Minister KTR : పోరాడి సాధించుకుని అభివృద్ధి చేసుకున్న తెలంగాణను ఎవరి చేతుల్లో పెట్టాలో ఆలోచించండి : కేటీఆర్

ఎన్నికల వేళ ఎంతోమంది నేతలు వస్తారు..మాయ మాటలు చెబుతారు కానీ ఏది మంచో ఏది చెడో ఆలోచించుకోవాలన్నారు. మతం పేరుతో చిచ్చు పెట్టేవారిని నమ్మొద్దన్నారు. కేసీఆర్ ఎప్పుడు మతం పేరుతో రాజకీయాలు చేయలేదన్నారు.

Minister KTR

Minister KTR In Karimnagar Meeting : పోరాడి సాధించుకుని అభివృద్ధి చేసుకుంటున్న తెలంగాణను ఎవరి చేతుల్లో పెట్టాలో ఆలోచించిండి అంటూ మంత్రి కేటీఆర్ ప్రజలకు పిలుపినిచ్చారు. కరీంనగర్ లో బీఆర్ఎస్ బహిరంగ సభలో కేటీఆర్ మాట్లాడుతు ఒకప్పుడు నీటి కొరతతో ఉండే కరీంనగర్ ఇప్పుడు సజీవ జలధారలా కనిపిస్తోందని అన్నారు. కరీంనగర్ లో వచ్చిన మార్పుని ప్రజలు గమనించి ఓటు వేయాలని సూచించారు.

తాగునీరు, సాగునీరు కష్టాలతో పాటు కరెంట్ కష్టాల్ని కూడా పరిష్కరించుకున్నామని తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నాలుగు మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసుకున్నామని యువతకు విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న పార్టీని మరోసారి గెలిపించి రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసుకునేలా ఆలోంచి ఓటు వేయాలని సూచించారు. 1000 గురుకులాలు ఉన్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనన్నారు.

Also Read : తెలంగాణకు చేసిందేమీ లేదు గానీ ఎన్నికల వేళ ఢిల్లీ నేతలు క్యూ కడుతున్నారు : ఎమ్మెల్సీ కవిత

ఎన్నికల వేళ ఎంతోమంది నేతలు వస్తారు.. మాయ మాటలు చెబుతారు కానీ ఏది మంచో ఏది చెడో ఆలోచించుకోవాలన్నారు. మతం పేరుతో చిచ్చు పెట్టేవారిని నమ్మొద్దన్నారు. కేసీఆర్ ఎప్పుడు మతం పేరుతో రాజకీయాలు చేేయలేదన్నారు. మోదీ దేవుడు అని బండి సంజయ్ అంటున్నారు.. కానీ మోదీ ఎవరికి దేవుడో ఆయనే చెప్పాలని ప్రశ్నించారు. కరీంనగర్ కు ఏదీ చేయనివారు ఈరోజు ఓట్లు అడుగుతున్నారు అంటూ మండిపడ్డారు. తొమ్మిదిన్నరేళ్ల క్రితం తెలంగాణ ఎలా ఉంది..? ఇప్పుడు ఎలా ఉందో ఆలోచించాలని ఓ తండ్రిలా తెలంగాణను సాకుతాడనే నమ్మకంతో కేసీఆర్ ను సీఎంను చేసిన ప్రజలు మరోసారి అధికారం ఇచ్చేలా ఆదరించాలని కోరారు. బీఆర్ఎస్ పాలనలో తండాల్లో కరెంట్, రోడ్ల సదుపాయాలు వచ్చాయన్నారు. పోడు భూములకు పట్టాలు ఇచ్చింది కేసీఆర్ అనే విషయం మర్చిపోకూడదని సూచించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుబంధు అమలు చేస్తున్నామన్నారు.

Also Read: అందుకు కారణం అతనే.. అదానిపై నిప్పులు చెరిగిన రాహుల్ గాంధీ

ప్రవళిక కుటుంబాన్ని ఆదుకుంటాం
ఈ సందర్భంగా ప్రవళిక మరణం గురించి కేటీఆర్ స్పందిస్తూ.. ఆమె మరణాన్ని కూడా రాజకీయం చేస్తున్నారు అంటూ మండిపడ్డారు. ప్రవళిక కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.ప్రవళిక కుటుంబ సభ్యులు తనను కలిసారని తమ బిడ్డ వేధింపులు భరించలేక చనిపోయిందని కన్నీరు పెట్టుకున్నారని.. వారి కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఆమె కుటుంబాన్ని ఆదుకుంటామని ప్రవళిక తమ్ముడికి ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. బాధితులను ఆదుకునేలా వ్యవహరించాలి తప్ప చావులపై రాజకీయం చేయకూడదని అన్నారు.

ట్రెండింగ్ వార్తలు