200 కోట్లు జ‌స్ట్ మిస్‌.. క‌ల్కి ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్ ఎంతంటే..?

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ న‌టించిన మూవీ కల్కి 2898AD.

Kalki First Day Collections : రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ న‌టించిన మూవీ కల్కి 2898AD. నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమా గురువారం (జూన్ 27)న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. విడుద‌లైన అన్నిచోట్ల పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. ఈ మూవీలోని విజువల్స్, యాక్షన్ సీన్స్, మహాభారతం సీన్స్ చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. కలియుగాంతానికి, మహాభారతానికి లింక్ పెట్టి నాగ్ అశ్విన్ అదిరిపోయే చిత్రాన్ని తీశాడ‌ని అంటున్నారు.

ఇదిలా ఉంటే.. కల్కి మూవీ కలెక్షన్స్‌లో దుమ్ములేపుతోంది. క‌ల్కీ మూవీ తొలి రోజు ప్ర‌పంచ వ్యాప్తంగా 191.5 కోట్లు క‌లెక్ట్ చేసింది. ఈ విష‌యాన్ని చిత్ర బృందం అధికారికంగా వెల్ల‌డించింది. బాక్సాఫీస్ సమాచారం ప్రకారం.. తెలుగులో రూ.70 కోట్లు, హిందీలో రూ.25 కోట్లు, మిగిలిన భాషల్లో రూ.10 కోట్లకు పైగా క‌లెక్ష‌న్లు సాధించింది. భార‌త్‌లో కల్కి సినిమా దాదాపు 115 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసినట్టు సమాచారం.

Also Read: ‘కల్కి’లో ప్రభాస్ చేసిన పాత్ర.. ఆల్రెడీ ఏక్ నిరంజన్ సినిమాలోనే చేసేసాడు తెలుసా..?

ఆర్ఆర్ఆర్ రికార్డు సేఫ్..
తెలుగులో మొదటిరోజు అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా ఆర్ఆర్ఆర్ ఉంది. ఈ సినిమా తొలి రోజు రూ.223 కోట్లు రాబ‌ట్టింది. ఆ తర్వాత బాహుబలి 2 సినిమా రూ.217 కోట్లతో రెండో స్థానంలో ఉంది. చాలా మంది ఈ రెండు సినిమాల‌ను క‌ల్కి బ్రేక్ చేస్తుంద‌ని అంచ‌నా వేశారు. అయితే.. ఈ రెండిటిని కల్కి సినిమా బ్రేక్ చేయ‌లేదు. రూ.200 కోట్ల‌కు కొద్ది దూరంలో ఆగిపోయింది.

Also Read: ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ తీసేసిన విశ్వక్ సేన్.. సోషల్ మీడియాకి మొత్తానికే దూరం.. ఆ ఇష్యూ తరవాతే..

ట్రెండింగ్ వార్తలు