Shafali Verma : చ‌రిత్ర సృష్టించిన షెఫాలీ వ‌ర్మ.. టెస్టుల్లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచ‌రీ.. 22 ఏళ్ల త‌రువాత..

టీమ్ఇండియా ఓపెన‌ర్ షెఫాలీ వ‌ర్మ అరుదైన ఘ‌నత సాధించింది.

Shafali Verma : చ‌రిత్ర సృష్టించిన షెఫాలీ వ‌ర్మ.. టెస్టుల్లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచ‌రీ.. 22 ఏళ్ల త‌రువాత..

Shafali Verma hit double century in women test cricket for india after 22 years

Shafali Verma double century : టీమ్ఇండియా ఓపెన‌ర్ షెఫాలీ వ‌ర్మ అరుదైన ఘ‌నత సాధించింది. మ‌హిళ‌ల టెస్టు క్రికెట్‌లో వేగ‌వంత‌మైన డ‌బుల్ సెంచ‌రీ చేసిన ప్లేయ‌ర్‌గా చ‌రిత్ర సృష్టించింది. చెన్నైలోని చిదంబ‌రం స్టేడియంలో ద‌క్షిణాఫ్రికా మ‌హిళ‌ల‌తో జ‌రుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో షెఫాలీ వ‌ర్మ ఈ ఘ‌న‌త‌ను అందుకుంది. 194 బంతుల్లో 22 ఫోర్లు, 8 సిక్స‌ర్లు బాది డ‌బుల్ సెంచ‌రీని అందుకుంది.

గ‌తంలో ఈ రికార్డు ఆస్ట్రేలియా ప్లేయ‌ర్ అన్నాబెల్ స‌ద‌ర్లాండ్ పేరిట ఉండేది. ఆమె 2024 ఫిబ్రవరి నెలలో దక్షిణాఫ్రికాపై 248 బంతుల్లో ద్విశ‌త‌కం సాధించింది. వీరిద్ద‌రి త‌రువాత ఇంగ్లాండ్‌ పై 306 బంతుల్లో డబుల్ సెంచరీ చేసిన ఆస్ట్రేలియాకు చెందిన కరెన్ రోల్టన్ మూడో స్థానంలో ఉంది.

Bapu Memes : సెమీస్‌లో ఇంగ్లాండ్ పై విజ‌యం.. ‘ బాపు ‘ మీమ్స్ వైర‌ల్‌..

22 ఏళ్ల త‌రువాత మొద‌టి ప్లేయ‌ర్‌..

భార‌త మ‌హిళ‌ల టెస్టు క్రికెట్‌లో డ‌బుల్ సెంచ‌రీ చేసిన రెండో ప్లేయర్‌గా షెఫాలీ వ‌ర్మ రికార్డుల‌కు ఎక్కింది. అంత‌క‌ముందు 2002లో మిథాలీ రాజ్ ఈ ఘ‌న‌త సాధించింది. ఆమె ఇంగ్లాండ్ పై 214 ప‌రుగులు చేసింది.

Viral Video: ఈ అంపైర్‌కి ఏమైంది? షేక్‌హ్యాండ్ ఇవ్వూ.. అరె నిన్నే బుమ్రా అడుగుతున్నాడు..

ఈమ్యాచ్‌లో స్మృతి మంధానతో క‌లిసి ఓపెన‌ర్‌గా బ‌రిలోకి దిగిన షెఫాలీ వ‌ర్మ ద‌క్షిణాఫ్రికా బౌల‌ర్ల‌పై విరుచుకుప‌డింది. బంతి ప‌డితే చాలు బౌండ‌రీ అన్న‌ట్లుగా చెల‌రేగుతోంది. 113 బంతుల్లో సెంచ‌రీ చేసింది. మ‌రో 81 బంతుల్లోనే ద్విశ‌త‌కాన్ని అందుకోవ‌డం విశేషం. కాగా.. షెఫాలీ టెస్టు కెరీర్‌లో ఇదే తొలి డ‌బుల్ సెంచ‌రీ కావ‌డం విశేషం. ఈ మ్యాచ్ కు షెఫాలీకి టెస్టుల్లో 5వ మ్యాచ్ కావ‌డం గ‌మ‌నార్హం.

ఇక ఈమ్యాచ్‌లో మొత్తంగా 197 బంతులు ఎదుర్కొన్న షెఫాలీ 23 ఫోర్లు, 8 సిక్స‌ర్ల‌తో 205 ప‌రుగులు చేసింది. మ‌రో ఓపెన‌ర్ స్మృతి మంధాన (149)సెంచ‌రీతో రాణించ‌డంతో భార‌త్ 76 ఓవ‌ర్ల‌లో మూడు వికెట్ల న‌ష్టానికి 411 ప‌రుగులు చేసింది. ప్ర‌స్తుతం రోడ్రిక్స్ (38), హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ (0) లు ఉన్నారు.