Bigg Boss Telugu 10 : బిగ్ బాస్‌లో వుమెన్ కార్డు వాడుతున్నారా? గేమ్ ఆడలేక..?
నాగార్జున కూడా వీకెండ్ ఎపిసోడ్ లో వర్షిణి విషయంలో ఇక్కడ జెండర్ లేదు హౌస్ లో అందరూ ఒకటే, ఎవరైనా ఆడాల్సిందే అని చెప్పారు. (Bigg Boss Telugu 10)
Bigg Boss Telugu 10
Bigg Boss Telugu 10 : బిగ్ బాస్ లోకి ఎంటర్ అయ్యాక ఆడ, మగ తేడాలు ఉండవు. ఎవరైనా ఒకటే, ఎవరైనా టాస్కులు, గేమ్స్ ఆడాల్సిందే. గత కొన్నేళ్లుగా ఇదే జరుగుతుంది. మాటలతో ఎవరైనా అనకూడనివి అంటే విమర్శలు, హోస్ట్ తో తిట్లు వస్తాయి తప్ప ఫిజికల్ గేమ్ లో కూడా అంతా ఒకటే అని ఇన్నాళ్లుగా ఆడుతున్నారు. వేరే భాషల్లో కూడా లింగ బేధం లేకుండానే గేమ్స్ ఆడుతున్నారు. ఇటీవల నాగార్జున కూడా వీకెండ్ ఎపిసోడ్ లో వర్షిణి విషయంలో ఇక్కడ జెండర్ లేదు హౌస్ లో అందరూ ఒకటే, ఎవరైనా ఆడాల్సిందే అని చెప్పారు.
అయితే ఈసారి తెలుగు బిగ్ బాస్ సీజన్ 10 లో కొంతమంది కంటెస్టెంట్స్ వుమెన్ కార్డు వాడాలని చూస్తున్నారు. వాళ్ళు ఓడిపోతున్నాం, నెగిటివ్ అవుతున్నాము అన్నప్పుడు అమ్మాయి కదా అంటూ కామెంట్స్ చేయడం, ఏడవడం చేస్తున్నారు. ఇటీవల వరుస ఘటనలతో బిగ్ బాస్ లో ఈ వుమెన్ కార్డుపై విమర్శలు వస్తున్నాయి.
మొదట సృష్టి మొదలుపెట్టింది. సుధీర్ తో మంచిగా ఉన్నన్ని రోజులు ఉండి, మాట్లాడి, సుధీర్ చెప్పిన వాటికి ఓకే చెప్పి, సుధీర్ ఏమన్నా ప్రాబ్లమ్ ఉంటె చెప్పమన్నా ఏం లేదని చెప్పి వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున సృష్టిని ఆడట్లేదు నువ్వు అని ఫైర్ అవ్వగానే తెల్లారి నుంచి సుధీర్ పై ఫైర్ అయింది. ఒక అమ్మాయిని అలా అంటావా, అమ్మాయిని మానసికంగా బాధపెడతావా, నీ ఆట కోసం అమ్మాయిని వాడుకుంటావా అని అమ్మాయి అనే పదం బాగా వాడి సుధీర్ ని పిచ్చ తిట్లు తిట్టింది. సృష్టినే సుధీర్ పై ఫైర్ అయి చివరకు తనే ఏడ్చి సింపతీ కోసం ట్రై చేసింది. ఇదే విషయాన్ని వైల్డ్ కార్డు ఎంట్రీ అపూర్వ కూడా చెప్పింది. నాగార్జున తిట్టనంతవరకు సుధీర్ తో బాగానే ఉన్న సృష్టి తెల్లారేసరికి రివర్స్ అవ్వడంతో ఆడియన్స్ లో ఆమెపై విమర్శలు వచ్చాయి. నాగార్జున కూడా సుధీర్ తప్పేమి లేదని చెప్పాడు.
Also Read : Bigg Boss Today Promo : ఈ వారం నామినేషన్స్ ప్రోమో వచ్చేసింది.. అందరూ కలిసి త్రిగున్ ని టార్గెట్ చేసారుగా..
ఇక సృష్టి తర్వాత వర్షిణి వుమెన్ కార్డు వాడింది. వర్షిణి – అమన్ కి మధ్య జరిగిన టాస్క్ లో వర్షిణినే ముందుగా అమన్ బనీన్ పట్టుకొని లాగి, అతన్ని గోళ్ళతో గీకి హడావిడి చేసింది. అమన్ టాస్క్ కోసం వర్షిణిని కౌగలించుకోవాల్సి వచ్చింది. అప్పటికి కంటెస్టెంట్స్ ఆమెకు కంఫర్టబుల్ గా లేదు అని చెప్పగానే వదిలేసాడు. కానీ వర్షిణి ఆడపిల్ల మీద గెలవడమా, అమ్మాయితో అలా చేస్తారా అని ఏడ్చి సింపతీకి ప్రయత్నించింది. ఈ విషయంలో నాగార్జున కూడా తిట్టాడు. గేమ్ ఆడలేక అమ్మాయి అనే పదం తీసుకురావడం ఎందుకు, ఆడలేకపోతే అసలు బిగ్ బాస్ కి రావడం ఎందుకు అని ఆడియన్స్ నుంచి విమర్శలు వస్తున్నాయి.
దేబ్జానీ కూడా పలుమార్లు ఏడ్చి ఆడపిల్లను నేను అంటూ కామెంట్స్ చేసింది. బాగున్నంతసేపు ముకేశ్ తో రొమాన్స్ చేసిన దేబ్జానీ ఎవరైనా ఏదైనా అంటే మాత్రం ఆడపిల్లని అంటారా అంటూ ఏడుపులు మొదలుపెడుతుంది. కానీ టాస్కుల్లో మాత్రం అబ్బాయిలకు పోటీగా ఆడుతుంది. ఈ విషయంలో మిగతా వాళ్ళతో పోలిస్తే దేబ్జానీ బెటర్.
ఇక చివర్లో షాలిని నిన్న వుమెన్ కార్డు వాడింది. షాలిని మొదట్నుంచి ఓవర్ యాక్షన్ చేస్తూ, రోహిత్ ని అంటిపెట్టుకొని, రోహిత్ సపోర్ట్ తో ఆడుతున్న సంగతి తెలిసిందే. నిన్న బిగ్ బాస్ షాలినిని, రోహిత్ ని వేరే వేరే టీమ్స్ లో వేసాడు. అయినా రోహిత్ తోనే తిరగడానికి ప్రయత్నించింది. అపూర్వ వచ్చిన దగ్గర్నుంచి షాలిని భయంతో ఉంది. నిన్న అపూర్వతో గొడవ పడింది. అయితే నిన్నటి ఓ టాస్క్ లో షాలిని దొంగతనం చేసిందని భావించి అపూర్వ తన టీమ్ ని పిలవడంతో అందరూ షాలినిపై పడ్డారు. ఎప్పట్లాగే రోహిత్ వేరే టీమ్ లో ఉన్నా షాలిని ని కాపాడే ప్రయత్నం చేసాడు. ఈ గొడవ అంతా అయ్యాక షాలిని ఆడపిల్లని అని చూడకుండా, ఒక్కదాన్నే ఉన్నాను అని చూడకుండా వచ్చారు అని కామెంట్స్ చేసింది. దెబ్బలు తగిలాయని, ఆడపిల్లలతో ఎలా ఉండాలో తెలియదా అన్నట్టు కామెంట్స్ చేసి ఏడ్చింది.
ఇక ఇలాంటి వుమెన్ కార్డు వాడేవాళ్ళకు సపోర్ట్ ఇస్తే తనకు ఫాలోయింగ్ పెరుగుతుందో అనుకున్నాడో లేక వేరే టీమ్ అయినా తన అగ్నిపరీక్ష బ్యాచ్ షాలిని సపోర్ట్ చేద్దాం అనుకున్నాడో కానీ రోహిత్ షాలిని అమ్మాయి, లేడీస్ పట్టుకోవాలి, అబ్బాయిలు దూరంగా జరగండి అంటూ అతను కూడా షాలిని సపోర్ట్ గా వుమెన్ కార్డు వాడాడు.
అసలు ఎప్పుడూ లేని విధంగా ఈ సారి బిగ్ బాస్ లో వుమెన్ కార్డు వాడటం అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. అది కూడా గేమ్ సరిగ్గా ఆడలేనప్పుడో, ఓడిపోతున్నప్పుడో, అవతలి వాళ్ళతో ఫైట్ చేయలేనప్పుడో, వాళ్ళ దగ్గర కరెక్ట్ పాయింట్స్ లేనప్పుడో, వాళ్ళు నెగిటివ్ అవుతున్నప్పుడో నేను అమ్మాయిని, అమ్మాయిలతో అలాగేనా బిహేవ్ చేసేది అని కామెంట్స్ చేస్తూ వుమెన్ కార్డు ని ముందు పెట్టడం గమనార్హం. ఈ విషయంలో జెండర్ లేదు బిగ్ బాస్ లో ఎవరైనా ఒకటే అని నాగార్జున చెప్పినా మారట్లేదు. ఫిజికల్ టాస్కులు ఉంటాయి అని తెలిసి, ఆడలేనప్పుడు ఎందుకు రావడం అని విమర్శలు వస్తున్నాయి.
