VD14 Update : అదిరిపోయిన VD14 అప్డేట్.. 1850వ సంవత్సరంలో కథతో.. యోధుడిగా విజయ్ దేవరకొండ..
తాజాగా విజయ్ దేవరకొండ VD14 సినిమా అప్డేట్ వచ్చింది.
- Saketh U
- Updated on- May 9, 2024 / 11:19 AM IST
Vijay Deverakonda Rahul Sankrityn VD 14 Movie Update Released
Vijay Deverakond VD14 Movie Update : విజయ్ దేవరకొండ ఇటీవల ఫ్యామిలీ స్టార్ సినిమాతో వచ్చి పర్వాలేదనిపించారు. నేడు విజయ్ దేవరకొండ పుట్టిన రోజు కావడంతో వరుసగా తన రాబోయే సినిమాల నుంచి అప్డేట్స్ వస్తున్నాయి. ఇప్పటికే రవికిరణ్ కోలా దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో విజయ్ చేస్తున్న సినిమా నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. అలాగే సితార ఎంటర్టైన్మెంట్స్ లో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చేస్తున్న VD12 సినిమా అప్డేట్ ఇచ్చారు.
Also Read : VD12 Update : విజయ్ దేవరకొండ బర్త్డే.. VD12 స్పెషల్ అప్డేట్ ఇచ్చిన టీమ్.. ఏంటంటే..?
తాజాగా విజయ్ దేవరకొండ మరో సినిమా అప్డేట్ వచ్చింది. గతంలో ట్యాక్సీవాలా, శ్యామ్ సింగరాయ్ సినిమాలతో మెప్పించిన దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో విజయ్ దేవరకొండ హీరోగా సినిమాని ప్రకటించారు. VD14 వర్కింగ్ టైటిల్ తో ఓ ఆసక్తికర పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో ఓ వీరుడి విగ్రహం ఉంది. శపించబడిన భూమి నుంచి వచ్చిన ఓ యోధుడి కథ అని దీని గురించి తెలిపారు. 1854 సంవత్సరం నుంచి 1873 సంవత్సరం మధ్యలో జరిగిన కథ అని పోస్టర్ పై వేశారు.
ఇతిహాసాలు రాయలేదు, అవి యోధుల రక్తంలో ఇమిడిపోయాయి అని ఆసక్తికరంగా ఈ సినిమాని ప్రకటించారు. ఈ ఒక్క పోస్టర్ తోనే సినిమాపై భారీ అంచనాలు పెంచారు. విజయ్ దేవరకొండ రాజుల కాలంలో యోధుడిగా పీరియాడిక్ సినిమా చేస్తుండటంతో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఈ సినిమాని కూడా పాన్ ఇండియా రిలీజ్ చేస్తున్నారు.
