Jio AirFiber Data Booster Plan : జియో ఎయిర్‌ఫైబర్ బూస్టర్ డేటా ప్లాన్ ఇదిగో.. 1000జీబీ డేటా పొందొచ్చు.. ధర ఎంతంటే?

Jio AirFiber Data Booster Plan : రిలయన్స్ జియో ఎయిర్‌ఫైబర్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. జియో ఎయిర్‌ఫైబర్ సర్వీసు కింద కొత్త బూస్టర్ ప్లాన్ ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ ద్వారా కస్టమర్లు 1000జీబీ డేటాను పొందవచ్చు. పూర్తివివరాలు ఇలా ఉన్నాయి.

Akash Ambani announces booster plan for Jio AirFiber Serivces

Jio AirFiber Data Booster Plan : ఆకాష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో ఇప్పటికే భారత్‌లో టెలికాం రంగాన్ని మార్చేసింది. ముకేష్ అంబానీ కంపెనీని ఇప్పటికే కొత్త శిఖరాలకు తీసుకెళ్లగా.. యువ అంబానీ ఇప్పుడు దేశీయ అతిపెద్ద టెలికాం కంపెనీలలో ఒకటైన జియోకు నాయకత్వం వహిస్తున్నారు.

గత ఏడాదిలోనే రిలయన్స్ జియో డైరెక్టర్‌గా ఆకాష్ అంబానీ నియమితులయ్యారు. గత 12 నెలల్లో, జియో కొన్ని విప్లవాత్మక ఉత్పత్తులను ప్రకటించింది. అందులో ఒకటి జియో ఎయిర్‌ఫైబర్ సర్వీసు. ఫిజికల్ కనెక్టివిటీ ద్వారా చేరుకోవడం కష్టంగా ఉన్న ప్రాంతాలకు జియో ఎయిర్‌ఫైబర్ సర్వీసులను చివరి మైలు వరకు కనెక్టివిటీని అందిస్తుంది.

కొత్త రూ. 401 బూస్టర్ డేటా ప్లాన్ : 
ఈ సర్వీసు ప్రారంభంలో కేవలం 8 నగరాలకే పరిమితం అయింది. అయితే, తక్కువ సమయంలోనే కంపెనీ 115 నగరాలకు ఎయిర్‌ఫైబర్ సర్వీసులను విస్తరించింది. ఇప్పుడు కస్టమర్లను ఆకట్టుకునేందుకు కంపెనీ రూ. 401 అనే కొత్త బూస్టర్ ప్లాన్‌ను ప్రకటించింది. ఈ కొత్త బూస్టర్ ప్లాన్ ద్వారా 1000జీబీ డేటాను అందిస్తుంది. ఒక బిల్లింగ్ సైకిల్‌కు మాత్రమే వర్తిస్తుంది. డేటా ఒకే బిల్లింగ్ సైకిల్‌కు పరిమితం అయింది.

Read Also : JioPhone Prima Plans : జియోఫోన్ ప్రైమా 4జీ ప్రీపెయిడ్ ప్లాన్లు ఇవే.. ఏ ప్లాన్ ధర ఎంతంటే? పూర్తి లిస్టు మీకోసం..!

డేటా మిగిలితే.. క్యారీ ఓవర్ కాదు :
మీరు మొత్తం డేటాను ఉపయోగించలేకపోతే.. మిగిలినది క్యారీ ఓవర్ కాదని గమనించాలి. డేటా బూస్టర్ ప్లాన్ యాక్సెస్ చేయడానికి సాధారణ జియో ఎయిర్‌ఫైబర్ లేదా జియో ఎయిర్‌ఫైబర్ మ్యాక్స్ ప్లాన్‌ని కలిగి ఉండాలి. ఈ ప్లాన్ పరిమిత కాలం పాటు అదనపు డేటా అవసరమయ్యే వినియోగదారులకు ప్రయోజనకరంగా ఉంటుంది.

Akash Ambani Jio AirFiber Serivces

జియో ఎయిర్‌ఫైబర్ ఫిజికల్ కనెక్షన్ లేని జియో ఫైబర్ లాంటిది. ఈ సర్వీసుకు సబ్‌స్క్రైబర్‌లు మీ ఇల్లు లేదా వ్యాపార ప్రాంగణంలో కవరేజ్ కోసం వై-ఫై రూటర్, 4కె స్మార్ట్ సెట్ టాప్ బాక్స్, వాయిస్-యాక్టివ్ రిమోట్‌ను పొందుతారు. జియో ఎయిర్‌ఫైబర్ వినియోగదారులు ప్రముఖ ఓటీటీ యాప్‌లకు ఉచిత యాక్సెస్‌ను పొందుతారు.

వినియోగదారులు ఈ సబ్‌స్క్రిప్షన్‌ని కూడా ఉపయోగించుకోవచ్చు. స్మార్ట్‌టీవీ, ల్యాప్‌టాప్, మొబైల్ లేదా టాబ్లెట్ వాడే వారికి నచ్చిన ఏదైనా డివైజ్‌లో యాప్‌లను ఉపయోగించవచ్చు. భారత్‌లో జియో ఎయిర్‌ఫైబర్ సబ్‌స్క్రిప్షన్ ధర రూ. 599 నుంచి ప్రారంభమవుతుంది. 1000ఎంబిపిఎస్ స్పీడ్‌తో లైన్ ప్లాన్‌లో టాప్ ధర రూ. 3999కు పొందవచ్చు. జియో ఎయిర్‌ఫైబర్ మాదిరిగానే ఇతర డేటా బెనిఫిట్స్ పొందవచ్చు.

Read Also : Reliance Jio Plans : రిలయన్స్ జియో చౌకైన ప్లాన్లు ఇదిగో.. అన్‌లిమిటెడ్ కాల్స్, మరెన్నో డేటా బెనిఫిట్స్ మీకోసం..!

ట్రెండింగ్ వార్తలు