Madapur SOT Police : సెల్‌ఫోన్ల చోరీ రాకెట్‌ను చేధించిన పోలీసులు.. ఆ ఫోన్లన్నీ రెండు రాష్ట్రాల్లోనివే

నిందితుడి నుండి 563 మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నామని, అతని వ్యక్తిగత మొబైల్స్‌తో పాటు మూడు లక్షల నగదు సీజ్ చేయడం జరిగిందని చెప్పారు.

Cell phone theft

Cell phone theft racket : సెల్ ఫోన్లు చోరీచేస్తున్న నిందితుడిని మాధాపూర్ ఎస్వోటీ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుండి 563 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా మాదాపూర్ డీసీపీ సందీప్ మాట్లాడుతూ.. రాయదుర్గం పోలీసులు, మాదాపూర్ ఎస్వోటీ పోలీసుల సంయుక్త ఆపరేషన్ నిర్వహించి సెల్ ఫోన్లు చోరీ చేస్తున్న నిందితుడిని అరెస్టు చేసినట్లు తెలిపారు. నిందితుడి నుండి 563 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకోవటం జరిగిందని, నిందితుడు కడప జిల్లాకు చెందిన రామాంజనేయులుగా గుర్తించడం జరిగిందని చెప్పారు. ప్రస్తుతం హైదరాబాద్ ఎల్బీనగర్‌లో ఉంటున్నాడు. ఇతనిపై 2016లో షామీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదు అయిందని డీసీపీ తెలిపారు.

Maharashtra : ఆలయంలో చొరబడ్డ ఉగ్రవాది చెంపలు వాయించిన భక్తుడు .. సూపర్ ట్విస్ట్ ఇచ్చిన టెర్రరిస్టు..

ఆర్టీసీలో కండక్టర్‌గా‌కూడా నిందితుడు పనిచేశాడు. అనంతరం రియల్ ఎస్టేట్ చేశాడు. వేరే రాష్ట్రాలలో చోరీ చేసిన మొబైల్స్‌లను‌కొని ఐఎంఈఐ నంబర్ చేంజ్ చేసి ఇక్కడ విక్రయిస్తూ వచ్చాడు. నిఘా ఉంచిన పోలీసులు ప్లాన్ ప్రకారం నిందితుడిని అరెస్ట్ చేశారని డీసీపీ సందీప్ తెలిపారు. నిందితుడి కదలికలపై నిఘా ఉంచి మంగళవారం సాయంత్రం వెహికల్స్ చెకింగ్ చేపట్టాం. అతని కారు చెక్ చేయగా కారులో మొబైల్ ఫోన్లు దొరికాయి. ఆకాష్, సన్నీ, వంశీ అనే ముగ్గురు రామాంజనేయులకు సప్లయర్స్. ఈ ముగ్గురు ఆసిఫ్ అండ్ అశ్రఫ్ నుండి చోరీ చేసిన మొబైల్స్ తీసుకుంటారు. ఇలా తన చేతికి వచ్చిన మొబైల్స్‌ను కొన్ని షాపులో ఐఎంఈఐ నెంబర్ చేంజ్ చేస్తున్నారు. ఐఎంఈఐ నెంబర్ చేంజ్ చేసి ఇతరులకు తక్కువ ధరకు విక్రయిస్తున్నాడు.

SIM Cards : బాబోయ్ వీడు మహామదురు..! ఒకే వ్యక్తికి వందల సంఖ్యలో సిమ్ కార్డులు.. పోలీసుల దర్యాప్తులో దిమ్మతిరిగే వాస్తవాలు

స్వాధీన పరచుకున్న మొబైల్స్ అన్ని ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో చోరీ చేసినవేనని డీసీపీ తెలిపారు. ఎవరిదైనా మొబైల్ ఫోన్ పోతే సీఈఐఆర్‌లో నమోదు చేయాలి. ఐఎంఈఐ బ్లాక్ చేసుకోవాలని తెలిపారు. నిందితుడి నుండి 563 మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నామని, అతని వ్యక్తిగత మొబైల్స్‌తో పాటు మూడు లక్షల నగదు సీజ్ చేయడం జరిగిందని చెప్పారు.

ట్రెండింగ్ వార్తలు