Samsung Galaxy F55 5G : ట్రిపుల్ కెమెరాలతో శాంసంగ్ నుంచి గెలాక్సీ ఎఫ్55 5జీ ఫోన్ వచ్చేస్తోంది.. పూర్తి వివరాలివే!

Samsung Galaxy F55 5G : ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌తో వస్తుంది. స్పాప్‌డ్రాగన్ 7 జనరేషన్ 1 ఎస్ఓసీలో రన్ అవుతుందని భావిస్తున్నారు. శాంసంగ్ గెలాక్సీ సి55 రీబ్రాండ్‌గా రావచ్చు.

Samsung Galaxy F55 5G : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ అతి త్వరలో భారత మార్కెట్లో శాంసంగ్ గెలాక్సీ F55 5జీ ఫోన్ త్వరలో లాంచ్ కానుంది. ఈ మేరకు (మే శాంసంగ్ ఒక ప్రకటనలో వెల్లడించింది.

Read Also : Google Pixel 8a Launch : గూగుల్ పిక్సెల్ 8ఎ ఫోన్ వచ్చేసిందోచ్.. బ్యాంకు ఆఫర్లతో రూ.39,999కే సొంతం చేసుకోవచ్చు!

ఫ్లిప్‌కార్ట్‌లోని ప్రత్యేక మైక్రోసైట్ రాబోయే F-సిరీస్ స్మార్ట్‌ఫోన్ డిజైన్, కలర్ ఆప్షన్లనున లాంచ్‌కు ముందే టీజ్ చేసింది. శాంసంగ్ గెలాక్సీ F55 5జీ ఫోన్ వేగన్ లెదర్ ఎండ్‌తో కనీసం రెండు కలర్ ఆప్షన్లలో వస్తుంది. ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌తో వస్తుంది. స్పాప్‌డ్రాగన్ 7 జనరేషన్ 1 ఎస్ఓసీలో రన్ అవుతుందని భావిస్తున్నారు. శాంసంగ్ గెలాక్సీ సి55 రీబ్రాండ్‌గా రావచ్చు.

శాంసంగ్ గెలాక్సీ F55 5జీ ఫోన్ భారత్‌లో త్వరలో లాంచ్ కానుంది. ఫ్లిప్‌కార్ట్ ద్వారా విక్రయానికి రానుందని శాంసంగ్ ప్రకటించింది. ఇ-కామర్స్ వెబ్‌సైట్ కొత్త ఫోన్‌ కోసం ప్రత్యేకమైన మైక్రోసైట్‌ను రూపొందించింది. అప్రికాట్ క్రష్, రైసిన్ బ్లాక్ కలర్‌వేస్‌లో అందుబాటులో ఉన్నట్లు కంపెనీ ధృవీకరించింది. గెలాక్సీ F55 5జీ ఫోన్ ఈ ఏడాదిలో అత్యంత సన్నని, తేలికైన శాకాహారి వేగన్ ఫోన్‌గా రానుంది. వృత్తాకార రింగ్‌లో ఉంచిన ప్రతి లెన్స్‌తో ట్రిపుల్ బ్యాక్ కెమెరా సెటప్‌తో వస్తుంది. కెమెరా రింగ్‌ పక్కన ఫ్లాష్‌లైట్‌తో రానుంది.

శాంసంగ్ ఏ వేరియంట్ ధర ఎంతంటే? :
అయితే, శాంసంగ్ కచ్చితమైన లాంచ్ తేదీని లేదా రాబోయే స్మార్ట్‌ఫోన్ ఏవైనా స్పెసిఫికేషన్‌లను వెల్లడించలేదు. మే మొదటి వారంలో ఆవిష్కరించనున్నట్లు కంపెనీ ధృవీకరించింది. గతంలో గెలాక్సీ F55 ఫోన్ 8జీబీ ర్యామ్+128జీబీ స్టోరేజ్ వెర్షన్ ధర రూ. 26,999కు పొందవచ్చు. 8జీబీ ర్యామ్+256జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ. 29,999కు పొందవచ్చు. అయితే, 12జీబీ ర్యామ్+ 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 32,999కు కొనుగోలు చేయొచ్చు. గెలాక్సీ F55 5జీ ఫోన్ గెలాక్సీ సి55 మాదిరిగానే స్పెసిఫికేషన్‌లను అందిస్తుందని భావిస్తున్నారు.

చైనాలో ఏప్రిల్‌లో రెండో మోడల్ ప్రారంభ ధర సీఎన్‌వై 1,999 (దాదాపు రూ. 23వేలు)తో రావొచ్చు. 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల ఫుల్-హెచ్‌డీ+ (1,080×2,400 పిక్సెల్‌లు) సూపర్ అమోల్డ్ ప్లస్ డిస్‌ప్లేను కలిగి ఉంది. స్పాప్‌‌డ్రాగన్ 7 జనరేషన్ 1 ఎస్ఓసీ రన్ అవుతుంది. ఇతర ముఖ్యమైన స్పెసిఫికేషన్లలో 50ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరాలు, 50ఎంపీ సెల్ఫీ షూటర్, 45డబ్ల్యూ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో కూడిన 5,000ఎంఎహెచ్ బ్యాటరీ ఉన్నాయి.

Read Also : 2024 Porsche Panamera : పోర్సే పనామెరా కొత్త కారు వచ్చేసిందోచ్.. అదిరే ఫీచర్లు, ధర ఎంతంటే?

ట్రెండింగ్ వార్తలు