Bapu Memes : సెమీస్‌లో ఇంగ్లాండ్ పై విజ‌యం.. ‘ బాపు ‘ మీమ్స్ వైర‌ల్‌..

టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో టీమ్ఇండియా అద‌ర‌గొడుతోంది

Bapu Memes : సెమీస్‌లో ఇంగ్లాండ్ పై విజ‌యం.. ‘ బాపు ‘ మీమ్స్ వైర‌ల్‌..

Bapu Memes Flood Internet As India Knock England

టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో టీమ్ఇండియా అద‌ర‌గొడుతోంది. వ‌రుస విజ‌యాలు సాధిస్తూ ఫైన‌ల్‌కు దూసుకువ‌చ్చింది. గ‌యానా వేదిక‌గా గురువారం ఇంగ్లాండ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో భార‌త్ 68 ప‌రుగుల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. దీంతో రెండేళ్ల క్రితం ఇంగ్లాండ్ చేతిలో ఎదురైన ఘోర ప‌రాజ‌యానికి టీమ్ఇండియా ప్ర‌తీకారం తీర్చుకున్న‌ట్లుగా అభిమానులు భావిస్తున్నారు.

భార‌త విజ‌యంలో స్పిన్న‌ర్లు కీల‌క పాత్ర పోషించారు. అక్ష‌ర్ ప‌టేల్‌, కుల్దీప్ యాద‌వ్ ఇద్ద‌రూ క‌లిసి ఆరు వికెట్లు ప‌డ‌గొట్టారు. ఈ మ్యాచ్‌లో భార‌త్ మొద‌ట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 171 ప‌రుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌(39 బంతుల్లో 57), సూర్య‌కుమార్ యాద‌వ్ (36 బంతుల్లో 47) రాణించారు. అనంత‌రం ల‌క్ష్య ఛేద‌న‌లో ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌ను దూకుడుగా ప్రారంభించింది.

Viral Video: ఈ అంపైర్‌కి ఏమైంది? షేక్‌హ్యాండ్ ఇవ్వూ.. అరె నిన్నే బుమ్రా అడుగుతున్నాడు..

అయితే.. స్పిన్న‌ర్ అక్ష‌ర్ ప‌టేల్ ఆ జ‌ట్టుకు క‌ళ్లెం వేశాడు. 20 ప‌రుగుల వ్య‌వ‌ధిలో మూడు కీల‌క‌మైన వికెట్లు (జోస్ బ‌ట్ల‌ర్‌, మోయిన్ అలీ, బెయిర్ స్టో) తీసి భార‌త గెలుపుకు పునాది వేశాడు. మొత్తంగా అక్ష‌ర్ తన నాలుగు ఓవ‌ర్ల కోటాలో 23 ప‌రుగులు ఇచ్చి మూడు వికెట్లు ప‌డ‌గొట్టాడు.

ల‌క్ష్య‌చేధ‌న‌లో ఇంగ్లాండ్ 16.4 ఓవ‌ర్ల‌లో 103 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. ఇంగ్లాండ్ టాప్ ఆర్డ‌ర్ బ్యాట‌ర్ల‌ను పెవిలియ‌న్‌కు చేర్చినందుకు అక్ష‌ర్ పై ప్ర‌స్తుతం ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తోంది. అక్ష‌ర్ ప్ర‌ద‌ర్శ‌న‌కు ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపిక అయ్యాడు. మ్యాచ్ త‌రువాత అభిమానులు భార‌త జ‌ట్టులోని బాపును ప్ర‌శంసించ‌డానికి నెటిజ‌న్లు మీమ్స్‌ను పంచుకుంటున్నారు.

T20 World Cup 2024: బార్బడోస్‌లో రోహిత్ సేన… ఫైనల్ మ్యాచుకు సిద్ధమవుతున్న టీమిండియా