T20 World Cup 2024: బార్బడోస్‌లో రోహిత్ సేన… ఫైనల్ మ్యాచుకు సిద్ధమవుతున్న టీమిండియా 

T20 World Cup 2024: ఫైనల్లో టీమిండియాతో సౌతాఫ్రికా తలపడుతుంది.

T20 World Cup 2024: బార్బడోస్‌లో రోహిత్ సేన… ఫైనల్ మ్యాచుకు సిద్ధమవుతున్న టీమిండియా 

Indian cricket team arrived in Barbados

Updated On : June 28, 2024 / 10:43 AM IST

టీ20 ప్రపంచ కప్‌లో సెమీఫైనల్ 2లో ఇంగ్లండ్‌పై ఘన విజయం సాధించిన టీమిండియా ఫైనల్ మ్యాచులో తలపడడానికి సిద్ధమవుతోంది. శనివారం రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. దీంతో టీమిండియా బార్బడోస్ కు చేరుకుంది.

టీమిండియాకు అక్కడి వారు సాదరంగా ఆహ్వానం పలికారు. అక్కడి కెన్సింగ్టన్ ఓవల్ మైదానంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఫైనల్లో టీమిండియాతో సౌతాఫ్రికా తలపడుతుంది. ఈ రెండు జట్లు ఈ టోర్నీలో ఓటమన్నదే ఎరుగకుండా ఫైనల్‌కు చేరుకున్నాయి. ఫైనల్ మ్యాచులో టఫ్ ఫైట్ జరగనుంది.

ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ లాంటి కీలక జట్లను ఓడించిన టీమిండియాపై భారీ అంచనాలు ఉన్నాయి. పదేళ్ల తర్వాత టీ20 ప్రపంచ కప్‌లో ఫైనల్లో భారత్ అడుగు పెట్టింది. కాగా, గురువారం జరిగిన మ్యాచులో టీమిండియా 68 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ పై విజయం సాధించింది. టీమిండియా ఇచ్చిన 172 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో ఇంగ్లాండ్ ఘోరంగా విఫలమై, 16.4 ఓవర్లలో 103 పరుగులకే ఆలౌట్ అయింది.

Also Read: ఇంగ్లాండ్ ఇంటికి.. ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్.. తుది పోరులో సౌతాఫ్రికాతో ఢీ!