Dowleswaram Barrage : ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద గేట్ల మధ్యలో ఇరుక్కుపోయిన బోటు.. వీడియో వైరల్

దవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద గేట్లు మధ్యలో బోటు ఇరుక్కుపోయింది. బ్యారేజీ మొదటి గేటు వద్ద ఈ ఘటన జరిగింది.

Dowleswaram Barrage

Dowleswaram Barrage : తూర్పుగోదావరి జిల్లాలో గత నాలుగు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. స్థానికంగా కురుస్తున్న వర్షాలకుతోడు, ఎగువ ప్రాంతాల్లోనూ వర్షాలు కురుస్తుండటంతో గోదావరిలో వరద నీటిమట్టం అంతకంతకూ పెరుగుతోంది. దవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద 10.2 అడుగుల వద్ద నీటిమట్టం కొనసాగుతుంది. బ్యారేజ్ నుంచి 5లక్షల9వేల క్యూసెక్కుల మిగులు జలాలను బ్యారేజ్ కు చెందిన 175 గేట్లు ఎత్తి సముద్రంలోకి అధికారులు వదులుతున్నారు. అయితే, దవళేశ్వరం బ్యారేజ్ వద్ద బోటు ఇరుక్కుపోయింది.

Also Read : ఇంత దారుణమా.. మహిళను జుట్టు పట్టుకొని కొట్టిన కారు ఓనర్.. మహిళ వీడియో వైరల్..

దవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద గేట్లు మధ్యలో బోటు ఇరుక్కుపోయింది. బ్యారేజీ మొదటి గేటు వద్ద ఈ ఘటన జరిగింది. గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుండటంతో లంగరు వేసిన ఇసుక బోటు కొట్టుకుపోయింది. బ్యారేజ్ వద్ద గేట్ల మధ్య బోటు ఇరుక్కుపోయింది. బోటును బయటకు తీసేందుకు ఇరిగేషన్ సిబ్బంది, స్థానికులు ప్రయత్నిస్తున్నారు. నదిలో నీటి ప్రవాహం పెరుగుతుండటంతో బోటును బయటకు తీయడం కష్టతరంగా మారుతుంది.

Also Read : Soundarya – Krishna Vamsi : సౌందర్యని అలా చూపించింది కృష్ణవంశీ కాదా? ఆ ఛానల్ వాళ్ళా?

ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దేవీపట్నం మండలం గండి పోచమ్మ అమ్మవారి ఆలయం వద్ద ఉధృతంగా గోదావరి నీటిమట్టం పెరిగిపోతోంది. దీంతో గండి పోచమ్మ అమ్మవారి ఆలయం పూర్తిగా నీటమునిగింది. అల్లూరి జిల్లాలో భారీ వర్షాలు, వరదలతో రాకపోకలు స్తంభించాయి. వరద ఉద్ధృతితో జాతీయ రహదారి 326 కోతకు గురైంది. జాతీయ రహదారిపై వరద చేరికతో ఒడిశా – ఆంధ్ర మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరి వరద ఉద్ధృతి కారణంగా భద్రాచలం – చింతూరు, కూనవరం – భద్రాచలం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.

ట్రెండింగ్ వార్తలు