ఫొటోలు, వీడియోల కోసం ఒప్పో ఎ60 ఎఫ్/1.8 ఎపర్చరు, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో కూడిన 50ఎంపీ ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. డెప్త్ సమాచారం కోసం ఎఫ్/2.4 ఎపర్చర్‌తో 2ఎంపీ సెకండరీ కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్ ఫ్రంట్ సైడ్ 8ఎంపీ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. మధ్యలో హోల్ పంచ్ కటౌట్‌ కలిగి ఉంది. కంపెనీ, ఈ హ్యాండ్‌సెట్‌లో గరిష్టంగా 256జీబీ యూఎఫ్ఎఫ్ఎస్ 2.2 స్టోరేజ్‌ను కలిగి ఉంది. కనెక్టివిటీ ఆప్షన్లలో 4జీ ఎల్‌టీఈ, వై-ఫై, బ్లూటూత్ 5.0, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్, ఎ-జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్ ఉన్నాయి.

బోర్డులోని సెన్సార్‌లలో మాగ్నెటోమీటర్, యాక్సిలరోమీటర్, లైట్ సెన్సార్, సామీప్య సెన్సార్ ఉన్నాయి. ఒప్పో ఎ60 45డబ్ల్యూ ఛార్జ్ చేయగల 5,000ఎంఎహెచ్ బ్యాటరీని అందిస్తుంది. బయోమెట్రిక్ అథెంటికేషన్ కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను కలిగి ఉంది. కంపెనీ ప్రకారం.. 165.71×76.02×7.68ఎమ్ఎమ్ కొలుస్తుంది. 186గ్రాముల బరువు ఉంటుంది.

Read Also : Lenovo Yoga 7 Laptop : టచ్ డిస్‌ప్లేతో లెనోవో కొత్త యోగా 7ఐ 2-ఇన్-1 ల్యాప్‌టాప్.. భారత్‌లో ధర ఎంతంటే?

ట్రెండింగ్ వార్తలు