Revanth Reddy: కాంగ్రెస్‌లో చేరిన మరింత మంది బీఆర్ఎస్ నేతలు.. రేవంత్ రెడ్డి ఏమన్నారంటే?

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచే పరిస్థితులు లేవని అన్ని సర్వేలూ చెబుతున్నాయని అన్నారు.

Revanth Reddy

Revanth Reddy – Congress: తెలంగాణ (Telangana) కాంగ్రెస్ పార్టీలో మరింత మంది బీఆర్ఎస్ (BRS) నేతలు చేరారు. ఇవాళ హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో మహబూబ్‌ నగర్, అలంపూర్‌, దేవరకద్ర ప్రాంతాలకు చెందిన నేతలు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.

అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచే పరిస్థితులు లేవని అన్ని సర్వేలూ చెబుతున్నాయని అన్నారు. హైదరాబాద్‌ లో పేదల కోసం డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించడానికి స్థలాలు లేవని కేసీఆర్ చెప్పారని రేవంత్ రెడ్డి అన్నారు.

మరి అదే హైదరాబాద్ లో ప్రభుత్వం వందల ఎకరాల స్థలాలను ఎలా అమ్ముకుంటోందని నిలదీశారు. మరో 100 రోజుల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సర్కారు వస్తుందని అన్నారు. బీఆర్ఎస్ పాలనలో భూములు కొన్నవారు జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. అలాగే, తెలంగాణలో మద్యం దుకాణాలను తమవారికే ఇచ్చేందుకు ముందుగానే టెండర్లు వేశారని ఆరోపించారు. తాము అధికారంలోకి రాగానే మద్యం దుకాణాలకు టెండర్లను మళ్లీ పిలుస్తామని చెప్పారు.

Nara Lokesh: ఈ ఫొటోలో కనిపిస్తున్నది ఏంటో తెలుసా?: నారా లోకేశ్ సెల్ఫీ చాలెంజ్

ట్రెండింగ్ వార్తలు