Jeevan Reddy Resignation: కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్.. రాజీనామా యోచనలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి.. త్వరలోనే ఆ పార్టీలోకి..!
Jeevan Reddy Resignation : జగిత్యాల జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగలబోతుందా అంటే అవుననే సమాధానం వినిసిస్తోంది. కారణం జీవన్ రెడ్డి పార్టీకి రాజీనామా చేయబోతున్నారని సమాచారం.
reports said former minister jeevan reddy will resign to congress party soon
Jeevan Reddy Resignation : తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి జగిత్యాల జిల్లాలో భారీ షాక్ తగలబోతోంది. సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసేందుకు రెడీ అయ్యారని సమాచారం. త్వరలోనే హస్తం పార్టీకి రాజీనామా చేస్తారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. అంతేకాక మార్చి 20 తర్వాత జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరతారని సమాచారం. ఇప్పటికే జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లతో సంప్రదింపులు జరుపుతున్నారని తెలుస్తోంది.
జీవన్ రెడ్డి గత కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీ తీరుపై అసంతృప్తిగా ఉన్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీలో తనకి గౌరవం, సముచిత స్థానం లేదని కొన్ని రోజుల క్రితం సన్నిహితుల వద్ద ఆయన ఆవేదన వ్యక్తం చేశారని సమాచారం. సోషల్ మీడియా గ్రూపులకు కాంగ్రెస్ పేరు తొలగించి జీవన్ రెడ్డి పేరుతో కొనసాగిస్తున్నారు. గౌరవం లేని చోట కొనసాగాలా వద్దా అనే దానిపై ఆలోచన చేస్తున్నానని.. త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకుంటానని జీవన్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. ఈ క్రమంలోనే ఆయన పార్టీకి రాజీనామా చేయబోతున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.
గత కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే సంజయ్ కే ప్రాధాన్యత ఇవ్వడంతో జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. దీనిపై బహిరంగంగానే తన విమర్శలు చేశారు. ఈ పరిణామాలపై సన్నిహితులు, ఆప్తులతో సమావేశం అయిన తరువాత రాజీనామా చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. జగిత్యాలలో సభ నిర్వహించి పార్టీ మారాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కూడా జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేయలేదు. ఈ నేపథ్యంలోనే త్వరలోనే ఆయన పార్టీకి రాజీనామా చేస్తారని తెలుస్తోంది.
