Redmi Note 14 Pro Launch : రెడ్‌మి నోట్ 14ప్రో వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే కీలక ఫీచర్లు లీక్..!

Redmi Note 14 Pro Launch : ఈ ఫోన్ లాంచ్‌కు ముందు టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ రాబోయే స్మార్ట్‌ఫోన్ అంచనా ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లను షేర్ చేసింది. డిజిటల్ చాట్ స్టేషన్ ప్రకారం.. రెడ్‌మి నోట్ 14ప్రో 1.5కె మైక్రో కర్వ్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది.

Redmi Note 14 Pro Launch : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం రెడ్‌మి నుంచి సరికొత్త 14 ప్రో ఫోన్ వచ్చేస్తోంది. ఈ సరికొత్త ఫోన్ ఇటీవలే ఐఎమ్ఈఐ డేటాబేస్‌లో కనిపించింది. గత ఏడాదిలో రెడ్‌మి నోట్ 13 సిరీస్ ద్వారా రెడ్‌మి నోట్ 14ప్రో వచ్చే సెప్టెంబర్‌లో చైనాలో లాంచ్ కానుందని జాబితా సూచిస్తుంది. చైనాలో లాంచ్ తర్వాత కొత్త రెడ్‌మి నోట్ 14 సిరీస్ వచ్చే ఏడాది ప్రారంభంలో భారత్ సహా ఇతర మార్కెట్‌లకు విస్తరించే అవకాశం ఉంది.

Read Also : Redmi Note 13 Pro 5G : కొత్త ఫోన్ కొంటున్నారా? రెడ్‌‌మి నోట్ 13ప్రో కొత్త కలర్ వేరియంట్ ఇదిగో.. ఫీచర్లు అదుర్స్, ధర ఎంతంటే?

రెడ్‌మి నోట్ 14 సిరీస్‌లో రెడ్‌మి నోట్ 14, రెడ్‌మి నోట్ 14ప్రో, రెడ్‌మి నోట్ 14ప్రో ప్లస్ వంటివి ఉంటాయి. ఈ ఫోన్ లాంచ్‌కు ముందు టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ రాబోయే స్మార్ట్‌ఫోన్ అంచనా ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లను షేర్ చేసింది. డిజిటల్ చాట్ స్టేషన్ ప్రకారం.. రెడ్‌మి నోట్ 14ప్రో 1.5కె మైక్రో కర్వ్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ‘మైక్రో-కర్వ్డ్’ అనే పదం స్క్రీన్ ఎడ్జ్ వద్ద కర్వ్ కలిగి ఉంటుందని సూచిస్తుంది. అదనంగా, స్క్రీన్ సెల్ఫీ కెమెరాతో పంచ్-హోల్ కటౌట్‌ను కూడా కలిగి ఉంటుందని భావిస్తున్నారు.

కెమెరా పరంగా, రెడ్‌మి ఫోన్ 50ఎంపీ ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. రెడ్‌మి నోట్ 13 ప్రోలో కనిపించే 200ఎంపీ కెమెరా నుంచి డౌన్‌గ్రేడ్‌ను సూచిస్తోంది. రెడ్‌మి నోట్ 14 ప్రో ఉన్నతమైన సెన్సార్‌ను ఉపయోగిస్తుందని అంచనా. సోనీ లిటియా ఎల్‌వైటి-600 అనే ఈ సెన్సార్ అప్‌గ్రేడ్ లో-రిజల్యూషన్ ఉన్నప్పటికీ క్వాలిటీ ఫొటోలను అందించే అవకాశం ఉంది. అయితే, గత వెర్షన్ల మాదిరిగా కాకుండా రెడ్‌మి నోట్ 14 ప్రో టెలిఫోటో లెన్స్‌ను కలిగి ఉంటుందని అంచనా. ప్రైమరీ కెమెరా పర్ఫార్మెన్స్ మెరుగుపరచడంపై దృష్టిసారిస్తుంది.

రెడ్‌మి ఫోన్‌లో మరిన్ని అప్‌గ్రేడ్స్ ఉండే ఛాన్స్ :
హుడ్ కింద రెడ్‌మి నోట్ 14ప్రో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జనరేషన్ 3 ఎస్ఓసీ ద్వారా పవర్ పొందుతుంది. ఈ ఫోన్ 5,000mAh బ్యాటరీని కలిగి ఉండే అవకాశం ఉంది. సింగిల్ ఛార్జ్‌పై లాంగ్ టైమ్ వినియోగాన్ని అందిస్తుంది. రాబోయే రెడ్‌మి నోట్ 14ప్రో ముందున్న రెడ్‌మి నోట్ 13ప్రోతో పోల్చి చూస్తే.. అనేక మార్పులు, అప్‌గ్రేడ్‌లు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఈ ఏడాది జనవరిలో భారత్‌లో లాంచ్ అయిన రెడ్‌మి నోట్ 13 ప్రో, 6.67-అంగుళాల 1.5కె అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జనరేషన్ 2 చిప్‌తో ఆధారితమైనది. 200ఎంపీ ప్రైమరీ సెన్సార్, 8ఎంపీ అల్ట్రా-వైడ్ కెమెరా, 2ఎంపీ మాక్రో కెమెరాతో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. రెడ్‌మి నోట్ 14 ప్రో అధునాతన ప్రైమరీ సెన్సార్‌ను కలిగి ఉంటుంది.

Read Also : Best Tech Deals 2024 : కొత్త ఫోన్ ఏది కొంటే బెటర్.. ఐఫోన్ 14 ప్లస్, మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో ఫోన్లపై అదిరే ఆఫర్లు..!

ట్రెండింగ్ వార్తలు