2024 Porsche Panamera launched in India
2024 Porsche Panamera : కొత్త కారు కోసం చూస్తున్నారా? 2024 పోర్సే పనామెరా ఎట్టకేలకు భారత మార్కెట్లోకి వచ్చేసింది. ఈ కొత్త కారు (ఎక్స్-షోరూమ్) ధరలు రూ. 1.70 కోట్లతో ప్రారంభమవుతాయి. మూడో జనరేషన్ పనామెరా డెలివరీలు వెంటనే ప్రారంభమవుతాయి. పనామెరా అనేక డిజైన్, ఫీచర్లు, ఛాసిస్, పవర్‌ట్రెయిన్ అప్‌డేట్‌లను పొందుతుంది. భారత మార్కెట్లో విక్రయించిన పనామెరా గత జనరేషన్ కారు కన్నా ఎక్కువ ప్రామాణిక డివైజ్‌లను పొందుతుంది.
Read Also : Motorola Edge 50 Fusion : ఈ నెల 16న మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ ఫోన్ వచ్చేస్తోంది.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?
కొత్తగా అప్‌డేట్ చేసిన పనామెరా కారు 2.9-లీటర్, ట్విన్-టర్బో, వి6 పెట్రోల్ మోటారుతో పవర్ పొందింది. ఇప్పుడు మునుపటి కన్నా 23బీహెచ్‌పీ, 50ఎన్ఎమ్ ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. మొత్తం అవుట్‌పుట్ 348బీహెచ్‌పీ, 500ఎన్ఎమ్ వద్ద ఉంటుంది. ఈ మోటార్ 8-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. పోర్స్చే యాక్టివ్ సస్పెన్షన్ మేనేజ్‌మెంట్ (PASM)తో డ్యూయల్-ఛాంబర్ టూ-వాల్వ్ ఎయిర్ సస్పెన్షన్‌ను కూడా పొందవచ్చు.
పోర్సే పనామెరా నంబర్ ప్లేట్ పైన కొత్త ఎయిర్ ఇన్‌టేక్ వెంట్ కూడా ఉంది. మ్యాట్రిక్స్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు ఇప్పుడు ప్రామాణికంగా ఉన్నాయి. గేర్ సెలెక్టర్ స్టీరింగ్ వీల్ పక్కకు తిరిగింది. స్టీరింగ్ వీల్ నుంచి డ్రైవింగ్ మోడ్‌లను ఎంచుకోవచ్చు. విండో లైన్ డిజైన్, ఏసీ కొత్త కంట్రోల్ ప్యానెల్, వెంట్‌లు ఉన్నాయి.
Read Also : Jio Customers : తెలుగు రాష్ట్రాల్లో జియో ప్రభంజనం.. కొత్తగా 1.06 లక్షలకుపైగా కస్టమర్లు!