VD12 Update : విజయ్ దేవరకొండ బర్త్‌డే.. VD12 స్పెషల్ అప్డేట్ ఇచ్చిన టీమ్.. ఏంటంటే..?

తాజాగా VD12 సినిమా అప్డేట్ ఇచ్చారు.

VD12 Update : విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) ఇటీవల ఫ్యామిలీ స్టార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చి మెప్పించాడు. నేడు విజయ్ దేవరకొండ పుట్టిన రోజు కావడంతో తన సినిమాల నుంచి వరుస అప్డేట్స్ వస్తున్నాయి. ఆల్రెడీ రవికిరణ్ కోలా దర్శకత్వంలో చేస్తున్న సినిమా నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న సినిమా నుంచి కూడా స్పెషల్ అప్డేట్ ఇవ్వనున్నారు.

తాజాగా VD12 సినిమా అప్డేట్ ఇచ్చారు. సితార ఎంటర్టైన్మెంట్స్ లో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పీరియాడిక్ స్పై యాక్షన్ కథతో ఉండబోతుంది ఈ సినిమా. దీనిపై అంచనాలు భారీగానే ఉన్నాయి. VD12 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి తాజాగా మూవీ యూనిట్ ఓ అప్డేట్ ఇచ్చింది.

Also Read : Vijay Deverakonda : కత్తి నేనే.. నెత్తురు నాదే.. యుద్ధం నాతోనే.. వామ్మో విజయ్ దేవరకొండ ఊరమాస్ సినిమా..

సితార ఎంటర్టైన్మెంట్స్ విజయ్ దేవరకొండ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ VD12 పై ఓ స్పెషల్ లెటర్ పోస్ట్ చేశారు. ఇందులో.. రౌడీ ఫ్యాన్స్, తెలుగు ఆడియన్స్ మీ సహనాన్ని అభినందిస్తున్నాము. మేము ఒక అద్భుతమైన సినిమా తీస్తున్నాము. కొంచెం లేట్ అవ్వొచ్చు కానీ మేము బెస్ట్ ఇస్తాము. వైజాగ్ లో ఈ సినిమాలోని ఓ అదిరిపోయే మాసివ్ సీన్స్ ని షూటింగ్ చేస్తున్నాము. మా అందరికి ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్. త్వరలో ఓ గ్లింప్స్ వీడియో మీ కోసం రిలీజ్ చేస్తాం. విజయ్ దేవరకొండకు పుట్టిన రోజు శుభాకాంక్షలు అని తెలిపారు. దీంతో పోస్ట్ వైరల్ గా మారింది.

ట్రెండింగ్ వార్తలు