DG Sanjay Bahadur : ఎన్నికల నేపథ్యంలో తనిఖీలు.. రూ.53.93 కోట్లు, 156 కేజీల బంగారం, 464 కేజీల వెండి స్వాధీనం : ఐటీ డీజీ సంజయ్ బహదూర్

ఎన్నికల సందర్భంగా 33 జిల్లాల్లో క్యూఆర్టీ టీమ్స్ పని చేస్తున్నాయని తెలిపారు. ఐటీ యాక్ట్ సెక్షన్ 132, 132(a) కింద నగదు సీజ్ చేస్తున్నామని వెల్లడించారు. సెక్షన్ 132 ప్రకారం నేరుగా ఐటీ డబ్బు సీజ్ చేయచ్చన్నారు.

IT Department DG Sanjay Bahadur

IT Department DG Sanjay Bahadur : తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఐటీ శాఖ అలర్ట్ గా పని చేస్తుందని ఇన్ కమ్ ట్యాక్స్ డైరెక్టర్ జనరల్ సంజయ్ బహదూర్ పేర్కొన్నారు. పత్రాలు లేని నగదు, బంగారం, సీజ్ చేస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు పోలీస్ శాఖ నుండి రూ.53.93 కోట్లు, 156 కేజీల గోల్డ్, 454 సిల్వర్ ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కు వచ్చాయని తెలిపారు. కానీ అన్ని పత్రాలు చూసిన తర్వాత కేవలం రూ.1.76 మాత్రమే సీజ్ చేశామని తెలిపారు. అన్ని పత్రాలు చూసి సీజ్ చేసిన బంగారం, సిల్వర్ ఇచ్చామని తెలిపారు.

ఎన్నికల సందర్భంగా 33 జిల్లాల్లో క్యూఆర్టీ టీమ్స్ పని చేస్తున్నాయని తెలిపారు. ఐటీ యాక్ట్ సెక్షన్ 132, 132(a) కింద నగదు సీజ్ చేస్తున్నామని వెల్లడించారు. సెక్షన్ 132 ప్రకారం నేరుగా ఐటీ డబ్బు సీజ్ చేయచ్చన్నారు. 132(ఏ) కింద పోలీసులు సీజ్ చేసిన డబ్బును ఐటీకు అందజేస్తారని పేర్కొన్నారు. ఇప్పటివరకు పోలీసులు ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారం రూ.53.93 కోట్లు సీజ్ చేశామని, 156 కేజీల బంగారం, 464 కేజీల వెండి స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

Komatireddy Rajgopal Reddy : గజ్వేల్ లో పోటీ చేస్తా.. కేసీఆర్ కి రిటర్న్ గిఫ్ట్ ఇస్తా: కోమటిరెడ్డి

సెక్షన్ 132 ప్రకారం ఐటీ రూ.14.8 కోట్లు ఐటీ సీజ్ చేసిందని తెలిపారు. ఇప్పటి వరకు ఇంటిలెజెన్స్ సమాచారంతో ఇన్ కమ్ ట్యాక్స్ రూ.14.8 కోట్లు సీజ్ చేశామని పేర్కొన్నారు. రూ.10 లక్షలపై బడిన నగదు పట్టిబడునప్పుడు మాత్రమే పోలీసులు ఐటీకి అప్పగిస్తారని తెలిపారు. 2018 ఎన్నికల్లో ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ రూ.20 కోట్ల నగదు సీజ్ చేసిందన్నారు.

ట్రెండింగ్ వార్తలు