Motorola Razr 50 Ultra : మోటోరోలా నుంచి మడతబెట్టే ఫోన్.. రెజర్ 50 అల్ట్రా ధర, స్పెసిఫికేషన్‌లు లీక్!

Motorola Razr 50 Ultra : మోటోరోలా రెజర్ 50 అల్ట్రా ఫోల్డబుల్ ఫోన్ వచ్చేస్తోంది. రాబోయే ఈ కొత్త ఫోన్ ధర, స్పెషిఫికేషన్ల వివరాలు లీక్ అయ్యాయి. ట్రిపుల్ బ్యాక్ కెమెరా సెటప్ వంటి ఫీచర్లు ఉండవచ్చు.

Motorola Razr 50 Ultra : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ మేకర్ మోటోరోలా నుంచి సరికొత్త ఫోల్డబుల్ ఫోన్ రాబోతోంది. మోటోరోలా రెజర్ 50 అల్ట్రా గ్లోబల్ మార్కెట్లో లాంచ్‌కు రెడీగా ఉంది. ఈ ఫోన్ లాంచ్‌కు ముందు స్పెసిఫికేషన్‌లు, ధర వివరాలు లీక్ అయ్యాయి. ఈ ఫోల్డబుల్ ఫోన్ భారతీయ మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. గతంలో మోటోరోలా రెజర్ 40 అల్ట్రా ఫోన్ లాంచ్ చేసింది. ఇటాలియన్ రిటైలర్ లీక్ డేటా ప్రకారం.. మోటోరోలా రెజర్ 50 అల్ట్రా సుమారు 1,200 యూరోల ధర ట్యాగ్‌తో మార్కెట్లోకి రావచ్చు. 12జీబీ ర్యామ్, 512జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ మోడల్‌ ధర మన భారత కరెన్సీలో దాదాపు రూ. 1,07,634.96 ఉండవచ్చు.

Read Also : Moto G64 5G Sale : కొత్త ఫోన్ కొంటున్నారా? మోటో G64 5జీ ఫోన్ సేల్.. ఫీచర్లు చూస్తే ఫిదానే.. ధర ఎంతంటే?

గత ఏడాదిలో ఈయూలో రెజర్ 40 అల్ట్రా 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజీ వేరియంట్ ఇదే ధర‌కు వచ్చింది. మోటోరోలా రెజర్ 50 అల్ట్రా ఫోన్ వివిధ మెమరీ కాన్ఫిగరేషన్‌లలో రావచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ ఫోన్ మొత్తం 3 కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుందని భావిస్తున్నారు. ప్యాన్‌టోన్-సర్టిఫైడ్ పీచ్ ఫజ్, బ్లూ, గ్రీన్ కలర్ ఆప్షన్లలో ఉండవచ్చు.

డిజైన్ విషయానికొస్తే.. :
రేజర్ 50 అల్ట్రా మోడల్ వెర్షన్ల మాదిరిగా ఉంటుందని లీక్ డేటా సూచిస్తోంది. డ్యూయల్ బ్యాక్ కెమెరాలు టాప్ లెఫ్ట్ కార్నర్‌లో అడ్డంగా, వెనుకవైపు రేజర్ బ్రాండింగ్‌తో కనిపిస్తాయి. ఫ్రంట్ సైడ్ వైపు సెల్ఫీ కెమెరాకు హోల్ పంచ్ కటౌట్‌ను కలిగి ఉంది. ముందున్న మోడల్‌తో పోలిస్తే.. సన్నగా ఉండే బెజెల్‌లు ఉంటాయి. మల్టీ టాస్కింగ్ కోసం సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్ అందించనుంది. రెజర్ 40 అల్ట్రా మాదిరిగానే కవర్ డిస్‌ప్లే ఉంటుందని భావిస్తున్నారు.

హార్డ్‌వేర్ విషయానికొస్తే.. :
మోటోరోలా రెజర్ 50 అల్ట్రా క్వాల్‌కామ్ స్పాప్‌డ్రాగన్ 7 ప్లస్ జనరేషన్ 2 ప్రాసెసర్, 8జీబీ ర్యామ్, 6.9-అంగుళాల డిస్‌ప్లే, 64ఎంపీ ప్రధాన సెన్సార్‌తో ట్రిపుల్ బ్యాక్ కెమెరా సెటప్, 32ఎంపీ సెల్ఫీ కెమెరాతో రానుంది. 4200ఎంఎహెచ్ బ్యాటరీని కూడా అందించే అవకాశం ఉందని భావిస్తున్నారు. మోటోరోలా రెజర్ 50 అల్ట్రా మోడల్ నంబర్‌లు ఎక్స్ట్‌టీ-24510-3, ఎక్స్‌టీ-2451తో వెబ్‌సైట్ లిస్టింగ్‌లో అందుబాటులో ఉండనుంది.

Read Also : Motorola Edge 50 Fusion : ఈ నెల 16న మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ ఫోన్ వచ్చేస్తోంది.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

ట్రెండింగ్ వార్తలు