Heat Wave Tips : వేసవి వడగాల్పులను ఎదుర్కోవాలంటే వేడి కాఫీ, టీలతోపాటు ఆల్కహాల్‌కు దూరంగా ఉండటం మంచిది !

ఎక్కువ గంటలు గడిచిన నిల్వ ఉంచిన ఆహారాలను తీసుకోరాదు. హైడ్రేటెడ్ గా ఉండటం , క్రమం తప్పకుండా నీరు త్రాగడం ద్వారా శరీరం కోల్పోయిన ద్రవాలను తిరిగి నింపడం చాలా ముఖ్యం.

Heat Wave Tips : వేసవి వడగాల్పులను ఎదుర్కోవాలంటే వేడి కాఫీ, టీలతోపాటు ఆల్కహాల్‌కు దూరంగా ఉండటం మంచిది !

heat wave tips

Heat Wave Tips : వేసవి ఉష్ణోగ్రతలు తీవ్రంగా ఉంటున్నాయి. దీనికి తోడు వడగాల్పులు కూడా తోడవటంతో ఇంటి నుండి బయటకు అడుగు పెట్టలేని పరిస్ధితి నెలకొంది. వేసవి వేడి ఇది నిర్జలీకరణం, అలసట, హీట్‌స్ట్రోక్‌కు కారణమవుతుంది. వేసవి వేడి నుండి కాపాడుకోవాలంటే ఇంటి లోపల ఎయిర్ కండిషన్డ్ పరిసరాలలో ఉండటం చాలా అవసరం.

READ ALSO : Heatwave Digestive Problems : వేసవి అధిక ఉష్ణోగ్రతల వల్ల తలెత్తె జీర్ణ సమస్యల నుండి రక్షించుకోవటానికి చిట్కాలు !

పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా ఎదురయ్యే వేడి సంబంధిత అనారోగ్యాలను నివారించడానికి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మద్యం, టీ, కాఫీ , కార్బోనేటేడ్ శీతల పానీయాలు పదేపదే తీసుకోవటం వల్ల ఎక్కువ శరీర ద్రవాలను కోల్పోయే అవకాశం ఉన్నందున వాటిని నివారించాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రజలకు సూచించింది.

ఎక్కువ గంటలు గడిచిన నిల్వ ఉంచిన ఆహారాలను తీసుకోరాదు. హైడ్రేటెడ్ గా ఉండటం , క్రమం తప్పకుండా నీరు త్రాగడం ద్వారా శరీరం కోల్పోయిన ద్రవాలను తిరిగి నింపడం చాలా ముఖ్యం. నిర్జలీకరణం తీవ్రమైన పరిస్థితులలో తీవ్రమైన బలహీనత, అలసట, ఇతర అనారోగ్యాలకు దారితీస్తుంది.

READ ALSO : Meditation In Summer : వేసవిలో ధ్యానం వల్ల శరీరం చల్లబడటంతోపాటు అనేక ప్రయోజనాలు !

ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచిస్తున్న ఆహార సంబంధిత జాగ్రత్తలు ;

వేసవి సమయంలో ఎండ అధికంగా ఉండే సమయంలో ఆరుబయట వంటి చేయటం మానుకోవటం మంచిది. వంట ప్రదేశాన్ని వెంటిలేట్ ఉంచేలా తలుపులు మరియు కిటికీలను తెరవాలి.

ఆల్కహాల్, టీ, కాఫీ మరియు కార్బోనేటేడ్ శీతల పానీయాలను నివారించాలి. ఎందుకంటే అవి ఎక్కువ శరీర ద్రవాలను కోల్పోయేలా చేస్తాయి. అధిక మాంసకృత్తులు కలిగిన ఆహారాలను తీసుకోరాదు. పండ్లు, ఆకుకూరలు, కూరగాయలతో తయారైన ఆహారాలను తీసుకోవాలి.

READ ALSO : Benefits Of Aloe vera : వేసవిలో కలబందను ఉపయోగించటం వల్ల కలిగే ప్రయోజనాలు !

అదనంగా, కొబ్బరి నీరు, నిమ్మరసం మరియు పండ్ల రసాలు వంటి చల్లని పానీయాలు తీసుకోవాలి. అధిక మొత్తంలో భోజనం తినడం కూడా శరీరంలో వేడిని ఉత్పత్తి చేస్తుంది అంతేకాకుండా అసౌకర్యంగా అనిపిస్తుంది. అధిక భోజనం తీసుకుంటే శరీరం ఆహారాన్ని జీర్ణం చేయడానికి, దానిని జీవక్రియ చేయడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. ఇది శరీరంలోపల ఉష్ణోగ్రతను పెంచుతుంది. చెమట మరియు నీరసంగా అనిపిస్తుంది. అందువల్ల వేసవిలో తేలికైన తాజాగా వండిన భోజనాన్ని తీసుకోవాలి.