Wet iPhone Rice : మీ ఐఫోన్ నీళ్లలో తడిసిందా? ఆరబెట్టేందుకు బియ్యంలో వేయవద్దు? యూజర్లకు ఆపిల్ హెచ్చరిక? ఎందుకంటే?

Wet iPhone Rice Method : నీళ్లలో తడిసిన ఐఫోన్లను ఆరబెట్టేందుకు వినియోగదారులు బియ్యంలో పెట్టే విధానాన్ని ఆపిల్ కొట్టిపారేసింది. ఇలాంటి పాత పద్ధతిని వాడొద్దని హెచ్చరించింది. కంపెనీ సపోర్ట్ సైట్‌లో డివైజ్‌కు జరిగే నష్టాన్ని పేర్కొంటూ మరిన్ని సూచనలు చేసింది.

Do Not Put Your Wet iPhone In Rice, Here's Apple Said In New Advisory To Users

Wet iPhone Rice Method : ప్రస్తుత రోజుల్లో స్మార్ట్‌ఫోన్ లేని ప్రపంచాన్ని ఊహించుకోవడం కష్టమే. దశాబ్దానికి పైగా స్మార్ట్‌ఫోన్‌లు మన దైనందిన జీవితంలో భాగమైపోయాయి. అయితే, కొన్నిసార్లు అనుకోని ప్రమాదాల్లో చేతిలో ఐఫోన్లు లేదా ఇతర స్మార్ట్‌ఫోన్లు నీటిలో జారిపడుతుంటాయి. ఇలాంటి ఘటనలు ప్రతిఒక్కరి జీవితంలో సర్వసాధారణం కూడా. అది స్విమ్మింగ్ ఫూల్ కావొచ్చు.. సింక్ లేదా టాయిలెట్ ఏదైనా కావచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది వెంటనే తమ ఫోన్ నీళ్లలో నుంచి బయటకు తీసి ఆరబెట్టేందుకు ప్రయత్నిస్తుంటారు.

Read Also : OnePlus Watch 2 Launch Date : కొత్త స్మార్ట్‌వాచ్ కావాలా? ఈ నెల 26న వన్‌ప్లస్ వాచ్ 2 సిరీస్ వచ్చేస్తోంది.. కేవలం రూ.99కే బుకింగ్ ఆఫర్

ఈ పాత పద్ధతిని పక్కన పెట్టేయండి : సాంకేతిక నిపుణులు
అంతేకాదు.. పాత పద్ధతిలో బియ్యంలో తడి ఫోన్ పెట్టేస్తారు. ఇలా చేస్తే.. ఆ ఫోన్‌లోని నీటి తేమ మొత్తాన్ని బియ్యం పీల్చేస్తుందని భావిస్తారు. ఆ తర్వాత ఫోన్ ఎప్పటిలానే పనిచేస్తుందని బలంగా నమ్ముతారు. ఈ పద్ధతి స్మార్ట్‌ఫోన్ వినియోగదారులలో విస్తృతంగా ప్రచారంలో ఉంది. అయితే, సాంకేతిక నిపుణులు దీనిని పాత పద్ధతిగా కొట్టిపారేశారు. దీనివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని అంటున్నారు. అలా అని, పొడిబట్టతో ఫోన్ మొత్తాన్ని తుడిచి ఆపై వెంటనే ఛార్జింగ్ పెట్డడం కూడా చాలా ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. ఇంతకీ ఏం చేయాలంటారా? మీ ప్రశ్నలన్నింటికి ఆపిల్ సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం.

వినియోగదారులకు ఆపిల్ హెచ్చరిక :
ప్రసిద్ధ టెక్ దిగ్గజం ఆపిల్ ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఏం చేయాలో కంపెనీ తన సపోర్టు పేజీలో అనేక సూచనలు చేసింది. ప్రత్యేకించి ఐఫోన్లు నీళ్లలో పడినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వినియోగదారులకు కొన్ని హెచ్చరికలు చేసింది. తడి ఐఫోన్‌ను బియ్యంలో పెట్టడమనేది డివైజ్‌కు హాని కలిగిస్తుందని హెచ్చరించింది. ఆపిల్ అప్‌డేట్ చేసిన సపోర్ట్ సైట్ ప్రకారం.. బియ్యం బ్యాగ్‌లో తడి ఐఫోన్‌ను ఉంచడం ఫోన్‌కు మంచిది కాదు.

Apple New Advisory To Users

దీని వెనుక అసలు కారణం ఇదే :
చిన్నపాటి బియ్యం కణాలు ఐఫోన్‌ డివైజ్‌లోకి చొచ్చుకుపోయి డివైజ్ పాడైపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే, ఐఫోన్‌లు నీటిలో తడిసినప్పుడు వినియోగదారులను అప్రమత్తం చేసేందుకు ఆపిల్ కొత్త లిక్విడ్ డిటెక్షన్ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఐఫోన్లలో ఏదైనా కారణం చేత నీటి తేమ చేరినప్పుడు డివైజ్‌కు ఎలాంటి నష్టం జరగకుండా ప్రొటెక్ట్ చేసేందుకు ఈ ఫీచర్ యాక్టివేట్ అవుతుంది. వెంటనే వినియోగదారులను ఇంకా తేమ ఉందని అలర్ట్ చేస్తుంది. మీ ఐఫోన్ లిక్విడ్-డిటెక్షన్ అలర్ట్ వస్తే.. ఏమి చేయాలో ఆపిల్ స్పష్టమైన సూచనలను అందిస్తోంది.

మీ ఐఫోన్ తడిగా ఉందా? ఆపిల్ అందించే సూచనలివే :

  • మీ ఐఫోన్ పవర్ అడాప్టర్ లేదా యాక్సెసరీస్ నుంచి లైటనింగ్ లేదా USB-C కేబుల్‌ను వెంటనే డిస్‌కనెక్ట్ చేయండి.
  • ఐఫోన్ కేబుల్ రెండూ పూర్తిగా తడి ఆరిపోయే వరకు కేబుల్‌ను మళ్లీ కనెక్ట్ చేయకుండా ఉండండి.
  • ఫోన్‌లో నిలిచిన అదనపు ద్రవాన్ని తొలగించేందుకు కనెక్టర్ కిందికి ఉండేలా మీ చేతితో దాన్ని మెల్లగా నొక్కండి.
  • ఎండబెట్టేందుకు మీ ఐఫోన్‌ను తగినంత గాలి తగిలేలా పొడి ప్రదేశంలో ఉంచండి.
  • మీ ఐఫోన్ మళ్లీ ఛార్జ్ చేయడానికి ముందు కనీసం 30 నిమిషాలు వేచి ఉండండి.
  • ఆ తర్వాత, లైటనింగ్ లేదా USB-C కేబుల్‌తో ఛార్జ్ చేయడానికి ప్రయత్నించండి.
  • లిక్విడ్-డిటెక్షన్ అలర్ట్ అలానే కొనసాగితే.. మీ ఐఫోన్‌ను గాలితో కూడిన పొడి ప్రదేశంలో అలానే ఉంచండి.
  • ఇది పూర్తిగా ఆరబెట్టడానికి 24 గంటల సమయం పట్టవచ్చని ఆపిల్ చెబుతోంది.
  • ఆ తర్వాత మాత్రమే మీరు ఐఫోన్ మళ్లీ ఛార్జ్ చేయడానికి ప్రయత్నించాలి.

ఐఫోన్ తడిగా ఉన్నప్పుడు చేయకూడని పనులివే :
వినియోగదారులు తమ ఐఫోన్‌లను ఎక్స్‌టర్నల్ హీట్ సోర్స్ లేదా కంప్రెస్డ్ ఎయిర్ ఉపయోగించి డ్రై చేయకూడదని ఆపిల్ చెబుతోంది. కనెక్టర్‌లోకి కాటన్ లేదా పేపర్ టవల్ వంటి వస్తువును చొప్పించడం కూడా మంచిది కాదు. పైన చెప్పినట్లుగా, మీ ఐఫోన్‌ను బియ్యం సంచిలో ఉంచవద్దు. అలా చేయడం వలన బియ్యం చిన్న రేణువులు మీ ఐఫోన్‌కు హాని కలిగించవచ్చు. మీ ఐఫోన్‌కు నష్టం జరగకుండా నిరోధించడానికి ఆపిల్ సూచించిన ఈ మార్గదర్శకాలను కచ్చితంగా అనుసరించడం చాలా అవసరమని గమనించాలి.

Read Also : iVoomi e-scooters : ఇప్పుడే కొనేసుకోండి.. ఐవూమీ ఇ-స్కూటర్లపై రూ.10వేల వరకు డిస్కౌంట్లు.. ఏ మోడల్ ధర ఎంతంటే?

ట్రెండింగ్ వార్తలు