Bharateeyudu 2 : ఈ పనేదో ముందే చేసి ఉండొచ్చుగా.. భారతీయుడు 2ని కత్తిరించిన శంకర్.. అయినా కష్టమే..

భారతీయుడు 2 సినిమాపై కమల్, శంకర్ ఫ్యాన్స్ కూడా నిరాశ చెందారు.

Bharateeyudu Movie trimmed by 12 min Movie Unit Says Watch Edited Version in Theaters

Bharateeyudu 2 : శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ మెయిన్ లీడ్ గా గతంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా భారతీయుడు 2 సినిమా ఇటీవల జులై 12న రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చింది. భారతీయుడు అంత గొప్పగా లేదని, శంకర్ మ్యాజిక్ మిస్ అయిందని, మ్యూజిక్ చాలా మైనస్ అని, కొన్ని చోట్ల బాగా సాగదీశారని.. ఇలా అనేక కామెంట్స్ వచ్చాయి.

భారతీయుడు 2 సినిమాపై కమల్, శంకర్ ఫ్యాన్స్ కూడా నిరాశ చెందారు. కలెక్షన్స్ పరంగా కూడా భారతీయుడు యావరేజ్ గానే నిలిచింది. ఈ సినిమా చివర్లో భారతీయుడు 3 అనౌన్స్ చేసి పార్ట్ 3 ట్రైలర్ కూడా ఇవ్వడం గమనార్హం. అయితే తాజాగా భారతీయుడు 2 సినిమాలో 12 నిముషాలు కట్ చేసారని, ఎడిటింగ్ లో 12 నిముషాలు తీసేసి సినిమాని మళ్ళీ రిలీజ్ చేస్తున్నామని, ఇప్పుడు థియేటర్స్ లో కట్ చేసిన సినిమానే వేస్తున్నామని మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

Also Read : Naveen Polishetty : పాపం గాయాలతో నవీన్ పోలిశెట్టి.. త్వరలో తిరిగొస్తాను అంటూ..

దీంతో ఈ పనేదో ముందే చేసి ఉండొచ్చుగా, ఇప్పుడు కట్ చేసినా కథ మారదుగా అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. అయితే సాగదీత ఎక్కువగా ఉన్న సీన్స్ లో కొంత భాగం కట్ చేశారు. కానీ ఆల్రెడీ ఎల్లుండి నుంచి మళ్ళీ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. దీంతో భారతీయుడు సినిమాని ఇప్పుడు థియేటర్స్ కి వెళ్లి చూడటం జరిగే పని కాదు. థియేటర్స్ కూడా తగ్గుతాయి. దీంతో ఇప్పుడు కట్ చేసినా కలెక్షన్స్ పరంగా అంతగా యూజ్ ఉండదని సినిమా వ్యక్తులు అంటున్నారు.

ట్రెండింగ్ వార్తలు