Heat wave : ఎండలు భగభగ.. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు.. ఆ జిల్లాల్లో ఐదు రోజులు డేంజర్ బెల్స్

తెలంగాణలో ఎండలు ప్రమాదకరంగా మారుతున్నాయి. గతేడాది ఇదే సమయంలో నమోదైన ఉష్ణోగ్రతలతో పోల్చితే 5 నుంచి 7 డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి.

Heat wave Warning : తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగ్గుమంటున్నాడు. ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. మధ్యాహ్నం వేళ బయటకు వెళ్లాలంటేనే ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వచ్చే ఐదు రోజులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. తెలంగాణలో అధిక ఉష్ణోగ్రతల నమోదు.. ఏపీలో వడగాల్పుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలిపింది. ఇప్పటికే వడదెబ్బ కారణంగా ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. వడదెబ్బతో సిరిసిల్ల జిల్లా అచ్చన్నపల్లిలో శుక్రవారం ఓ హమాలీ కూలి ప్రాణాలు కోల్పోయాడు. మరోవైపు పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45డిగ్రీలు దాటాయి.

Also Read : Heavy Heat Waves : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్రంగా ఎండలు, వడగాడ్పులు

తెలంగాణలోని పలు జిల్లాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. గతేడాదితో పోలిస్తే రాష్ట్రంలో ఎండల తీవ్రత ఎక్కువగానే ఉంది. దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు తెలంగాణలోనే నమోదవుతుండటం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. శుక్రవారం ఏకంగా ఎనిమిది జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో 45డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గత పదేళ్లలో ఏప్రిల్ నెల చివరి వారంలో ఒకేసారి ఇన్ని ప్రాంతాల్లో 45డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు నమోదు కావటం ఇదే తొలిసారి. ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. వచ్చే ఐదు రోజులు మరింత ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, మధ్యాహ్నం వేళల్లో తప్పనిసరి అయితేనే ప్రజలు బయటకు రావాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.

Also Read : Heat Wave Tips : వేసవి వడగాల్పులను ఎదుర్కోవాలంటే వేడి కాఫీ, టీలతోపాటు ఆల్కహాల్‌కు దూరంగా ఉండటం మంచిది !

తెలంగాణలో ఎండలు ప్రమాదకరంగా మారుతున్నాయి. గతేడాది ఇదే సమయంలో నమోదైన ఉష్ణోగ్రతలతో పోల్చితే 5 నుంచి 7 డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. మరో ఐదు రోజులు పాటు ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని, అత్యవసరం అయితేనే ప్రజలు బయటకు రావాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇవాళ (శనివారం) రాష్ట్రంలోని మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తూగడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మెదక్, కామారెడ్డిజిల్లాల్లో తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అదేవిధంగా ఆదివారం, సోమవారంలలో నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల్ జిల్లాల్లో వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, ఆసిఫాబాద్ జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, మిగిలిన జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలతో పాటు అక్కడక్కడ ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

 


 

ట్రెండింగ్ వార్తలు