Infinix 40 Pro 5G Launch : ఈ నెల 12న భారత్‌కు ఇన్ఫినిక్స్ 40 ప్రో 5జీ ఫోన్ వచ్చేస్తోంది.. ఏయే ఫీచర్లు, ధర ఎంత ఉండొచ్చుంటే?

Infinix Infinix 40 Pro 5G : ఇన్ఫినిక్స్ 40 ప్రో 5జీ ఫోన్ ఏప్రిల్ 12న భారత మార్కెట్లో లాంచ్ కానుంది. ఈ ఫోన్ ధర, స్పెసిఫికేషన్‌ల వివరాలు ఇలా ఉన్నాయి.

Infinix Infinix 40 Pro 5G : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ మేకర్ ఇన్ఫినిక్స్ భారత మార్కెట్లో కొత్త ఫోన్‌ ఇన్ఫినిక్స్ 40 ప్రో 5జీ ఫోన్ లాంచ్ చేసేందుకు రెడీగా ఉంది. కంపెనీ ప్రకారం.. ఈ 5జీ ఫోన్ ఏప్రిల్ 12న భారతీయ మార్కెట్లోకి రానుంది. ఇన్ఫినిక్స్ కొత్త ఫోన్ కంపెనీ యాజమాన్య చిప్‌సెట్, చీతా ఎక్స్1 చిప్‌ను కలిగిన మొదటి ఫోన్. ఈ కొత్త చిప్‌సెట్ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ లైఫ్ కలిగి ఉంటుందని కంపెనీ తెలిపింది. ఇన్ఫినిక్స్ 40ప్రో 5జీ ఫోన్ స్పెసిఫికేషన్‌లను వివరంగా పరిశీలిద్దాం.

Read Also : Ather Rizta Scooter : టీవీఎస్, ఓలా, బజాజ్, హీరోకు పోటీగా.. సరసమైన ధరకే కొత్త ఏథర్ రిజ్టా ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్.. 160కి.మీ రేంజ్..!

ఈ కొత్త చిప్‌సెట్ బ్యాటరీ లైఫ్‌తో వేగంగా ఛార్జింగ్ చేస్తుంది. ఈ ఫోన్ మ్యూటీ-మోడ్ ఫాస్ట్‌ఛార్జ్, లో-టెంప్, హైపర్, స్మార్ట్ ఛార్జింగ్ మోడ్‌లతో సహా కొన్ని కొత్త ఫీచర్లతో వస్తుంది. హైపర్ ఛార్జ్‌తో, నోట్ 40 ప్రో+ యూజర్లు కేవలం 8 నిమిషాల్లో 50 శాతం ఛార్జ్ చేయొచ్చు.

స్పెషిఫికేషన్లు, ఫీచర్లు (అంచనా) : 
ఇన్ఫినిక్స్ నోట్ 40 ప్రో ఫోన్ 45డబ్ల్యూ ఛార్జింగ్‌తో 5,000ఎంఎహెచ్ బ్యాటరీతో వస్తుంది. అయితే నోట్ 40 ప్రో ప్లస్ 100డబ్ల్యూ ఛార్జింగ్ సామర్థ్యంతో 4,600ఎంఎహెచ్ బ్యాటరీతో రానుంది. అదనంగా, రెండు మోడల్‌లు 20డబ్ల్యూ వైర్‌లెస్ మ్యాగ్‌ఛార్జ్ సపోర్టు ఇస్తాయి. డిజైన్ పరంగా.. ఈ సిరీస్ అద్భుతమైన 3డీ 6.78-అంగుళాల కర్వ్డ్ అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉండనుంది. 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 1500హెచ్‌జెడ్ ఇన్‌స్టంట్ టచ్ శాంప్లింగ్ రేట్‌తో, డిస్‌ప్లే పవర్‌ఫుల్ కలర్ ఆప్షన్లు, వ్యూ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది.

ఇన్ఫినిక్స్ నోట్ 40 సిరీస్ ప్రీమియం డిజైన్‌తో వస్తుంది. ప్రత్యేకమైన 55-డిగ్రీల గోల్డెన్ కర్వేచర్‌తో పాటు ప్రీమియం వేగన్ లెదర్, గ్లాస్ ఫినిషింగ్‌తో మెటల్ ఎక్స్‌టీరియర్‌ను కలిగి ఉంది. ఈ సిరీస్ స్టైల్, మన్నికను అందిస్తుంది. కార్నింగ్ గ్లాస్ ప్రొటెక్షన్ కలిగి ఉంది. మొత్తం వింటేజ్ గ్రీన్, టైటాన్ గోల్డ్ అనే రెండు కలర్ వేరియంట్‌లలో వస్తుంది. ఇన్ఫినిక్స్ నోట్ 40 సిరీస్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో గేమ్-ఛేంజర్‌గా మారింది.

Read Also : Best Premium Flagship Phones : ఈ ఏప్రిల్‌లో భారత్‌‌లో కొనుగోలు చేయగల బెస్ట్ ప్రీమియం ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్లు ఇవే!

ట్రెండింగ్ వార్తలు