Infinix Hot 40i Launch : ఇన్ఫినిక్స్ హాట్ 40ఐ ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే కీలక ఫీచర్లు లీక్, ధర ఎంత ఉండొచ్చుంటే?

Infinix Hot 40i Launch : భారత మార్కెట్లోకి ఇన్ఫినిక్స్ నుంచి కొత్త ఇన్ఫినిక్స్ హాట్ 40ఐ ఫోన్ వచ్చేస్తోంది. ఈ కొత్త ఫోన్ లాంచ్ కావడానికి ముందుగానే కీలక ఫీచర్లు లీక్ అయ్యాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Infinix Hot 40i Price, India Launch Details Leaked

Infinix Hot 40i Launch : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఇన్ఫినిక్స్ నుంచి భారత మార్కెట్లోకి ఇన్ఫినిక్స్ హాట్ 40ఐ ఫోన్ లాంచ్ కానుంది. ఈ ఫోన్ లాంచ్‌‌ గురించి కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే, దేశంలో ఈ కొత్త హ్యాండ్‌సెట్ లాంచ్ టైమ్‌లైన్‌ను సూచిస్తుంది.

Read Also : Apple CEO Tim Cook : భారత్‌లో రికార్డు స్థాయిలో ఐఫోన్ విక్రయాలు.. ఫస్ట్ టైమ్ శాంసంగ్‌‌ను అధిగమించిన ఆపిల్

ఈ మోడల్ నవంబర్ 2023లో సౌదీ అరేబియాలో ఆవిష్కరించింది. ప్రస్తుతం ఎంపిక చేసిన గ్లోబల్ మార్కెట్‌లలో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ భారతీయ వేరియంట్ గ్లోబల్ వెర్షన్‌కు సమానమైన స్పెసిఫికేషన్‌లను కలిగి ఉండనుంది. అంతేకాదు.. ర్యామ్, స్టోరేజ్ వేరియంట్‌లతో పాటు దేశంలో స్మార్ట్‌ఫోన్ ధర పరిధిపై కూడా అనేక అంచనాలు నెలకొన్నాయి.

ఈ నెలాఖరులో లాంచ్ అయ్యే ఛాన్స్ :
ఇన్పినిక్స్ హాట్ 40ఐ మోడల్ ఫిబ్రవరి నెలాఖరులో భారత మార్కెట్లో లాంచ్ అవుతుందని నివేదిక పేర్కొంది. ఫ్లిప్‌కార్ట్ ద్వారా దేశంలో కొనుగోలుకు ఫోన్ అందుబాటులో ఉంటుందని నివేదిక సూచిస్తోంది. ఈ మోడల్ 8జీబీ+ 128జీబీ, 8జీబీ+ 256జీబీ వేరియంట్‌లలో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. రెండోది దేశంలోనే చౌకైన 256జీబీ స్మార్ట్‌ఫోన్‌గా చెప్పవచ్చు. అదనపు 8జీబీ వరకు వర్చువల్ ర్యామ్ పొడిగింపునకు సపోర్టు ఇస్తుందని నివేదిక తెలిపింది.

Infinix Hot 40i Price 

రూ. 16వేల కన్నా తక్కువ ధర ఉండొచ్చు :
ఇన్ఫినిక్స్ హాట్ 40ఐ గ్లోబల్ వేరియంట్ ఎంపిక చేసిన మార్కెట్లలో అందుబాటులో ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ల ధర ప్రాంతాల వారీగా మారినప్పటికీ, లైనప్ 200 డాలర్లు (దాదాపు రూ. 16వేల) కన్నా తక్కువగా ఉంటుంది. ఈ మోడల్ హారిజన్ గోల్డ్, పామ్ బ్లూ, స్టార్‌లిట్ బ్లాక్, స్టార్‌ఫాల్ గ్రీన్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటుంది. ఇన్ఫినిక్స్ హాట్ 40ఐ గ్లోబల్ వేరియంట్ 90హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 6.56-అంగుళాల హెచ్‌డీ ప్లస్ (720 X 1,612) డిస్‌ప్లే, 480నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది.

మీడియాటెక్ హెలియో జీ88 ఎస్ఓసీ ద్వారా 8జీబీ వరకు ర్యామ్ 256జీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజీతో వస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 13 అవుట్-ఆఫ్-ది-బాక్స్ రన్ అవుతుంది. కెమెరా డిపార్ట్‌మెంట్‌లో ఇన్ఫినిక్స్ హాట్ 40ఐ ఫోన్ 50ఎంపీ ప్రైమరీ సెన్సార్, బ్యాక్ సైడ్ రింగ్ ఎల్ఈడీ ఫ్లాష్‌లైట్‌తో పాటు ఏఐ-బ్యాక్డ్ సెకండరీ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32ఎంపీ సెన్సార్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ 18డబ్ల్యూ వైర్డు ఛార్జింగ్‌కు సపోర్టుతో 5,000ఎంఎహెచ్ బ్యాటరీతో సపోర్టు ఇస్తుంది.

Read Also : Apple AirPods Discount : అత్యంత సరసమైన ధరకే ఆపిల్ ఎయిర్‌ప్యాడ్స్.. ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు!

ట్రెండింగ్ వార్తలు