SIM Cards : బాబోయ్ వీడు మహాముదురు..! ఒకే వ్యక్తికి వందల సంఖ్యలో సిమ్ కార్డులు.. పోలీసుల దర్యాప్తులో దిమ్మతిరిగే వాస్తవాలు

సిమ్‌ కార్డుల మోసాలను అరికట్టేందుకు టెలి కమ్యూనికేషన్ శాఖ ప్రత్యేకంగా ఓ వ్యవస్థను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌‌ (ఏఐ) తో పనిచేసే ఓ టూల్ కిట్ ద్వారా ఈ సిమ్ కార్డుల దందా బయటపడింది.

sim Cards

Vijayawada Police Sim Cards : మీ వద్ద ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయి.. ఒకటి లేదా రెండు.. మహా అంటే మూడు.. అదీకాదంటే.. ఒక్కో కంపెనీకి చెందిన ఒక్కో సిమ్ కార్డు.. కానీ, విజయవాడకు చెందిన ఓ యువకుడు ఒకే ఫొటోతో పదుల సంఖ్యలో కాదు.. ఏకంగా వందల సంఖ్యలో సిమ్ కార్డులు కొనుగోలు చేశాడు. ఈ విషయం డాట్ (డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికమ్యునికేషన్స్‌) అధికారులు గుర్తించి విజయవాడ సీపీ కాంతిరాణాకు ఫిర్యాదు చేశారు. సూర్యాపేట పోలీసులకు సీపీ కాంతిరాణా విచారణ చేయాలని ఆదేశించారు. ఈ క్రమంలో పోలీసులు దర్యాప్తు చేయగా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Aadhar Card Free Update : ఆధార్ ఫ్రీ అప్‌డేట్ గడువు పొడిగింపు.. ఈ తేదీలోగా మీ ఆధార్‌లో ఏదైనా ఫ్రీగా మార్చుకోవచ్చు.. ఆ తర్వాత కష్టమే..!

విజయవాడలోని గుణదలలో ఓ వ్యక్తి ఒకే ఫొటోతో ఓ నెట్‌వర్క్‌ సంస్థకు చెందిన 658 సిమ్‌లను అమ్మినట్లు పోలీసులు గుర్తించారు. అయితే, సత్యనారాయణపురానికి చెందిన నవీన్‌ అనే యువకుడు ఈ సిమ్ కార్డుల్ని రిజిస్టర్‌ చేసినట్లు పోలీసులు గుర్తించారు. అజిత్‌సింగ్‌నగర్‌, విస్సన్నపేట పోలీస్‌స్టేషన్ల పరిధిలో మరో 150 వరకు సిమ్‌కార్డులు నకిలీ పత్రాలతో జారీ చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

Chandrababu Naidu: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై కేసు నమోదు.. మరో ఇద్దరు మాజీ మంత్రులు, టీడీపీ నేతలపైనా..

సిమ్‌ కార్డుల మోసాలను అరికట్టేందుకు టెలి కమ్యూనికేషన్ శాఖ ప్రత్యేకంగా ఓ వ్యవస్థను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌‌ (ఏఐ) తో పనిచేసే ఓ టూల్ కిట్ ద్వారా ఈ సిమ్ కార్డుల దందా బయటపడింది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ ఫేసియల్‌ రికగ్నేషన్‌ వెరిఫికేషన్‌ సాఫ్ట్‌వేర్‌ ద్వారా సిమ్‌కార్డు మోసాలను గుర్తింంచారు. అయితే, ఈ సిమ్‌లు ఎక్కడికి వెళ్లాయి? ఎవరు వినియోగిస్తున్నారన్న అంశాలపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు