iPhone 16 Pro Display : ఆపిల్ ఐఫోన్ 15 ప్రోతో పోలిస్తే.. రాబోయే ఐఫోన్ 16 ప్రోలో 20శాతం బ్రైట్‌నెస్ డిస్‌ప్లే.. కొత్త క్యాప్చర్ బటన్..!

iPhone 16 Pro Display : ఐఫోన్ 15 ప్రో మోడల్స్‌పై 1,000 నిట్స్ పరిమితి కన్నా 20 శాతం పెరుగుదల ఉండనుంది. హెచ్‌డీఆర్ కంటెంట్ గరిష్ట ప్రకాశంతో 1,600 నిట్‌లుగా ఉంటుందని టిప్‌స్టర్ తెలిపింది.

iPhone 16 Pro Display : ప్రముఖ ఐటీ దిగ్గజం ఆపిల్ సొంత బ్రాండ్ ఐఫోన్ 15 ప్రో మోడల్‌కు అప్‌గ్రేడ్‌ వెర్షన్‌గా ఐఫోన్ 16 ప్రో వచ్చేస్తోంది. నివేదికల ప్రకారం.. ఈ ఏడాది చివరిలో ఐఫోన్ 16 ప్రో సిరీస్ రానుంది. కంపెనీ నెక్స్ట్ జనరేషన్ స్మార్ట్‌ఫోన్‌లు అప్‌గ్రేడ్ చేసిన డిస్‌ప్లేను కలిగి ఉండవచ్చని నివేదిక వెల్లడించింది.

Read Also : iPhone 16 Series Leak : ఆపిల్ ఐఫోన్ 16 సిరీస్ వచ్చేస్తోంది.. ధర, డిజైన్, డిస్‌ప్లే, బ్యాటరీ వివరాలు లీక్..!

ఆపిల్ ప్రో హ్యాండ్‌సెట్‌లు 1,000 నిట్‌ల వరకు బ్రైట్‌నెస్ పెంచగలవు. ఐఫోన్ 16 ప్రో మోడల్‌లు కొంచెం భారీ ప్యానెల్‌లతో పాటు ప్రామాణిక డైనమిక్ రేంజ్ (SDR) కంటెంట్‌కు 20 శాతం బ్రైట్‌నెస్‌ను అందించగలవు. రాబోయే ఐఫోన్ స్మార్ట్‌ఫోన్‌లు ఈ ఏడాది చివరిలో అప్‌గ్రేడ్ చేసిన చిప్, కొత్త ‘క్యాప్చర్’ బటన్‌తో కూడా వస్తాయని టిప్‌స్టర్ పేర్కొంది.

డిస్‌ప్లే బ్రైట్‌నెస్.. ప్యానెల్ సైజు పెంపు? :
ఇన్‌స్టంట్ డిజిటల్ వెయిబో పోస్ట్‌లో ఐఫోన్ 16 ప్రో హ్యాండ్‌సెట్ ఎస్‌డీఆర్ కంటెంట్‌ను 1,200 నిట్‌ల వరకు సాధారణ బ్రైట్‌నెస్‌కు సపోర్టు ఇస్తుందని తెలిపింది. ఐఫోన్ 15 ప్రో మోడల్స్‌పై 1,000 నిట్స్ పరిమితి కన్నా 20 శాతం పెరుగుదల ఉండనుంది. హెచ్‌డీఆర్ కంటెంట్ గరిష్ట ప్రకాశంతో 1,600 నిట్‌లుగా ఉంటుందని టిప్‌స్టర్ తెలిపింది.

ఐఫోన్ 16 ప్రో మోడళ్లలో డిస్‌ప్లే సంబంధిత మార్పు బ్రైట్‌నెస్ పెరగడం మాత్రమే కాదు.. ఆపిల్ రెండు ప్రో హ్యాండ్‌సెట్‌లలో డిస్‌ప్లే ప్యానెల్‌ల సైజును పెంచే అవకాశం ఉంది. ఐఫోన్ 16ప్రో, ఐఫోన్ 16ప్రో మ్యాక్స్ మోడల్‌లు వరుసగా 6.27-అంగుళాల (159.31ఎమ్ఎమ్) 6.85-అంగుళాల (174.06 ఎమ్ఎమ్) డిస్‌ప్లేలతో రానున్నాయి.

కొత్త క్యాప్చర్ బటన్ :
గత నెలలో, ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్రో మోడల్‌లు ఈ ఏడాది చివరిలో భారీ బ్యాటరీలతో రావొచ్చునని నివేదిక తెలిపింది. అయితే, ఐఫోన్ 16 ప్లస్ మోడల్ ప్రస్తుత జనరేషన్ ఐఫోన్ 15 ప్లస్ కన్నా చిన్న బ్యాటరీతో రావచ్చు.. టిప్‌స్టర్ ప్రకారం.. ఆపిల్ ఐఫోన్ 16 ప్రో మోడల్‌లలో రాబోయే ఇతర అప్‌గ్రేడ్‌లు వేగవంతమైన ఎ18 చిప్‌ను కలిగి ఉంటాయి.

కంపెనీ ఐఓఎస్ 18 మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఆన్-డివైస్ జెనరేటివ్ ఏఐ ఫీచర్‌లకు పవర్ అందిస్తుందని భావిస్తున్నారు. నివేదికల ప్రకారం.. ఈ ఏడాదిలో ఆపిల్ ఐఫోన్ 16 సిరీస్‌లో కొత్త ‘క్యాప్చర్’ బటన్‌ను ప్రవేశపెట్టనుంది. యూజర్లు ఈ బటన్ ద్వారా ఫోటోలను క్యాప్చర్ చేయొచ్చు.

Read Also : Motorola Razr 50 Ultra : మోటోరోలా నుంచి మడతబెట్టే ఫోన్.. రెజర్ 50 అల్ట్రా ధర, స్పెసిఫికేషన్‌లు లీక్!

ట్రెండింగ్ వార్తలు