Vangalapudi Anitha: వైఎస్ జగన్‌కి సవాలు విసిరిన హోం మంత్రి వంగలపూడి అనిత

Home Minister Vangalapudi Anitha: అసెంబ్లీకి వస్తే జగన్ చేసిన పనులు బయటపడతాయని జగన్ మరో మార్గంలో వెళ్తున్నారని అనిత విమర్శించారు.

Home minister Anitha Vangalapudi

ఆంధ్రప్రదేశ్‌లో శాంతి భద్రతల అంశంపై మాజీ ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీకి వెళ్తే తానూ కూడా అక్కడికే వెళ్లి తేల్చుకుంటానని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఇవాళ అమరావతిలో ఆమె మీడియాతో మాట్లాడారు. వైఎస్ వివేకానంద హత్యతో పాటు వైసీపీ పాలనలో ఏపీలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయి? ఇప్పుడు తమ పాలనలో రాష్ట్రం ఎలా ఉందో చర్చించేందుకు తానే వస్తానని సవాలు విసిరారు.

అసెంబ్లీకి వస్తే జగన్ చేసిన పనులు బయటపడతాయని జగన్ మరో మార్గంలో వెళ్తున్నారని అనిత విమర్శించారు. అసెంబ్లీలో ఈ నెల 24న శాంతి భద్రతలపై శ్వేతపత్రం పెట్టి ప్రభుత్వం చర్చ చేపట్టనుందని తెలిపారు. దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి చర్చలో పాల్గొనాలని అన్నారు. ఢిల్లీకి వెళ్లాలనుకుంటే అసెంబ్లీలో చర్చ తర్వాత కూడా వెళ్లొచ్చని చెప్పారు.

జగన్ చేస్తున్న శవ రాజకీయాలకు ఆయనకు సిగ్గనిపించకపోయినా ఏపీ ప్రజలు ఆయన ప్రవర్తనకు సిగ్గుపడుతున్నారని అనిత అన్నారు. జగన్ చెప్పినట్లు నెల రోజుల వ్యవధిలో 36 రాజకీయ హత్యలు జరిగితే ఆ వివరాలు బయటపెట్టాలని చెప్పారు. ఎన్నికల్లో ప్రజలు ఆయనకు బుద్ధి చెప్పారని అన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక 4 రాజకీయ హత్యలు జరిగితే అందులో చనిపోయిన ముగ్గురు తెలుగుదేశం వారేనని తెలిపారు.

Also Read: రాజకీయాల్లో నాకు ఆశలు లేవు.. నాకు వయసు సహకరించినంతవరకు ఈ జీవితం వాళ్ళకే..

ట్రెండింగ్ వార్తలు