Google Accounts Delete : డిసెంబర్ 1 నుంచి గూగుల్ ఇలాంటి అకౌంట్లను డిలీట్ చేస్తుంది.. పూర్తి వివరాలివే!

Gmail Accounts Delete : డిసెంబర్ 1 నుంచి గూగుల్ కొన్ని జీమెయిల్ అకౌంట్లను డిలీట్ చేస్తుంది. మీ జీమెయిల్ అకౌంట్ కూడా డిలీట్ కాకుండా ఉండాలంటే వెంటనే ఇలా చేయండి. లేదంటే మీ జీమెయిల్ మొత్తం డేటా డిలీట్ కావచ్చు.

Google Accounts Delete : మీకు జీమెయిల్ అకౌంట్ ఉందా? ఒకటి కన్నా ఎక్కువ జీమెయిల్ అకౌంట్లను కలిగి ఉంటే ఓసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే.. ఇలాంటి కొన్ని జీమెయిల్ అకౌంట్లను గూగుల్ డిలీట్ చేస్తోంది. అంటే.. శుక్రవారం (డిసెంబర్ 1) నుంచి కనీసం రెండేళ్లపాటు ఇన్‌యాక్టివ్‌గా ఉన్న గూగుల్ అకౌంట్లను తొలగించే ప్రణాళికతో గూగుల్ ముందుకు సాగుతోంది.

ఈ పాలసీని కంపెనీ ఈ ఏడాది మేలో ప్రకటించింది. అంతర్గత పరిశోధనలు, పాత అకౌంట్లను రీసైకిల్ చేసిన పాస్‌వర్డ్‌లపై ఎక్కువగా ఆధారపడతాయని, టూ-ఫ్యాక్టర్డ్ వెరిఫికేషన్ వంటి లేటెస్ట్ భద్రతా చర్యలను ఉపయోగించుకునే అవకాశం తక్కువగా ఉందని సూచిస్తుంది.

తద్వారా ఫిషింగ్, హ్యాకింగ్, స్పామ్ వంటి సమస్యలకు మరింత హాని కలిగిస్తాయని చెబుతోంది. గూగుల్ అకౌంట్లలో జీమెయిల్ నుంచి డాక్స్, డ్రైవ్, ఫొటోల వరకు ప్రతిదీ ఉంటాయని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇన్‌యాక్టివ్ గూగుల్ అకౌంట్లోని మొత్తం కంటెంట్ డిలీట్ చేస్తుంది.

గూగుల్ అకౌంట్లను ఎందుకు తొలగిస్తోందంటే? :
ఈ ఏడాది ప్రారంభంలో గూగుల్ తన అకౌంట్ పాలసీని అప్‌డేట్ చేసింది. దీని ద్వారా ఇన్‌యాక్టివ్ అకౌంట్లను తొలగిస్తామని పేర్కొంది.

Read Also : Gmail Bulk Messages : మీ జీమెయిల్ స్టోరేజీ ఫుల్ అయిందా? సింగిల్ క్లిక్‌తో బల్క్ మెసేజ్‌లన్నీ డిలీట్ చేసుకోవచ్చు..!

ఇన్‌యాక్టివ్ అకౌంట్లను గూగుల్ ఎప్పుటినుంచి డిలీట్ చేస్తుందంటే? :
గూగుల్ అప్‌డేట్ చేసిన అకౌంట్ పాలసీ ఇప్పటికే అమలులో ఉంది. అయితే, అకౌంట్ల తొలగింపు అనేది డిసెంబర్ 1 నుంచి ప్రారంభమవుతుంది.

ఏయే గూగుల్ అకౌంట్లు ప్రభావితమవుతాయి? :
అధికారిక ఇన్‌యాక్టివ్ అకౌంట్ పాలసీ సపోర్టు పేజీ ప్రకారం.. పర్సనల్ గూగుల్ అకౌంట్లు మాత్రమే దీని ద్వారా ప్రభావితమవుతాయి. మీ ఆఫీసు, స్కూల్ లేదా ఇతర సంస్థ ద్వారా మీకోసం సెటప్ చేసిన గూగుల్ అకౌంట్లకు ఈ విధానం వర్తించదని గమనించాలి.

అకౌంటుతో పాటు గూగుల్ ఏమి తొలగిస్తుంది? :
గూగుల్ అకౌంట్లలో వర్క్‌స్పేస్ (జీమెయిల్, డాక్స్, డ్రైవ్, మీట్, క్యాలెండర్), గూగుల్ ఫొటోలలో విస్తరించి ఉన్న అకౌంట్, అనుబంధిత డేటా రెండింటినీ డిలీట్ చేయనుంది.

గూగుల్ అకౌంట్ డిలీట్ అవుతుందో లేదో ఎలా తెలుస్తుంది? :
గూగుల్ అకౌంట్ తొలగింపు ప్రక్రియ ప్రారంభమయ్యే ముందు వినియోగదారులకు నోటిఫికేషన్‌లను పంపుతుంది. ఇలా దశలవారీగా గూగుల్ యూజర్లను అప్రమత్తం చేస్తోంది. అకౌంట్, ఇమెయిల్ అడ్రస్ ఇచ్చినట్టయితే రీకవరీ ఇమెయిల్ రెండింటినీ చేరుకోవడానికి అనేక నోటిఫికేషన్‌లు నెలల తరబడి పంపుతూనే ఉంటుంది.

గూగుల్ అకౌంట్ ఇన్‌యాక్టివ్ ఎలా నిర్ధారిస్తుంది? :
రెండు సంవత్సరాలకు పైగా అకౌంట్లలో ఎలాంటి యాక్టివిటీ లేకుంటే గూగుల్ ఆయా అకౌంట్లను ఇన్‌యాక్టివ్‌గా పరిగణిస్తుంది.

తొలగింపు నుంచి మీ అకౌంట్ ఎలా సేవ్ చేయాలంటే? :
తొలగింపు నుంచి మీ గూగుల్ అకౌంట్‌ను సేవ్ చేయడానికి.. మీరు చేయాల్సిందల్లా, మీ గూగుల్ అకౌంట్‌కు లేదా ఏదైనా గూగుల్ సర్వీసుకు కనీసం ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారైనా సైన్‌ఇన్ లాగిన్ అవ్వండి. అందులో అకౌంట్లకు వచ్చిన ఇమెయిల్స్ రీడ్ చేయడం లేదా వీడియోను చూడటం లేదా ఏదైనా సెర్చ్ చేయండి.

Google deleting Google accounts 

అకౌంట్ తొలగింపు విధానానికి మినహాయింపులివే :
పైన పేర్కొన్న సాధారణ కార్యకలాపాలే కాకుండా.. గూగుల్ అకౌంట్ యాక్టివ్‌గా పరిగణించే ఇతర కార్యకలాపాలను కూడా జాబితా చేసింది. మీ గూగుల్ అకౌంట్ ప్రస్తుత లేదా కొనసాగుతున్న గూగుల్ ప్రొడక్టు, యాప్, సర్వీసు లేదా సభ్యత్వాన్ని కలిగి ఉండాలి.

మీ గూగుల్ అకౌంట్ గూగుల్ ప్లే స్టోర్‌లో కొనసాగుతున్న సబ్‌స్క్రిప్షన్‌లు లేదా యాక్టివ్ ఆర్థిక లావాదేవీలను కలిగిన పబ్లిష్ చేసిన అప్లికేషన్ లేదా గేమ్‌తో లింక్ అయి ఉంటే, అది ఈ కేటగిరీలోకి వస్తుంది. అంతేకాకుండా, మీ అకౌంట్ ఫ్యామిలీ లింక్ ద్వారా యాక్టివ్ మైనర్ అకౌంట్ పర్యవేక్షిస్తే లేదా పుస్తకాలు లేదా మూవీలు వంటి డిజిటల్ ప్రొడక్టులను సేకరించేందుకు ఉపయోగించి ఉంటే.. ఈ షరతులు వర్తిస్తాయి.

పాత ఇన్‌యాక్టివ్ అకౌంట్ పాలసీ ఏంటి? :
2020లో గూగుల్ పాలసీ విధానంలో అకౌంట్లను తొలగించకుండా, ఉపయోగించని అకౌంట్ల నుంచి కంటెంట్‌ను తొలగించాలని నిర్దేశించింది. అకౌంట్లను డిలీట్ చేసేందుకు తీసుకొచ్చిన కొత్త పాలసీ పాత పాలసీ కన్నామరింత కఠినమైన పాలసీని సూచిస్తుంది.

Read Also : WhatsApp Secret Code : వాట్సాప్‌లో లాక్ చాట్స్ కోసం సీక్రెట్ కోడ్ ఫీచర్.. ఇదేలా పనిచేస్తుందంటే?

ట్రెండింగ్ వార్తలు