Minister KTR : 45 రోజులు మా కోసం పని చేయండి, ఐదేళ్లు మేము మీకోసం చేస్తాం : కేటీఆర్

తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవం కి చిహ్నం బీఆర్ఎస్ పార్టీ అన్నారు. 2001లో పార్టీ నిర్మాణం జరిగింది.ఆనాడు పార్టీ కార్యాలయానికి ఆచార్య కొండ లక్ష్మన్ బాపూజీ స్థలం ఇచ్చారు అంటూ గుర్తు చేసుకున్నారు.

Minister KTR

Minister KTR Fire Congress, BJP Party : 45 రోజులు మా కోసం పని చేయండి, ఐదేళ్లు మేము మీకోసం చేస్తాం అంటూ పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. రాజన్న సిరిసిల్లా జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభించిన సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవానికి చిహ్నం బీఆర్ఎస్ పార్టీ అన్నారు. 2001లో పార్టీ నిర్మాణం జరిగిందని.. ఆనాడు పార్టీ కార్యాలయానికి ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ స్థలం ఇచ్చారని గుర్తు చేసుకున్నారు.

బీఆర్‎ఎస్ మ్యానిఫెస్టో చూసి విపక్షాల మైండ్ బ్లాంక్ అయ్యిందిని సెటైర్లు వేశారు. ఖురాన్, భగవద్గీత, బైబిల్ లాగా బీఆర్ఎస్ మేనిఫెస్టోని చూడాలన్నారు. కేసీఆర్ రెండుసార్లు రుణమాఫీ చేశారని.. మన ప్రభుత్వంలో నాకు బాగా నచ్చిన పథకం కేసీఆర్ బీమా అని తెలిపారు. మన ప్రభుత్వం మనం ఏం చేశాయో లిస్టు చూపించి అప్పుడు ఓట్లు అడగాలన్నారు. ఓటర్ ను అడిగి, ఒప్పించి, మెప్పించి ఓట్లు అడగాలని సూచించారు. కరీంనగర్ భీముడు కమలాకర్ గెలిచి తీరుతారంటూ ధీమా వ్యక్తంచేశారు.

Also Read : తెలంగాణ కోసం పోరాడింది కేసీఆర్ ఒక్కరే కాదు బీజేపీ కూడా పోరాడింది : రాజ్ నాథ్ సింగ్

బీఆర్ఎస్ పార్టీ శాశ్వతంగా ఉండాలనే అన్ని జిల్లాలో పార్టీ కార్యాలయాలు నిర్మాణం చేస్తున్నామని తెలిపారు. పార్టీ కార్యాలయం అంటే ప్రతీ బీఆర్ఎస్ కార్యకర్తకు సొంత ఇల్లు లాంటిదన్నారు. బీఆర్ఎస్ పార్టీకి 60 లక్షల సైన్యం ఉందని, గులాబీ జెండా అంటేనే పేదల జెండా అన్నారు. కార్యకర్తల ఇంట్లో శుభకార్యాలు చేసుకోవాలనుకుంటే తక్కువ ఖర్చుతోనే వాటికి పార్టీ కార్యాలయాన్ని ఇవ్వాలని సూచించారు. బీఆర్ఎస్ భవనం అంటే అది కార్యకర్తలకు సొంత ఇల్లు లెక్క అంటూ చెప్పుకొద్చారు. గులాబీ కార్యాలయం అనాథలకు నీడనిచ్చేలా ఉండాలన్నారు.

కులాంతర వివాహాలు చేసుకునే వారికి కూడా బీఆర్ఎస్ పార్టీ వేదికగా ఉండేలా నిర్వహించాలని సూచించారు. ఎప్పుడు సిరిసిల్లకి వచ్చినా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి వచ్చి ఓ చాయ్ తాగి వెళ్లాలని, అంత ఆత్మీయంగా పార్టీ కార్యాలయాన్ని భావించాలన్నారు. ప్రతి రోజు నాయకులు ప్రెస్ మీట్ లు పెట్టి పార్టీ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఎదుటి పార్టీవారు మనల్ని దూషిస్తే కౌంటర్ ఇచ్చేలా ప్రెస్ మీట్ పెట్టాలని పిలుపునిచ్చారు.

Also Read: కేసీఆర్.. చర్చకు మీ కొడుకు వస్తాడా? అల్లుడు వస్తాడా..? ఏ విషయంలో మీరు గొప్పోళ్లు

కాంగ్రెస్, బీజేపీ బాస్ లు ఢిల్లీలో ఉంటారు కానీ బీఆర్ఎస్ బాసులు గల్లీలు ఉంటారన్నారు. జిల్లా పార్టీ కార్యాలయం 13 మండలాలు, సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీ ప్రజలదని అన్నారు. ఎన్నికలు ఐదేళ్ల కోసం వస్తాయి.. కానీ నాయకులతోనే సమస్యలు చెప్పుకునేలా ఉండాలని.. బీఆర్ఎస్ ప్రకటించిన మేనిఫెస్టోను చూసి కాంగ్రెస్, బీజేపీ దుప్పటి కప్పుకుని పడుకున్నాయి అని సెటైర్లు వేశారు.

ట్రెండింగ్ వార్తలు