హరీశ్ రావు పక్కా డ్రామా మాస్టర్.. కేసీఆర్ ప్రమేయం లేకుండానే వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేశారా..? : కడియం శ్రీహరి

హరీశ్ రావు రాజీనామా డ్రామా. ఆయన పక్కా డ్రామా మాస్టర్. సీఎం రేవంత్ చేసిన సవాల్ కు కట్టుబడి ఉన్నారని కడియం శ్రీహరి తెలిపారు.

Kadiyam Srihari : బీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీ. కేసీఆర్ పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయనే ప్రజలకు జవాబు దారి. గత ప్రభుత్వంపై వస్తున్న ఆరోపణలకు ఆయనే సమాధానం చెప్పాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం బ్యారేజ్ లో పిల్లర్లు కుంగిపోవడానికి కేసీఆరే బాధ్యత వహించాలి. ఆయన అక్కడ కుర్చీ వేసుకొని నీళ్లు వదిలితే కుర్చీతోపాటు ఆయనకూడా కొట్టుకు పోతారు. కేసీఆర్ తెలివితక్కువ మాటలు మాట్లాడొద్దని శ్రీహరి సూచించారు.

Also Read : Mamata Banerjee : మరోసారి గాయపడ్డ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. హెలికాప్టర్ ఎక్కుతుండగా..

బీజేపీ విధానాలతో ప్రజాస్వామ్య వ్యవస్థ ఆపదలో ఉంది. తెలంగాణ అంటేనే విప్లవాల పురిటిగడ్డ.. వామపక్ష భావజాలాలు కలిగిన గడ్డ. రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిదని శ్రీహరి అన్నారు. చట్టాలు అందరికీ సమానమే. నా కూతురు SC కాబట్టే స్క్రూటినీలో రిటర్నింగ్ అధికారులు ఎలాంటి అభ్యంతరం లేవనెత్తలేదు. బయట మాట్లాడే సన్యాసులు స్ర్కూట్నీలో ఎందుకు అభ్యంతరం చెప్పలేదు..? ఎందుకు ఆధారాలు చూపలేదు. నిన్నటివరకు మొరిగినవాళ్లు ఎక్కడపోయారని కడియం శ్రీహరి ప్రశ్నించారు.

Also Read : Vijay Mallya : విజయ్‌ మాల్యా చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. అటుగా వస్తే అప్పగించాలని ఫ్రాన్స్‌కు భారత్‌ విజ్ఞప్తి!

హరీశ్ రావు రాజీనామా డ్రామా. ఆయన పక్కా డ్రామా మాస్టర్. సీఎం రేవంత్ చేసిన సవాల్ కు కట్టుబడి ఉన్నారని కడియం శ్రీహరి తెలిపారు. మంద కృష్ణ వ్యాఖ్యలపై ఆయన స్పందించారు.. నా బిడ్డ ఎంపీగా గెలిచిన తరువాత ఇదే మందకృష్ణ మాదిగ నా ఇంటికివచ్చి దండం పెడతాడంటూ కడియం అన్నారు. నా వద్దు వందల కోట్లు ఉన్నది నిజమైతే.. నాపై ఈడీ, ఇన్ కమ్ ట్యాక్ సోదాలు ఎందుకు చేయడం లేదు. నా తర్వాత 20ఏళ్లకు పుట్టిన వెదవలకు నేను సమాధానం చెప్పను
. ఫోన్ ట్యాపింగ్ కామన్ అంటున్న కేసీఆర్ ఆధికారులను బలి చేశారు. తన సామాజిక వర్గానికి చెందిన అధికారులను ఇరికించారు. కేసీఆర్ ప్రమేయం లేకుండానే వాళ్లు ఫోన్ ట్యాపింగ్ చేశారా? డొంక తిరుగుడు మాటలు మాట్లాడొద్దని కడియం శ్రీహరి కేసీఆర్ కు సూచించారు.

 

 

ట్రెండింగ్ వార్తలు