IND vs ENG : ఇట్స్ టైమ్ ఫ‌ర్ ల‌గాన్‌.. ఇంగ్లాండ్ పై టీమ్ఇండియా స్వీట్ రివెంజ్‌.. మీమ్స్ వైర‌ల్‌..

పొట్టి ప్ర‌పంచ‌క‌ప్‌లో రోహిత్ సార‌థ్యంలో భార‌త్ దుమ్ములేపుతోంది.

పొట్టి ప్ర‌పంచ‌క‌ప్‌లో రోహిత్ సార‌థ్యంలో భార‌త్ దుమ్ములేపుతోంది. ఒక్క మ్యాచుల్లోనూ ఓడిపోకుండా ఫైన‌ల్‌కు చేరుకుంది. రెండో సారి టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌ను ముద్దాడేందుకు భార‌త్ కేవ‌లం అడుగు దూరంలో నిలిచింది. సెమీఫైన‌ల్‌లో ఇంగ్లాండ్ పై టీమ్ఇండియా 68 ప‌రుగుల తేడాతో ఘ‌న విజ‌యాన్ని సొంతం చేసుకుంది. గురువారం గ‌యానా వేదిక‌గా ఈ మ్యాచ్ జ‌రిగింది. ప్ర‌స్తుతం టీమ్ఇండియా పై ప్ర‌శంస‌ల వర్షం కురుస్తోంది.

2022 టీ20 ప్ర‌పంచ‌క‌ప్ సెమీ ఫైన‌ల్‌లో భార‌త్ ఇంగ్లాండ్ చేతిలో ఘోర ప‌రాజ‌యం పాలైన సంగ‌తి తెలిసిందే. తాజా ప్ర‌పంచ‌క‌ప్ ఎడిష‌న్‌లో సెమీ ఫైన‌ల్‌లోనే ఇంగ్లాండ్‌ను భార‌త జ‌ట్టు చిత్తు చిత్తుగా ఓడించ‌డంతో భార‌త అభిమానుల సంబ‌రాలు అంబ‌రాన్ని అంటాయి. భార‌త్ ప్ర‌తీకారం తీర్చుకుంది అంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఈ క్ర‌మంలో టీమ్ఇండియా ఆట‌గాళ్ల ముఖాల‌తో బాలీవుడ్ సినిమా ల‌గాన్ పోస్ట‌ర్‌తో కూడిన మీమ్స్‌ను పోస్ట్ చేస్తూ ఆనంద‌ప‌డుతున్నారు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన మీమ్స్ వైర‌ల్‌గా మారాయి.

Shafali Verma : చ‌రిత్ర సృష్టించిన షెఫాలీ వ‌ర్మ.. టెస్టుల్లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచ‌రీ.. 22 ఏళ్ల త‌రువాత..

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. టీమ్ఇండియా తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో ఏడు వికెట్ల న‌ష్టానికి 171 ప‌రుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌(57 39 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) హాఫ్ సెంచ‌రీ బాదాడు. సూర్య‌కుమార్ యాద‌వ్ (47 36 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) హార్దిక్ పాండ్యా (23 13 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స‌ర్లు) లు మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. ఇంగ్లాండ్ బౌల‌ర్ల‌లో క్రిస్ జోర్డాన్ మూడు వికెట్లు తీశాడు.

అనంత‌రం ల‌క్ష్య ఛేద‌న‌లో ఇంగ్లాండ్ 16.4 ఓవ‌ర్ల‌లో 103 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. హ్యారీ బ్రూక్ (25), జోస్ బ‌ట్ల‌ర్ (23), జోఫ్రా ఆర్చ‌ర్ (21) లు ఫ‌ర్వాలేద‌నిపించ‌గా మిగిలిన వారు విఫ‌లం కావ‌డంతో 68 ప‌రుగుల తేడాతో భార‌త్ ఘ‌న విజ‌యం సాధించింది.

ట్రెండింగ్ వార్తలు