X GrokAI Stories : ‘ఎక్స్’ ప్రీమియం యూజర్ల కోసం గ్రోక్‌ఏఐ ఆధారిత ‘స్టోరీస్’ ఫీచర్.. ఇదేలా పనిచేస్తుందంటే?

X GrokAI Stories : ట్విట్టర్ (X) ప్లాట్‌ఫారం ప్రీమియం యూజర్ల కోసం గ్రోక్ఏఐ ఆధారిత స్టోరీస్ అనే కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లోని స్టోరీస్ ఫీచర్‌కి భిన్నంగా ఉంటుంది. ఇదేలా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

X GrokAI Stories : ప్రస్తుత రోజుల్లో ఏఐ టెక్నాలజీకి ఫుల్ క్రేజ్ పెరిగిపోయింది. చాట్‌జీపీటీ రాకతో ఏఐ వినియోగంపై అందరిలో ఆసక్తి గరిష్ట స్థాయికి చేరుకుంది ఓపెన్‌ఏఐ, వైరల్ ఏఐ చాట్‌బాట్ సంస్థ, చాట్‌జీపీటీ ప్రారంభంలోనే అత్యంత పాపులర్ అయింది. కంపెనీ సీఈఓ సామ్ ఆల్ట్‌మాన్‌కు ఇంటి పేరుగా మారింది. అయితే, ఓపెన్ఏఐ చాట్‌జీపీటీ పనితీరుపై ప్రపంచ బిలియనీర్ ఎలన్ మస్క్ అనేక సందర్భాల్లో విమర్శలు చేశారు.

Read Also : Elon Musk AI : 2029 నాటికి మనుషుల కన్నా ఏఐ చాలా తెలివైనదిగా మారుతుంది : ఎలన్ మస్క్!

ఓపెన్ఏఐ లాభాపేక్షలేని కంపెనీగా మారిందని ఆయన విమర్శించారు. గత ఏడాది డిసెంబర్‌లో మస్క్ చాట్‌జీపీటీకి పోటీగా సొంత ఏఐ చాట్‌బాట్ గ్రోక్ (GrokAI)ని ప్రపంచానికి పరిచయం చేశారు. ఈ ఏఐ చాట్‌బాట్‌ను ‘ఎక్స్’ ప్రీమియం, ప్రీమియం ప్లస్ వినియోగదారులు యాక్సెస్ చేయవచ్చు.

ప్రీమియం యూజర్లకు మాత్రమే :
ఇప్పుడు, గ్రోక్‌ఏఐ ఆధారితమైన కొత్త ఫీచర్‌ను మస్క్ ఆవిష్కరించారు. అయితే, ఈ ఫీచర్ ఎక్స్ ప్రీమియం వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ప్రత్యేకించి ట్రెండింగ్ స్టోరీలతో వినియోగదారులు కనెక్ట్ అయ్యేందుకు ఈ ఫీచర్ తీసుకొచ్చినట్టుగా కనిపిస్తోంది. ఈ మేరకు కంపెనీ అధికారిక (X) ఇంజనీరింగ్ టీమ్ అకౌంట్ @XEng ద్వారా ప్రకటించింది. ఈ ప్లాట్‌ఫారమ్ ఇప్పుడు ప్రీమియం సబ్‌స్క్రైబర్‌లకు ప్రతి ట్రెండింగ్ టాపిక్‌కి లింక్ చేసిన పోస్ట్‌ల ఏఐ రూపొందించిన స్టోరీలను అందిస్తుంది. ఈ స్టోరీలను ‘Explore’ సెక్షన్‌లో ‘For You’ ట్యాబ్‌లో సులభంగా యాక్సెస్ చేయవచ్చు.

ట్రెండింగ్ స్టోరీలను ఒకేచోట చూడొచ్చు :
గ్రోక్ఏఐ ఆధారితం స్టోరీస్ ఫీచర్ ఇప్పుడు ఎక్స్‌ప్లోర్ ట్యాబ్‌లో ప్రీమియం సబ్‌స్క్రైబర్‌లకు అందుబాటులో ఉంది. వెబ్ అండ్ ఐఓఎస్ యూజర్లు ఈజీగా యాక్సస్ చేసుకోవచ్చునని కంపెనీ పోస్ట్‌లో వెల్లడించింది. ‘For You’ పేజీలో యూజర్ల ఆసక్తికి అనుగుణంగా స్టోరీలు, వార్తల అంశాలను సూచిస్తుంది.

ఈ ఫీచర్ యూజర్లకు ఎక్స్‌పై లేటెస్ట్ వార్తలను అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఒరిజినల్ స్టోరీల్లో కేవలం టెక్ట్స్ మాత్రమే డిస్‌ప్లే చేసే సాంప్రదాయ పద్ధతుల మాదిరిగా కాకుండా ప్రపంచమంతటా జరుగుతున్న విషయాలను డైనమిక్‌గా ఒకేచోట కనిపించేలా సూచిస్తుంది. ప్రత్యేకించి ప్లాట్‌ఫారమ్ ట్రెండింగ్ విషయాలపై లేటెస్ట్ డేటాను అందిస్తుంది.

అయితే, ప్లాట్‌ఫారమ్ గ్రోక్‌ఏఐ టూల్ అప్పుడప్పుడు లోపాలు తలెత్తే అవకాశం లేకపోలేదు. ఇలాంటి సందర్భాల్లో ప్రతి ఆర్టికల్ చదివే సమయంలో వినియోగదారులు సంబంధిత హెచ్చరికను చూస్తారు. ఈ హెచ్చరికతో అందించిన సమాచారాన్ని అంచనా వేయడానికి యూజర్లను ప్రోత్సహిస్తుంది. ట్రెండింగ్ వార్తలను అందించడం అనేది సోషల్ మీడియా యూజర్లకు సుపరిచితమే అయినప్పటికీ, ఎక్స్ విధానం ఎంతో ప్రత్యేకమైనది.

గతంలో మాజీ సీఈఓ జాక్ డోర్సే నాయకత్వంలో ట్విట్టర్ కొంతవరకు ఇదే మాదిరి ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. అంతేకాదు.. ట్విట్టర్ గత కొన్ని నెలల్లో అనేక కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టింది. ఇందులో ఒకటి.. భారతీయ యూజర్ల కోసం కమ్యూనిటీ నోట్స్ యాడ్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ వినియోగదారులకు సమాచారాన్ని నిజమని నమ్మే ముందు ప్లాట్‌ఫారమ్‌లో వైరల్ అవుతుందనే వాస్తవాన్ని చెక్ చేసేందుకు అనుమతిస్తుంది.

Read Also : Vivo X100 Series Launch : ఈ నెల 13న వివో నుంచి సరికొత్త 3 ఫోన్లు వచ్చేస్తున్నాయి.. లాంచ్‌కు ముందే ఫీచర్లు, ధర వివరాలు లీక్!

ట్రెండింగ్ వార్తలు