Apple iPhone 14 Plus : రూ.50వేల లోపు ధరకే ఐఫోన్ 14 ప్లస్ సొంతం చేసుకోండి.. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ డీల్ పొందాలంటే?

Apple iPhone 14 Plus : ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 14 ప్లస్‌పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో రూ. 50వేల లోపు ధరకే సొంతం చేసుకోవచ్చు. అంటే.. కేవలం రూ.44,297కే కొనుగోలు చేయవచ్చు.

Apple iPhone 14 Plus : మీరు ఐఫోన్‌ని కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారా? ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డీల్స్ అందిస్తోంది. ఆపిల్ ఐఫోన్ 14 ప్లస్ భారీ తగ్గింపు ధరకు విక్రయిస్తోంది. భారీ స్క్రీన్‌తో ఐఫోన్‌ను కోరుకునే కొనుగోలుదారులకు ఐఫోన్ 14 ప్లస్ సరైన ఫోన్. పెద్ద స్క్రీన్‌ ప్రో మోడల్‌ల కన్నా ఎక్కువ ధర ఉండదు. ఐఫోన్ 14 ప్లస్‌లో 6.7-అంగుళాల డిస్‌ప్లే, A15 బయోనిక్ చిప్‌సెట్, మరిన్ని ఫీచర్లు ఉన్నాయి.

Read Also : iPhone 17 Launch : అద్భుతమైన డిస్‌ప్లేతో ఆపిల్ ఐఫోన్ 17 మోడల్ వచ్చేస్తోంది.. అచ్చం శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా మాదిరిగానే..!

ఐఫోన్ 14 ప్లస్‌లో డీల్ పొందాలంటే? :
ఆపిల్ ఐఫోన్ 14 ప్లస్ అసలు ధర రూ. 79,900 ఉండగా.. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో భారీ తగ్గింపు ధరతో అందుబాటులో ఉంది. 16 శాతం తగ్గింపుతో ప్రస్తుతం ఈ ఐఫోన్ 14 ప్లస్ ధర రూ. 66,999కు సొంతం చేసుకోవచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ ద్వారా మరింత తగ్గింపు పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో పాత ఐఫోన్ 13 లేదా మంచి కండిషన్‌లో ఉన్న ఐఫోన్ 13 మినిపై ట్రేడింగ్ చేసే కస్టమర్‌లకు రూ. 23వేల వరకు తగ్గింపును అందిస్తోంది. ఈ డీల్ ద్వారా ఐఫోన్ 14 ప్లస్‌ను కేవలం రూ. 44,297కి కొనుగోలు చేయవచ్చు. ఈ ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో కొనుగోలుదారులు రూ. 35,603 ఆదా చేసుకోవచ్చు.

ఐఫోన్ 14 ప్లస్ స్పెసిఫికేషన్‌లు :
ఆపిల్ ఐఫోన్ 14 ప్లస్ మోడల్ అద్భుతమైన డిజైన్ కలిగి ఉంది. ఫ్రంట్ గ్లాస్ డిజైన్, బ్యాక్ అల్యూమినియం ఫ్రేమ్‌తో వస్తుంది. స్టార్‌లైట్, మిడ్‌నైట్, బ్లూ, పర్పుల్, ప్రొడక్ట్ రెడ్ వంటి కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఈ డివైజ్ 6.7 అంగుళాలలో సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ సిరామిక్ షీల్డ్ గ్లాస్, ప్రొటెక్షన్ అందిస్తుంది.

హుడ్ కింద, ఐఫోన్ 14 ప్లస్ 5ఎన్ఎమ్ ప్రాసెస్‌పై ఆపిల్ A15 బయోనిక్ చిప్‌సెట్‌తో పాటు హెక్సా-కోర్ సీపీయూ, 5-కోర్ గ్రాఫిక్‌లతో కూడిన ఆపిల్ జీపీయూతో పాటు వేగవంతమైన పర్ఫార్మెన్స్ అందిస్తుంది. 6జీబీ ర్యామ్, 128జీబీ, 256జీబీ, 512జీబీ వేరియంట్‌ల ఇంటర్నల్ స్టోరేజీ ఆప్షన్లను అందిస్తుంది.

ఫోటోగ్రఫీ విషయానికి వస్తే.. ఈ ఫోన్ మల్టీఫేస్ కెమెరా సిస్టమ్ కలిగి ఉంది. ప్రైమరీ కెమెరా సెటప్‌లో డ్యూయల్ 12ఎంపీ లెన్స్‌లు ఉంటాయి. ఇందులో సెన్సార్-షిఫ్ట్ ఓఐఎస్‌తో కూడిన వైడ్ లెన్స్ అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. అదనపు ఫీచర్లలో డ్యూయల్-ఎల్ఈడీ డ్యూయల్-టోన్ ఫ్లాష్, హెచ్‌డీఆర్, 4కె వీడియో రికార్డింగ్ ఆప్షన్లను అందిస్తుంది.

సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం హెచ్‌డీఆర్ 4కె, వీడియో రికార్డింగ్ సపోర్ట్‌తో 12ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంది. ఐఫోన్ 14 ప్లస్ ఫోన్ 4352ఎంఎహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. పీడీ2.0 15డబ్ల్యూ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. వై-ఫై హాట్‌స్పాట్ కనెక్టివిటీ ఆప్షన్లను అందిస్తుంది. ఆపిల్ పే సర్టిఫికేషన్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Read Also : iPhone 15 Pro : అమెజాన్‌లో ఆపిల్ ఐఫోన్ 15ప్రోపై భారీ డిస్కౌంట్.. ఈ డీల్ ఎలా పొందాలంటే?

ట్రెండింగ్ వార్తలు