R Narayana Murthy : హాస్పిటల్లో చేరిన ఆర్ నారాయణమూర్తి.. ఏమైంది?

తాజాగా పీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తి హాస్పిటల్లో చేరారు.

People Star R Narayana Murthy Joined in Nims Hospital Photos goes Viral

R Narayana Murthy : పీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తి ఎన్నో విప్లవాత్మక సినిమాలు చేస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఎన్నో సూపర్ హిట్ విప్లవ సినిమాల్లో నటించి, దర్శకత్వం వహించి, కొన్ని సినిమాలు నిర్మించి పీపుల్ స్టార్ గా ఎదిగారు. అయితే గతంలో మాదిరి అంత యాక్టివ్ గా లేకపోయినా ఇప్పుడు కూడా అడపాదడపా సందేశాత్మక సినిమాలు చేస్తున్నారు.

Also Read : Naveen Polishetty : పాపం గాయాలతో నవీన్ పోలిశెట్టి.. త్వరలో తిరిగొస్తాను అంటూ..

తాజాగా ఆర్ నారాయణమూర్తి హాస్పిటల్లో చేరారు. ఆయన ఆరోగ్యం స్వల్పంగా దెబ్బతినడంతో హైదరాబాద్ పంజాగుట్టలోని నిమ్స్ హాస్పిటల్లో చేరినట్టు తెలుస్తుంది. అక్కడ డాక్టర్ బీరప్ప పర్యవేక్షణలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఆర్ నారాయణమూర్తి సన్నిహితులు ఈ విషయం తెలిపారు. అయితే ఆయనకు ఏమైంది, ఎందుకోసం హాస్పిటల్లో చేరారు అనేది తెలియాల్సి ఉంది. ఆర్ నారాయణమూర్తి హాస్పిటల్లో చేరారని విషయం తెల్సి అభిమానులు ఆవేదన చెందుతున్నారు. ఆయన త్వరగా కోలుకొని రావాలని కామెంట్స్ చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు