×
Ad

Vijay : విజయ్ ఎత్తుకున్న ఈ బాబు ఎవరో తెలుసా? ఒకప్పటి స్టార్ హీరోయిన్ కొడుకు..

తాజాగా హీరో విజయ్ ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఫ్యామిలీని కలిసాడు. ఆ హీరోయిన్ కొడుకుని విజయ్ ఎత్తుకున్న ఫోటో వైరల్ గా మారింది.

  • Published On : July 17, 2024 / 03:38 PM IST

Tamil Star Vijay meets with Star Actress Family Photos goes Viral

Vijay : తమిళ్ స్టార్ హీరో, తలపతి విజయ్ ఇటీవల రాజకీయాల్లోకి వస్తున్నాను అని అధికారికంగా ప్రకటించి 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నుంచి పోటీ చేస్తామని చెప్పిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాలు త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నాడు విజయ్. తాజాగా హీరో విజయ్ ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఫ్యామిలీని కలిసాడు. ఆ హీరోయిన్ ఫ్యామిలీతో ఫొటోలు దిగి, కొంత సమయం గడిపాడు.

అయితే ఆ హీరోయిన్ కొడుకుని విజయ్ ఎత్తుకున్న ఫోటో వైరల్ గా మారింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో కాదు రంభ. మన తెలుగమ్మాయి రంభ ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో ఎన్నో సినిమాలు చేసింది. స్టార్ హీరోలందరితో సినిమాలు చేసి ఎన్నో సూపర్ హిట్స్ సాధించి స్టార్ హీరోయిన్ గా కొన్నాళ్లపాటు సినీ పరిశ్రమని ఏలింది. మధ్యలో కొన్ని స్పెషల్ సాంగ్స్ లో కూడా నటించింది రంభ.

Also Read : Bharateeyudu 2 : ఈ పనేదో ముందే చేసి ఉండొచ్చుగా.. భారతీయుడు 2ని కత్తిరించిన శంకర్.. అయినా కష్టమే..

పెళ్లి తర్వాత రంభ సినిమాలకు దూరమయింది. ప్రస్తుతం చెన్నైలోనే తన భర్త, ముగ్గురు పిల్లలతో కలిసి ఫ్యామిలీ లైఫ్ గడుపుతుంది. తాజాగా రంభ తన ఫ్యామిలీతో కలిసి విజయ్ ని కలిసింది. దీంతో విజయ్ తో దిగిన ఫొటోలు తన సోషల్ మీడియాలో షేర్ చేసి.. చాలా రోజుల తర్వాత మిమ్మల్ని కలవడం ఆనందంగా ఉంది, మీ భవిష్యత్తుకు ఆల్ ది బెస్ట్ అంటూ పోస్ట్ చేసింది. ఈ మీటింగ్ లోనే రంభ కొడుకుని విజయ్ ఎత్తుకొని ఫోటో దిగాడు. దీంతో ఈ ఫోటో వైరల్ గా మారింది.