Best Tech Deals 2024 : కొత్త ఫోన్ ఏది కొంటే బెటర్.. ఐఫోన్ 14 ప్లస్, మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో ఫోన్లపై అదిరే ఆఫర్లు..!

Best Tech Deals of the Week : మోటోరోలా ఎడ్జ్ 50ప్రో లాంచ్ ధర రూ.31,999 నుంచి తగ్గింది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ధర రూ. 29,999కు అందిస్తోంది. ఈ మోడల్ 144Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల 1.5కె పీఓఎల్ఈడీ కర్వ్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది.

Best Tech Deals of the Week : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? ఈ వారంలో అద్భుతమైన ఫోన్ డీల్స్ అందుబాటులో ఉన్నాయి. హై పర్ఫార్మాన్స్ అందించే ఫోన్లలో రియల్‌మిజీటీ 6టీ నుంచి పవర్‌ఫుల్ మోటోరోలా ఎడ్జ్ 50ప్రో, ఫీచర్-ప్యాక్డ్ పోకో ఎక్స్6ప్రో 5జీ వరకు టాప్ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ తగ్గింపులు ఉన్నాయి.

ఆపిల్ ఐఫోన్లలో ఐఫోన్ 14 ప్లస్, ఆపిల్ వాచ్ సిరీస్ 9లో భారీ సేవింగ్స్ అందిస్తున్నాయి. మీ ఫోన్‌ని అప్‌గ్రేడ్ చేయాలన్నా లేదా మీ ఫిట్‌నెస్ పెంచుకోవాలని ఆలోచిస్తున్నా ఈ స్మార్ట్‌ఫోన్ డీల్స్ పొందవచ్చు. ఏయే స్మార్ట్ ఫోన్ల ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Read Also : Realme GT 6 Sale : రియల్‌మి జీటీ 6 ఫోన్ ఫస్ట్ సేల్ మొదలైందోచ్.. ఈ 3 వేరియంట్ల ధర ఎంతంటే?

రియల్‌మి జీటీ 6టీ :
రియల్‌మి జీటీ 6టీ లాంచ్ ధర రూ. 32,999 ఉండగా, ప్రస్తుతం అమెజాన్‌లో రూ. 28,999కు అందుబాటులో ఉంది. స్పెసిఫికేషన్‌లలో 6.78-అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ+ ఎల్‌టీపీఓ అమోల్డ్ డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్, స్నాప్‌డ్రాగన్ 7+ జనరేషన్ 3 చిప్ ద్వారా అందిస్తోంది. కెమెరా సెటప్‌లో 50ఎంపీ ప్రైమరీ సెన్సార్, 8ఎంపీ వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీల కోసం ఇష్టపడే వారికి 32ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది. 120డబ్ల్యూ సూపర్ వూక్ ఛార్జింగ్‌తో కూడిన 5,500mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14-ఆధారిత రియల్‌మి యూఐ 5పై రన్ అవుతుంది.

మోటోరోలా ఎడ్జ్ 50ప్రో :
మోటోరోలా ఎడ్జ్ 50ప్రో లాంచ్ ధర రూ.31,999 నుంచి తగ్గింది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ధర రూ. 29,999కు అందిస్తోంది. ఈ మోడల్ 144Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల 1.5కె పీఓఎల్ఈడీ కర్వ్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7 జనరేషన్ 3 ఎస్ఓసీ కలిగి ఉంది. కెమెరా సెటప్‌లో 50ఎంపీ ప్రైమరీ సెన్సార్, 13ఎంపీ అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్, 10ఎంపీ టెలిఫోటో షూటర్ ఉన్నాయి. 50ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంది. 4,500mAh బ్యాటరీతో వస్తుంది. దుమ్ము, నీటి నిరోధకతకు ఐపీ68 రేటింగ్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14-ఆధారిత హాలో యూఐపై రన్ అవుతుంది.

పోకో X6ప్రో 5జీ :
ఫ్లిప్‌కార్ట్‌లో పోకో ఎక్స్6ప్రో 5జీ ఫోన్ ధర రూ. 23,499కు అందిస్తోంది. ఈ ఫోన్ అసలు లాంచ్ ధర రూ. 26,999కు పొందవచ్చు. 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల 1.5కె డిస్‌ప్లేను కలిగి ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 8300 అల్ట్రా ఎస్ఓసీ ద్వారా పనిచేస్తుంది. ఈ ఐఫోన్ 64ఎంపీ ప్రైమరీ సెన్సార్, 8ఎంపీ అల్ట్రా-వైడ్ కెమెరా, 2ఎంపీ మాక్రో కెమెరాతో ట్రిపుల్-కెమెరా సెటప్ ఉన్నాయి. సెల్ఫీల కోసం 16ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 14-ఆధారిత హైపర్‌ఓఎస్‌తో రన్ అవుతుంది.

ఐఫోన్ 14 ప్లస్ :
ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 14 ప్లస్ ఇప్పుడు రూ. 55,099కు అందుబాటులో ఉంది. ఈ ఐఫోన్ సాధారణ ధర రూ. 66,999కు ఉండగా, ఈ మోడల్ 6.7-అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఎ15 బయోనిక్ చిప్ ద్వారా పవర్ పొందుతుంది. 12ఎంపీ ప్రైమరీ సెన్సార్, 12ఎంపీ అల్ట్రా-వైడ్ సెన్సార్‌తో డ్యూయల్-కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఫోటోనిక్ ఇంజిన్, సినిమాటిక్ మోడ్ వంటి అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉంది. శాటిలైట్ ద్వారా అత్యవసర ఎస్ఓఎస్‌కి కూడా సపోర్టు ఇస్తుంది. అదనపు భద్రతా ఫీచర్ అని చెప్పవచ్చు.

ఆపిల్ వాచ్ సిరీస్ 9 :
ఆపిల్ వాచ్ సిరీస్ 9 ఇప్పుడు అమెజాన్‌లో రూ.35,999లకు అందుబాటులో ఉంది. ఈ వాచ్ ప్రారంభ ధర రూ. 44,999. ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండాలనేవారికి ఈ వాచ్ బెస్ట్ ఆప్షన్. ఉష్ణోగ్రత, హృదయ స్పందన రేటును పర్యవేక్షించడానికి అధునాతన సెన్సార్‌లతో వస్తుంది. పూర్తి ఆరోగ్య సమాచారాన్ని అందిస్తుంది. మీ వర్కవుట్‌లను ట్రాక్ చేస్తున్నా మీ నిద్రతో పాటు మీ గుండె ఆరోగ్యంపై కూడా ఎప్పటికప్పుడూ సమాచారాన్ని ఆపిల్ వాచ్ సిరీస్ 9 ట్రాకింగ్ చేస్తుంది.

Read Also : Realme P1 Pro Sale : కొత్త ఫోన్ కొంటున్నారా? రియల్‌మి పి1 ప్రో సేల్ మొదలైందోచ్.. ఈ స్పెషల్ ధర ఎంతో తెలుసా?

ట్రెండింగ్ వార్తలు