Naveen Polishetty : పాపం గాయాలతో నవీన్ పోలిశెట్టి.. త్వరలో తిరిగొస్తాను అంటూ..

నవీన్ కి యాక్సిడెంట్ అయి చేతికి, కాలికి గాయాలు అయి ఆపరేషన్ అయిందని తెలుస్తుంది.

Naveen Polishetty : పాపం గాయాలతో నవీన్ పోలిశెట్టి.. త్వరలో తిరిగొస్తాను అంటూ..

Naveen Polishetty Injured with Accident Operation to Hand and Leg

Updated On : July 17, 2024 / 2:51 PM IST

Naveen Polishetty : ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, జాతి రత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి.. ఇలా పలు సినిమాలతో ప్రేక్షకులని మెప్పించి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టాడు నవీన్ పోలిశెట్టి. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసిన నవీన్ ఇప్పుడు హీరోగా దూసుకుపోతున్నాడు. వరుసగా హిట్స్ కొడుతున్నాడు అనుకునే సమయంలో బ్యాడ్ న్యూస్ తెలిపాడు నవీన్. గత కొన్నాళ్లుగా నవీన్ బయట కూడా కనపడట్లేదు, సోషల్ మీడియాలో యాక్టివ్ లేడు, సినిమాలేమి ప్రకటించట్లేదు అని అందరూ అనుకున్నారు.

Also Read : Ram Pothineni : యూట్యూబ్ రాకముందే హీరో రామ్ షార్ట్ ఫిలిం తీసాడని తెలుసా? కానీ రామ్ ఫ్రెండ్స్ ఏమన్నారంటే..

తాజాగా నవీన్ నేడు తన సోషల్ మీడియాలో.. ఈ రోజు మీతో నేనొక పర్సనల్ విషయాన్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నా చేతి బోన్ కి తీవ్రమైన మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయ్యాయి, కాలికి కూడా ఇంజురీ అయ్యింది. ఇది చాలా కష్టంగానే ఉంది. ఈ గాయాల వల్ల నేను ఫాస్ట్ గా మీ ముందుకు ఫిలిమ్స్ తీసుకురాలేకపోతున్నందుకు సారీ. గత కొన్ని రోజులు చాలా టఫ్ గా గడిచాయి. నేను కంప్లీట్ గా రికవర్ అయ్యి, మీకు నా బెస్ట్ ఎనర్జిటిక్ వెర్షన్ ని చూపించడానికి మెడికల్ ప్రొఫెషనల్స్ సహాయంతో వర్క్ చేస్తున్నాను. కానీ దానికి కొన్ని నెలలు టైమ్ పడుతుంది. నేను ముందు కంటే స్ట్రాంగ్ గా, హెల్తీ గా కమ్ బ్యాక్ అవ్వాలని గట్టిగా ప్రయత్నిస్తున్నాను. ఇప్పుడు డెవలప్మెంట్ లో ఉన్న నా అప్ కమింగ్ ఫిలిమ్ స్క్రిప్ట్ అధ్బుతంగా, మీకు బాగా నచ్చే విధంగా తయారవుతున్నాయి. నేను పూర్తిగా రికవర్ అయ్యాక వాటి షూటింగ్ మొదలుపెడతాను. మీ లవ్ అండ్ ఎంకరేజ్మెంట్ యే నాకు అన్నీ. నేను తిరిగి మీ ముందుకు రావాలన్న ఆశకి అవే మోటివేషన్. మీ సపోర్ట్ కీ, పేషన్స్ కీ చాలా థాంక్స్. అతి త్వరలో నేను మళ్ళీ స్క్రీన్ మీద కనిపించి, మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాను. మీరు ఎప్పటిలాగే నా మీద మీ ప్రేమని కురిపించడానికి సిద్ధంగా ఉంటారని అనుకుంటున్నాను అని తెలిపాడు.

 

దీంతో నవీన్ కి యాక్సిడెంట్ అయి చేతికి, కాలికి గాయాలు అయి ఆపరేషన్ అయిందని తెలుస్తుంది. ఇందువల్లే ఇన్ని రోజులు బయటకు రాలేదని సమాచారం. నవీన్ ఇలా పోస్ట్ పెట్టడంతో అభిమానులు, పలువురు ప్రముఖులు నవీన్ త్వరగా కోలుకొని రావాలని కామెంట్స్ చేస్తున్నారు.